ఈనెలలో సూర్యుడు, బుధుడు, గురుడి కదలికల్లో కీలక మార్పులు - ఈ రాశులవారికి లక్ష్మీయోగం!

అక్టోబర్ నెలలో సూర్యుడు, బుధుడు, గురు గ్రహాల కదలికల్లో కీలక మార్పులు రానున్నాయి. అక్టోబర్ 17 నుంచి 31 మధ్య జరిగే ఈ గ్రహ గోచారాలు ఏ రాశుల జాతకాన్ని మారుస్తాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Oct 4, 2026, 11:50:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్ర గణనాల ప్రకారం అక్టోబర్ నెల మిగిలిన రోజులు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. అక్టోబర్ నెల ప్రారంభమై కొద్ది రోజులు పూర్తయినప్పటికీ….. ఈ నెలలో రాబోయే రోజులు గ్రహాల పరివర్తన దృష్ట్యా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అక్టోబర్ ప్రారంభంలోనే, అంటే అక్టోబర్ 3వ తేదీన శుక్ర గ్రహం వృశ్చిక రాశిలో తిరోగమనం చెందింది. ఇక మిగిలిన 27 రోజుల వ్యవధిలోనే ఏకంగా మూడు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను, కదలికలను మార్చుకోబోతున్నాయి.

అక్టోబర్‌లో 3 పెద్ద గ్రహాల సంచారం
అక్టోబర్‌లో 3 పెద్ద గ్రహాల సంచారం

ఈ వరుస గ్రహ మార్పుల ప్రభావం మానవ జీవితంతో పాటు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితిగతులు మరియు కుటుంబ సంబంధాలపై తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా అక్టోబర్ 17న సూర్యుడి రాశి మార్పు, అక్టోబర్ 24న బుధుడి తిరోగమనం, ఆపై నెల చివర్లో అక్టోబర్ 31న బృహస్పతి (గురుడు) జరిపే భారీ సంచారం ద్వాదశ రాశుల జాతకాలను గణనీయంగా ప్రభావితం చేయనున్నాయి. ఏ గ్రహం ఏ రోజున ఎలాంటి మార్పునకు గురవుతుందో, దానివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో వివరంగా ఇక్కడ తెలుసుకోండి……

అక్టోబర్ 17 : తులారాశిలోకి సూర్యుడి ప్రవేశం

నవగ్రహాల అధిపతి అయిన సూర్య భగవానుడు ఆత్మవిశ్వాసం, ఉద్యోగం, ఆధిపత్యం, పరిపాలనా సామర్థ్యాలకు కారకుడు. సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన కన్యారాశి నుంచి నిష్క్రమించి తులారాశిలోకి ప్రవేశించనున్నారు. సూర్యుని ఈ సంక్రమణం ఉద్యోగ వ్యాపార రంగాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

ఈ సమయంలో మేషం, మిథునం, సింహం మరియు ధనుస్సు రాశుల వారికి కార్యాలయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం లేదా ఉన్నతాధికారుల నుంచి పూర్తే సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పరిచయాలు ఏర్పడి…. అవి భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి.

అక్టోబర్ 24 : బుధుడి తిరోగమనం

జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని వ్యాపారం, బుద్ధికుశలత, సంభాషణ (కమ్యూనికేషన్) మరియు తెలివితేటలకు కారకుడిగా భావిస్తారు. అక్టోబర్ 24న బుధుడు వక్రమార్గాలు పట్టి తిరోగమనం చెందనున్నాడు. బుధుడి కదలికల్లో మార్పు రావడం వల్ల వ్యాపారం మరియు ఆర్థిక సంబంధిత విషయాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి.

ఈ సమయంలో మిథునం, కన్యా, తులా, మకర రాశుల వారు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పత్రాలపై సంతకం చేయాలన్నా ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా చదువుకోవడం అవసరం. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తగవు. అయితే, వృషభం మరియు మీన రాశుల వారికి గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి, పెండింగ్ వ్యవహారాలను చక్కదిద్దడానికి ఇది సరైన సమయం.

అక్టోబర్ 31 : బృహస్పతి (గురుడు) భారీ సంచారం

అక్టోబర్ నెలలోనే అత్యంత భారీ గ్రహ మార్పు అక్టోబర్ 31న జరగబోతోంది. దేవగురువైన బృహస్పతి జ్ఞానం, విద్య, వివాహం, సంతానం మరియు సంపదకు మూలకారకుడు. ఈ రోజున గురుడు కర్కాటక రాశిని వీడి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు.

సింహ రాశిలోకి గురుడి ప్రవేశంతో మేషం, కర్కాటకం, సింహం మరియు వృశ్చిక రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు మరియు ప్రమోషన్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలిస్తుంది.

  • మేష రాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు పనుల్లో వేగం పెరుగుతుంది.
  • కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపై కొత్త అవకాశాలు తలుపు తడతాయి.
  • వృశ్చిక రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ ధన లాభం చేకూరుతుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More