...
...
Next Story

OTT Zombie Horror: ఓటీటీలోకి వచ్చిన జాంబీ హారర్ థ్రిల్లర్- ఏకంగా 92 శాతం ఫ్రెష్ కంటెంట్, 7.3 రేటింగ్- ఇక్కడ చూసేయండి!

28 Years Later The Bone Temple OTT Release: ఓటీటీలోకి జాంబీ హారర్ థ్రిల్లర్ మూవీ 28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాకు 92 శాతం ఫ్రెష్ కంటెంట్‌తో పాటు ఐఎమ్‌డీబీలో 7.3 రేటింగ్ సంపాదించుకుంది. మరి 28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Apr 27, 2026, 18:50:29 IST
Advertisement

OTT Zombie Horror Thriller 28 Years Later The Bone Temple Streaming: గతేడాది డాని బోయెల్, అలెక్స్ గార్లాండ్ కాంబినేషన్‌లో వచ్చిన '28 ఇయర్స్ లేటర్' సినిమా హారర్ జోనర్‌లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసింది. ఆ సినిమా అందించిన భయానక అనుభూతి నుంచి ప్రేక్షకులు తేరుకోకముందే, దర్శకురాలు నియా డకోస్టా 'ది బోన్ టెంపుల్'తో మరో లెవల్ థ్రిల్‌ను అందించారు.

92 శాతం ఫ్రెష్ కంటెంట్

ఓటీటీలోకి వచ్చిన జాంబీ హారర్ థ్రిల్లర్- ఏకంగా 92 శాతం ఫ్రెష్ కంటెంట్, 7.3 రేటింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి వచ్చిన జాంబీ హారర్ థ్రిల్లర్- ఏకంగా 92 శాతం ఫ్రెష్ కంటెంట్, 7.3 రేటింగ్- ఇక్కడ చూసేయండి!

సాధారణంగా సీక్వెల్ సినిమాలంటే మొదటి పార్ట్ అంతగా ఉండవనే అపవాదు ఉంటుంది. కానీ, ఈ సినిమా ఏకంగా 92 శాతం ఫ్రెష్ కంటెంట్ అని రాటెన్ టొమాటోస్ రేటింగ్‌తో మునుపటి రికార్డులను తిరగరాసింది. 28 ఇయర్స్ లేటర్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్ ఓటీటీలోకి వచ్చేసింది.

కేవలం భయం మాత్రమే కాకుండా, అదిరిపోయే విజువల్స్‌తో సినిమాటోగ్రఫీ, ఊహించని మలుపులతో ఈ 28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. "ఇది కేవలం ఒక జాంబీ హారర్ థ్రిల్లర్ సినిమా మాత్రమే కాదు.. అంతకు మించి. అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాల కలబోత ఈ చిత్రం" అని హాలీవుడ్ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అసలు కథేంటి?

'28 ఇయర్స్ లేటర్' మూవీ ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే ఈ బోన్ టెంపుల్ కథ మొదలవుతుంది. హోలీ ఐలాండ్ అనే సురక్షిత ప్రాంతం నుంచి బయటకు వచ్చిన యువకుడు స్పైక్ (ఆల్ఫీ విలియమ్స్), ప్రమాదకరమైన జిమ్మీ క్రిస్టల్ (జాక్ ఓ కానెల్) ముఠా చేతిలో చిక్కుకుంటాడు.

ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ రాల్ఫ్ ఫీనెస్ నటన. హ్యారీ పోటర్ సిరీస్‌లో వోల్డ్‌మార్ట్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాల్ఫ్, ఇందులో డాక్టర్ పాత్రలో ఒదిగిపోయారు. ఆయనతో పాటు జాక్ ఓ కానెల్, ఆల్ఫీ విలియమ్స్ తమ నటనతో భయానక ఫీలింగ్ కలిగించారు. హారర్ సినిమాల్లో హింసతో పాటు ఉండే ఆవేదనను వీరు అద్భుతంగా పలికించారు.

92 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా పేరు తెచ్చుకున్న 28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్ సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 7.3 రేటింగ్ సాధించుకుంది. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్, హారర్ థ్రిల్లింగ్ సీన్స్ ఉన్న 28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్ ఇండియన్ ఓటీటీలోకి వచ్చేసింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో 28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 26 ఆదివారం నాడే నెట్‌ఫ్లిక్స్‌లో 28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్ ఓటీటీ రిలీజ్ అయింది. మార్చి 31 నుంచే యూఎస్ఏ వంటి దేశాల్లో ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.

ఇండియాలో మాత్రం నిన్నటి నుంచే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్ మూవీ అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం ఇంగ్లీష్ భాషలో, సబ్ టైటిల్స్‌తో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe