...
...
Next Story

Welcome to the Jungle: 34 మంది స్టార్లు, 50 క్యారవాన్లు, 900 జనాభా- వెల్‌కమ్ టు ది జంగిల్ మూవీ షూటింగ్ సీక్రెట్స్!

Welcome To The Jungle Shooting Secrets Ahmed Khan: అక్షయ్ కుమార్ మెయిన్ హీరోగా నటించిన మల్టీస్టారర్ మూవీ వెల్‌కమ్ టు ది జంగిల్ నేడు (జూన్ 26) థియేటర్లలోకి వచ్చేసింది. ఏకంగా 34 మంది అగ్ర నటీనటులతో కూడిన ఈ సినిమా షూటింగ్ వెనుక ఉన్న ఆసక్తికరమైన మేనేజ్‌మెంట్ రహస్యాలను దర్శకుడు అహ్మద్ ఖాన్ పంచుకున్నారు.

Published on: Jun 26, 2026, 08:47:50 IST
Advertisement

Welcome To The Jungle Shooting Secrets Ahmed Khan: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకే సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోలు ఉంటేనే డేట్స్ సర్దుబాటు చేయడం, సెట్స్‌పై వారిని హ్యాండిల్ చేయడం ప్రొడక్షన్ టీమ్‌కు పెద్ద తలనొప్పిగా మారుతుంది.

34 మంది విభిన్న తరాల స్టార్స్

34 మంది స్టార్లు, 50 క్యారవాన్లు, 900 జనాభా- వెల్‌కమ్ టు ది జంగిల్ మూవీ షూటింగ్ సీక్రెట్స్!
34 మంది స్టార్లు, 50 క్యారవాన్లు, 900 జనాభా- వెల్‌కమ్ టు ది జంగిల్ మూవీ షూటింగ్ సీక్రెట్స్!

అలాంటిది ఏకంగా 34 మంది విభిన్న తరాల నటీనటులను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చి సినిమా తీయడం అంటే అది మామూలు విషయం కాదు. బాలీవుడ్ క్రేజీ ఫ్రాంచైజీ 'వెల్‌కమ్' సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం 'వెల్‌కమ్ టు ది జంగిల్' (Welcome To The Jungle) ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది.

అక్షయ్ కుమార్ నేతృత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ పక్కా కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వెల్‌కమ్ టు ది జంగిల్ నేడు (జూన్ 26) ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో, ఇంత భారీ మంది స్టార్లను ఒకే తాటిపైకి తెచ్చి వెల్‌కమ్ టు ది జంగిల్ సినిమా షూటింగ్ ఎలా పూర్తి చేశారనే లాజిస్టిక్స్ వివరాలను దర్శకుడు అహ్మద్ ఖాన్ ఆసక్తికరంగా వివరించారు.

ఈగో క్లాషెస్ వస్తాయనుకున్నా కానీ,

సాధారణంగా ఇంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒకే చోట చేరినప్పుడు వారి మధ్య విభేదాలు లేదా ఈగో సమస్యలు రావడం సహజం. ఇదే విషయాన్ని దర్శకుడు అహ్మద్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

"షూటింగ్ సమయంలో మేమంతా చాలా సరదాగా గడిపాం. అయితే అంతమందిని తీవ్రమైన ఎండలో, కచ్చితమైన సమయ పాలనతో ఒకే చోటికి చేర్చడం, డేట్స్ సర్దుబాటు చేయడం, కెమెరా ఫ్రేమ్స్ సెట్ చేయడం, భారీ సెట్లు వేయడం వంటివి మాత్రం నరకప్రాయంగా మారాయి" అని డైరెక్టర్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.

50 క్యారవాన్లు.. 900 మంది.. ఒక మినీ జాతర!

వెల్‌కమ్ టు ది జంగిల్ సినిమా నిర్మాణంలో ఎదురైన సవాళ్లను దర్శకుడు గణాంకాలతో సహా విశ్లేషించారు దర్శకుడు. కొన్ని రోజులైతే ఏకంగా 30 మంది ప్రధాన నటులు ఒకే సమయంలో సెట్‌లో ఉండేవారు. సాధారణంగా ప్రతి స్టార్ నటుడితో పాటు వారి వ్యక్తిగత మేకప్ మెన్, హెయిర్ స్టైలిస్ట్, బాడీగార్డ్స్ వంటి కనీసం ఐదుగురు సిబ్బంది ఉంటారు.

ఆ లెక్కన నటుల స్టాఫ్ మాత్రమే దాదాపు 150 మంది దాటేవారు. దీనికి తోడు ప్రొడక్షన్ టీమ్‌లో మరో 200 మంది సిబ్బంది ఉండేవారు. ఇక స్టంట్ మాస్టర్లు, ఫైటర్లు, గుర్రపు స్వారీ చేసేవారు, మరో 150 నుంచి 200 మంది బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టులు, పెద్ద డ్యాన్స్ గ్రూపులు అంతా కలిస్తే కొన్ని రోజుల్లో సెట్‌పై జనాభా సంఖ్య 700 నుంచి 900కి చేరేదని దర్శకుడు వెల్లడించారు.

250 కార్లు

ఈ స్థాయి షూటింగ్ నిర్వహించడం అంటే సినిమా సెట్‌లా కాకుండా ప్రతిరోజూ ఒక భారీ మ్యూజిక్ కాన్సెర్ట్ (సంగీత కచేరీ) నిర్వహించినట్లు ఉండేదని అహ్మద్ ఖాన్ గుర్తుచేసుకున్నారు. ఈ భారీ ఏర్పాట్ల కోసం ప్రొడక్షన్ టీమ్ పక్కపక్కనే ఉన్న రెండు విశాలమైన మైదానాలను అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది.

"కేవలం షూటింగ్ కోసమే కాకుండా, నటీనటుల కోసం ఏకంగా 50 వ్యానిటీ వ్యాన్‌లు (క్యారవాన్లు) పార్క్ చేయడానికి పెద్ద స్థలం అవసరమైంది. దాంతో రెండు పెద్ద గ్రౌండ్స్ తీసుకున్నాం. బ్యాక్‌గ్రౌండ్ నటుల కోసం విడిగా హోల్డింగ్ ఏరియాలు, మెయిన్ యూనిట్ కోసం ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేశాం" అని అహ్మద్ ఖాన్ తెలిపారు.

ఈవెంట్ ఆర్గనైజ్ చేసినట్లుగా

"ఇక వాహనాల రాకపోకల విషయానికి వస్తే.. నటులు, సాంకేతిక నిపుణులు, పర్సనల్ స్టాఫ్ అందరి కార్లు కలిపి రోజుకు 200 నుంచి 250 వాహనాలు సెట్‌కు వచ్చేవి. మా సెట్ నిర్వహణ ఒక సాంప్రదాయ సినిమా షూటింగ్‌లా కాకుండా, ప్రతిరోజూ ఒక పెద్ద లైవ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినట్లు అనిపించేది" అని అహ్మద్ ఖాన్ వివరించారు.

థియేటర్లలో నేడే అసలైన జంగిల్ రైడ్

ఇకపోతే వెల్‌కమ్ టు ది జంగిల్ చిత్రం బాలీవుడ్ సీనియర్, జూనియర్ నటుల కలయిక ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అక్షయ్ కుమార్‌తో పాటు సునీల్ శెట్టి, పరేష్ రావల్, అర్షద్ వార్సి, జాకీ ష్రాఫ్, రవీనా టాండన్, లారా దత్తా, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జానీ లీవర్, శ్రేయాస్ తల్పడే, తుషార్ కపూర్, రాజ్‌పాల్ యాదవ్, దలేర్ మెహందీ, ఊర్వశి రౌటేలా వంటి భారీ తారాగణం ఇందులో నటించారు.

ప్రసిద్ధ హాస్యనటులు కికు శారదా, కృష్ణ అభిషేక్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఇంతటి భారీ స్టార్ కాస్ట్‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks