...
...
Next Story

OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ డ్రామా- ఇంద్రజ, మోహన బాడీ స్వాప్ మ్యాజిక్- ఇక్కడ చూడండి!

Anaganaga O Sukravaram OTT Streaming Today: సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, యంగ్ బ్యూటీ మోహన నటించిన బాడీ స్వాప్ మ్యాజిక్ మూవీ అనగనగా ఓ శుక్రవారం. తెలుగు సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామాగా, తళ్లీకూతుళ్ల ఎమోషన్‌తో తెరకెక్కిన ఈ అనగనగా ఓ శుక్రవారం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 19, 2026, 12:24:27 IST
Advertisement

Anaganaga O Sukravaram OTT Release Today: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, మోహన ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా అనగనగా ఓ శుక్రవారం. సాధారణంగా హాలీవుడ్ చిత్రాలలో ఎక్కువగా కనిపించే 'బాడీ స్వాప్' (ఒకరి శరీరంలోకి మరొకరి ఆత్మ మారడం) అనే సరికొత్త కాన్సెప్ట్‌ను ప్యూర్ ఇండియన్ ఎమోషన్స్‌తో ముడిపెట్టి ఈ సినిమాను రూపొందించారు.

జనరేషన్ గ్యాప్, మనస్పర్థలు

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ డ్రామా- ఇంద్రజ, మోహన బాడీ స్వాప్ మ్యాజిక్- ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ డ్రామా- ఇంద్రజ, మోహన బాడీ స్వాప్ మ్యాజిక్- ఇక్కడ చూడండి!

కేవలం వినోదానికే పరిమితం కాకుండా తల్లి, కూతుళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలు, జనరేషన్ గ్యాప్ వల్ల వచ్చే మనస్పర్థలను ఈ అనగనగా ఓ శుక్రవారం చిత్రంలో చాలా చక్కగా ఆవిష్కరించినట్లు మూవీ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇటీవలి కాలంలో తెలుగు ఓటీటీల్లో ఇలాంటి విభిన్నమైన కథాంశాలతో వస్తున్న చిత్రాలకు ఆదరణ పెరుగుతుండటం గమనార్హం.

తల్లికూతుళ్ల కథ.. ఊహించని మలుపు

ఇంటికి పెద్ద దిక్కు అయిన తండ్రిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోవడానికి కూతురు మేఘన (మోహన) రాత్రింబగళ్లు కష్టపడుతూ ఉద్యోగంలో మునిగిపోతుంది. మరోవైపు భర్తను కోల్పోయిన తల్లి లక్ష్మి (ఇంద్రజ).. కూతురి భద్రతపై అతిగా ఆందోళన చెందుతూ ఆమె జీవితంలోని ప్రతి విషయాన్ని నియంత్రించాలని చూస్తుంది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోలేని తరుణంలో వీరి జీవితంలో ఒక ఊహించని వింత మలుపు చోటు చేసుకుంటుంది.

ఒకరి జీవితంలోకి మరొకరు.. బాడీ స్వాప్ మ్యాజిక్

ఏదో తెలియని మాయ శక్తి కారణంగా ఒక శుక్రవారం రోజు ఉదయం తల్లి, కూతుళ్ల శరీరాలు పరస్పరం మారిపోతాయి. అంటే కూతురి శరీరంలోకి తల్లి, తల్లి శరీరంలోకి కూతురు ప్రవేశిస్తారు. కేవలం ఒక రోజు పాటు జరిగే ఈ విచిత్రమైన మార్పు వారి జీవితాలను ఎలా మార్చేసిందనేదే ఈ సినిమా అసలు కథ.

దీనికి సంబంధించి అనగనగా ఓ శుక్రవారం సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా.. "ప్రతి తల్లి, కూతురు కలిసి కూర్చుని చూడాల్సిన అద్భుతమైన కథ ఇది" అని చిత్ర బృందం ప్రమోషన్స్ సందర్భంగా పేర్కొంది.

ఈటీవీ విన్ ఓటీటీలో

ఇలాంటి అనగనగా ఓ శుక్రవారం ఓటీటీలోకి ఇవాళ (జూలై 19) వచ్చేసింది. ఈటీవీ విన్‌లో (ETV Win) నేటి నుంచి అనగనగా ఓ శుక్రవారం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఓటీటీ రంగంలో వైవిధ్యమైన కంటెంట్‌తో దూసుకుపోతున్న ఈటీవీ విన్ కథా సుధ సిరీస్‌లో భాగంగానే ఇవాళ అనగనగా ఓ శుక్రవారం ఓటీటీ రిలీజ్ అయింది.

ఆకట్టుకునే నటీనటులు.. సాంకేతిక బృందం

చాలా కాలం తర్వాత నటి ఇంద్రజ ఈ సినిమాలో పూర్తి నిడివి ఉన్న ఒక పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారు. మోహన తన నటనతో కూతురి పాత్రకు పూర్తి న్యాయం చేసింది. వీరితో పాటు శ్రీ శరణ్, సునీత మనోహర్, కృష్ణ పెనుమర్తి, షేక్ మాగన్ వలి, కల్యాణ్ పాలగుమ్మి కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి అవినాష్ మంచిరాజు కథ, దర్శకత్వం వహించారు. రికీ మార్టిన్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. శ్రవణ్ శ్రీధర్ అందించిన సంగీతం సినిమాలోని ఎమోషన్స్‌ను మరింతగా ఎలివేట్ చేసింది. లోకేష్ సన్నీ ఛాయాగ్రహణం సమకూర్చగా, నోహ్ మెషెక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

అన్నీ ఎలిమెంట్స్‌తో

బాడీ స్వాప్ వంటి సైన్స్ ఫిక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, తల్లీకూతుళ్ల ఎమోషన్ వంటి ఎలిమెంట్స్ ఉన్న ఈటీవీ విన్ ఓటీటీ మూవీ అనగనగా ఓ శుక్రవారం ఈ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి చూసేందుకు ఒక మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe