ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మంచి హిట్ అందుకుని చాలా కాలం అయింది. మొన్నటివరకు ఉస్తాద్ అని ట్యాగ్‌తో కనపడిని రామ్ పోతినేని పేరు ఇప్పుడు ఇదివరకటి ఎనర్జిటిక్ స్టార్‌గా కనిపిస్తోంది. పేరు మార్పో ఏంటీ తెలియదు కానీ రామ్ పోతినేనికి చాలా కాలం తర్వాత మంచి హిట్ పడిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
ఆంధ్రా కింగ్‌గా ఉపేంద్ర

రామ్ పోతినేనిని హిట్ ఇచ్చిన సినిమానే ఆంధ్రా కింగ్ తాలూకా. హార్ట్ కోర్ అభిమానిగా రామ్ పోతినేని నటించిన ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. అలాగే, రామ్ పోతినేనికి జోడీగా బ్యూటిపుల్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. ఇక కన్నడ స్టార్ ఉపేంద్ర ఆంధ్రా కింగ్‌గా యాక్ట్ చేశాడు.
ఆంధ్రా కింగ్ నటీనటులు
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఆంధ్రా కింగ్ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో రాహల్ రవీంద్రన్, రావు రమేశ్, మురళీ శర్మ, రాజీవ్ కనకాల, తులసి, వీటీవీ గణేష్, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
మంచి రివ్యూస్
భారీ అంచనాలతో నవంబర్ 27న అంటే నిన్న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ. ఈ సినిమాకు రివ్యూస్ నుంచి ఆడియెన్స్ వరకు మంచి రెస్పాన్సే వస్తోంది. ఒక అభిమాని కథను బాగా చూపించారని డైరెక్టర్‌ను మెచ్చుకుంటున్నారు.
హీరోకు 3 కోట్ల సాయం
అలాగే, హీరోకు రూ. 3 కోట్ల సాయం చేసే పిచ్చి అభిమాని పాత్రలో రామ్ పోతినేని ఎనర్జిటిక్‌గా అలరించాడని అంటున్నారు. ఉపేంద్ర స్క్రీన్ ప్రజెన్స్ ఇంపాక్ట్ చూపించేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ నటనతో మరోసారి మెప్పించిందని ప్రశంసిస్తున్నారు.
ఆంధ్రా కింగ్ ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}అలాగే, హీరోకు రూ. 3 కోట్ల సాయం చేసే పిచ్చి అభిమాని పాత్రలో రామ్ పోతినేని ఎనర్జిటిక్‌గా అలరించాడని అంటున్నారు. ఉపేంద్ర స్క్రీన్ ప్రజెన్స్ ఇంపాక్ట్ చూపించేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ నటనతో మరోసారి మెప్పించిందని ప్రశంసిస్తున్నారు.
ఆంధ్రా కింగ్ ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}ఇంత మంచి టాక్ తెచ్చుకుంటున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 8 రేటింగ్ ఉండటం విశేషంగా మారింది. ఇలా ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్న ఆంధ్రా కింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఆసక్తి నెలకొంది. మంచి ధర వెచ్చించి ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
అంటే, నెట్‌ఫ్లిక్స్‌లోనే ఆంధ్రా కింగ్ ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే, సినిమాకు వచ్చే టాక్, బాక్సాఫీస్ కలెక్షన్లను బట్టి ఆంధ్రా కింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే ఆంధ్రా కింగ్ శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ జీ దక్కించుకున్నట్లు సమాచారం.