...
...
Next Story

OTT Diwali: ఓటీటీలో దివాళి ధమాకా- మైండ్ బ్లాక్ చేసే 5 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు- అన్నీ తెలుగులోనే- 2 ఓటీటీల్లో!

OTT Crime Thriller Series To Watch Today Diwali: ఇవాళ దీపావళి పండుగ వేళ కుటుంబంతో కలిసి చూడటానికి ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్న 5 అద్భుతమైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ల జాబితా ఇక్కడ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో అలరిస్తున్న ఇవి చివరి నిమిషం దాకా ఉత్కంఠకు గురిచేస్తాయి.

Published on: Nov 8, 2026, 12:42:30 IST
Advertisement

OTT Crime Thriller Series To Watch Today Diwali: పండుగ సెలవుల్లో కుటుంబంతో కలిసి హాయిగా గడపడం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుభూతి. థియేటర్ల రద్దీ, బయటి హడావుడి లేకుండా ఇంట్లోనే కూర్చుని సరికొత్త సినిమా వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఓటీటీలో నేడు దివాళి ధమాకా

ఓటీటీలో దివాళి ధమాకా- మైండ్ బ్లాక్ చేసే 5 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు- అన్నీ తెలుగులోనే- 2 ఓటీటీల్లో!
ఓటీటీలో దివాళి ధమాకా- మైండ్ బ్లాక్ చేసే 5 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు- అన్నీ తెలుగులోనే- 2 ఓటీటీల్లో!

తెలుగు ప్రేక్షకుల్లో కూడా సస్పెన్స్, ఊహించని ట్విస్టులు ఉండే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇవాళ (నవంబర్ 8) దీపావళి పండుగ రోజు మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెట్టే, అత్యంత ఉత్కంఠభరితమైన ఐదు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ల వివరాలు చూద్దాం.

పాతాళ్ లోక్ (Paatal Lok) – ప్రైమ్ వీడియో

నేర ప్రపంచపు చీకటి కోణాలను ఆవిష్కరించే కథలతో వచ్చినా 'పాతాళ్ లోక్' ఓటీటీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. పోలీస్ ఇన్ స్పెక్టర్ హాథీరామ్ చౌదరి పాత్రలో జైదీప్ అహ్లావత్ నటించిన ఈ ఓటీటీ సిరీస్ రెండు సీజన్లు నెటిజన్లను కట్టిపడేసాయి. ఒక హై-ప్రొఫైల్ కేసు విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చే దిగ్భ్రాంతికర నిజాలు, వ్యవస్థలోని లోపాలను దర్శకుడు తెరపై చూపించిన విధానం అద్భుతమనే చెప్పాలి. సస్పెన్స్ కథలను ఇష్టపడేవారు చ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది.

దహాడ్ (Dahaad) – ప్రైమ్ వీడియో

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సబ్ ఇన్‌స్పెక్టర్ అంజలి భాటి పాత్రలో మెరిసిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'దహాడ్'. రాజస్థాన్ నేపథ్యంలో సాగే ఈ కథలో వరుసగా మహిళలు అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంటారు. ఈ మరణాల వెనుక ఉన్న అసలు సూత్రధారిని పట్టుకోవడానికి అంజలి చేసే శోధన ఉత్కంఠ రేకెత్తిస్తుంది. సమాజంలోని వ్యత్యాసాలు, నేరస్థుల మానసిక వైఖరిని లోతుగా విశ్లేషించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది.

కొహ్రా (Kohrra) – నెట్‌ఫ్లిక్స్

చారిత్రాత్మక రంగా-బిల్లా కేస్ ఆధారంగా రూపొందిన 'రాఖ్' ఈ ఏడాది ఓటీటీ స్ట్రీమింగ్ వేదికగా విశేష ప్రజాదరణ పొందింది. 1978 నాటి దారుణ ఘటనల ఆధారంగా సాగే ఈ కథలో నటుడు అలీ ఫజల్ ఒక దర్యాప్తు అధికారిగా కనిపించారు. ఇద్దరు చిన్నారుల హత్య కేసును ఛేదించడానికి ఆయన పడే తపన, ప్రతి ఎపిసోడ్‌లో వచ్చే ఉత్కంఠభరిత ట్విస్టులు వీక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి.

దల్ దల్ (Daldal) – ప్రైమ్ వీడియో

సైకో-థ్రిల్లర్ కథలను ఇష్టపడే వారి కోసం నటి భూమి పెడ్నేకర్ నటించిన సరికొత్త సిరీస్ 'దల్ దల్'. డీసీపీ రీతాగా భూమి పెడ్నేకర్ ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లే ఈ సిరీస్ ప్రధాన కథాంశం. ఒకవైపు వృత్తిపరమైన ఒత్తిళ్లు, మరోవైపు వ్యక్తిగత జీవితంలోని సమస్యలను అధిగమిస్తూ ఆమె కేసును ఎలా కొలిక్కి తెచ్చిందనేది ఆసక్తికరంగా చూపించారు.

2 ఓటీటీల్లోనే

నేడు పండుగ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి మంచి సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ ఉన్న సిరీస్‌లను వీక్షించాలనుకుంటే తెలుగులో అందుబాటులో ఉన్న ఈ 5 బెస్ట్ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లను మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. పైగా ఇవి అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి 2 ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవడం విశేషం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks