OTT Movies To Watch This Weekend Telugu: వారమంతా పనులతో అలసిపోయిన సినీ ప్రియులు వీకెండ్‌లో ఓటీటీల్లో మంచి కంటెంట్ కోసం వెతుకుతుంటారు. సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ, ఊహించని మలుపులు ఉండే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో ఈ వీకెండ్‌లో తెలుగులో కట్టిపడేసే ది బెస్ట్ 7 క్రైమ్ థ్రిల్లర్ సినిమాలపై ఓ లుక్కేద్దాం.
1. కిష్కింధ కాండం (Kishkindha Kaandam)- జియో హాట్‌స్టార్

ఐఎమ్‌డీబీ రేటింగ్: 8/10
ఒక ఫ్యామిలీ నేపథ్యంలో సాగే అరుదైన మిస్టరీ డ్రామా ఇది. అసిఫ్ ఆలీ, సీనియర్ నటుడు విజయరాఘవన్ పోషించిన అప్పు, పిళ్లై పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. కథను నడిపించిన తీరు, సీన్స్ మూడ్‌ని సెట్ చేసే నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని ఆద్యంతం అలరిస్తాయి. కథనం కాస్త నెమ్మదిగా సాగడం వల్ల స్లో-బర్న్ సినిమాలు నచ్చని వారి ఓపికను పరీక్షించినట్లుగా అనిపించవచ్చు.
2. బైషే శ్రాబొన్ (Baishe Srabon)- అమెజాన్ ప్రైమ్ వీడియో
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.1/10
బెంగాలీ కవితల ఆధారంగా హత్యలు చేసే ఒక సైకో సీరియల్ కిల్లర్ కథతో ఈ చిత్రం రూపొందింది. ప్రసేన్‌జిత్ ఛటర్జీ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం, అనుపమ్ రాయ్ సంగీతం చిత్రానికి ప్రాణం పోశాయి. సబ్‌టైటిల్స్‌తో చూసే సస్పెన్స్ ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన మాస్టర్‌పీస్.
3. పోర్ తొళిల్ (Por Thozhil)- సోనీ లివ్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8/10
ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ పోలీస్ (ఆర్. శరత్‌కుమార్), భయస్తుడైన యంగ్ ఆఫీసర్ (అశోక్ సెల్వన్) కలిసి ఒక సైకోపాత్ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లే ఈ సినిమా. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, సైకలాజికల్ థ్రిల్ అద్భుతంగా పండాయి. డైలాగ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల కథను నిశితంగా గమనించాల్సి ఉంటుంది.
4. సూక్ష్మదర్శిని (Sookshmadarshini)- జియో హాట్‌స్టార్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.8/10
{{/usCountry}}ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.8/10
{{/usCountry}}నజ్రియా నజీమ్, బేసిల్ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం డార్క్ హ్యూమర్, సస్పెన్స్ కలగలిపిన కథాంశంతో సాగుతుంది. పక్కింటి వ్యక్తి ప్రవర్తనపై అనుమానంతో మొదలయ్యే కథ, ఊహించని విధంగా ఒక కీలకమైన సామాజిక అంశాన్ని స్పృశిస్తూ ముగుస్తుంది. నిడివి కాస్త ఎక్కువగా ఉండటం మినహా మిగతా అంతా ఆకట్టుకుంటుంది.
5. కన్నూర్ స్క్వాడ్ (Kannur Squad)- జియో హాట్‌స్టార్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.6/10
మమ్ముట్టి నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫిక్షన్ హంగామా లేకుండా, పరిమిత వనరులతో పోలీసులు నేరస్థులను ఎలా పట్టుకుంటారనే నిజమైన పరిస్థితులను ఇందులో సహజంగా చూపించారు. సుశిన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను రెట్టింపు చేస్తుంది. ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు నాటకీయంగా అనిపించినా, నేర పరిశోధన చిత్రాలను ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక.
6. ఇమైక్కా నొడిగళ్ (Imaikkaa Nodigal)- అమెజాన్ ప్రైమ్ వీడియో
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.3/10
సీబీఐ అధికారిగా నయనతార, క్రూరమైన సీరియల్ కిల్లర్‌గా అనురాగ్ కశ్యప్ మధ్య సాగే మైండ్ గేమ్స్ ఈ చిత్రానికి హైలైట్. విజయ్ సేతుపతి అతిథి పాత్ర, ఊహించని ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. లవ్ ట్రాక్ కథ వేగాన్ని కాస్త తగ్గించినా, క్లైమాక్స్ వరకు ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ సినిమాను అంజలి సీబీఐగా పేరుతో అందుబాటులో ఉంది.
7. తలవన్ (Thalavan)- సోనీ లివ్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.2/10
ఇద్దరు పోలీసు అధికారుల మధ్య ఉండే ఆధిపత్య పోరు, ఈగో ఘర్షణల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బిజూ మీనన్, అసిఫ్ ఆలీ తమ పాత్రల్లో జీవించారు. ప్రథమార్థం చాలా వేగంగా సాగుతూ ఆసక్తికరమైన సస్పెన్స్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. క్లైమాక్స్ భాగం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, థ్రిల్లర్ ప్రియులకు నచ్చుతుంది.