Bigg Boss Telugu 10 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ దశావతారం అన్నట్లుగా ప్రారంభం నుంచే జోరుగా సాగుతోంది. ఆది నుంచే కంటెస్టెంట్స్ అంతా తమలోని అవతారాలను బయపెట్టేస్తున్నారు. బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 7వ తేది ఎపిసోడ్‌లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలుగా వివాదం రాజుకుంది.
మహాపరీక్షను ఎదుర్కోవాలి

"మహాపరీక్ష ఇప్పటికే మొదలైందని మీకు తెలుసు. మీరు హౌజ్‌మేట్స్‌గా మారాలంటే.. ఈ మహాపరీక్షను ఎదుర్కొవాలి. మీరంతా రెండు జట్లుగా విడిపోవాల్సి ఉంటుంది. ఎవరు మీ నాయకులుగా ఉంటే మీరు హై రిస్క్ నుంచి లో రిస్క్‌లోకి రాగలరని భావిస్తున్నారో.. అలాంటి ఇద్దరు సభ్యులను మీరు నాయకులుగా ఎంచుకోండి" అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.
దీంతోపాటు ఎలిమినేషన్ ట్విస్ట్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. "ఈ మహాపరీక్ష మీ ఊహలకు అందకుండా ఉంటుంది. ఎలిమినేషన్ మాత్రం కచ్చితం" అని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా ఎవరిద్దరిని ఎన్నుకోవాలో ఓటింగ్ పెట్టుకున్నారు.
రోహిత్‌కు నాలుగు ఓట్లు
కామనర్ అయిన రోహిత్ నాయుడు పట్నం లేచిన రామ్ ప్రసాద్‌కు ఎవరు ఓట్ చేస్తారో చేయి లేపమన్నాడు. మూడు పేర్లు ఉన్నాయని త్రిగుణ్ చెప్పాడు. త్రిగుణ్ అనుకున్నవాళ్లు చేయెత్తండని రోహిత్ అన్నాడు. తర్వాత రోహిత్ పేరు చెప్పినాళ్ల గురించి అమన్ మసూద్ అన్నాడు. రోహిత్‌కు నాలుగు ఓట్లు వచ్చాయి.
"ఇద్దరిలో ట్రై బ్రేక్ డార్లింగ్ నువ్వే" అని రోహిత్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు త్రిగుణ్. తర్వాత కామనర్ అయిన రోహిత్‌కు అగ్నిపరీక్ష వాళ్లందరూ ఓట్లు వేశారని, ఇదంతా ఒక గ్రూప్‌లా అనిపిస్తుందని త్రిగుణ్ చెప్పాడు. "అదంతా తప్పు అండి. ఒకసారి వినండి" అంటూ శాలిని పటేల్ చెప్పుకొచ్చింది.
మీరు చెప్పేది వినట్లేదు
{{/usCountry}}"ఇద్దరిలో ట్రై బ్రేక్ డార్లింగ్ నువ్వే" అని రోహిత్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు త్రిగుణ్. తర్వాత కామనర్ అయిన రోహిత్‌కు అగ్నిపరీక్ష వాళ్లందరూ ఓట్లు వేశారని, ఇదంతా ఒక గ్రూప్‌లా అనిపిస్తుందని త్రిగుణ్ చెప్పాడు. "అదంతా తప్పు అండి. ఒకసారి వినండి" అంటూ శాలిని పటేల్ చెప్పుకొచ్చింది.
మీరు చెప్పేది వినట్లేదు
{{/usCountry}}"అవును మీకు మీరే సపోర్ట్ చేసుకున్నారు" అని త్రిగుణ్ అరిచాడు. "మీ సమస్య ఏంటో చెప్పనా.. మీరు ఎదుటివాళ్లు చెప్పేది వినట్లేదు" అని శాలిని అంది. "నేను అగ్నిపరీక్ష నుంచి వచ్చిన అమ్మాయికి ఓట్ వేశాను. అందులోనుంచి వచ్చిన ఒకామే నాకు ఓటేసింది" అని త్రిగుణ్ చెబుతున్నాడు.
"మీకు అలా అనిపించింది మాకు ఇలా అనిపించింది" చరణ్ మహదేవ్ అన్నాడు. ఈ మాటల వాగ్వాదం కాస్తా గొడవకు దారి తీసింది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్లుగా మారిపోయింది. "మీకు ఎలా తెలుసు రోహిత్ బాగా ఆడతాడని, అగ్ని పరీక్ష ద్వారానేగా" అని త్రిగుణ్ తన మాటలకు వివరణ ఇచ్చుకున్నాడు.
మిమ్మల్ని ఎవరు కడగమన్నారు
"రూల్స్ పెట్టడమేనా పాటించరా" అని రోహిత్ వాయిస్ రేయిజ్ చేశాడు. "మీరు చేశారా, మిమ్మల్ని కడగమంటే మీరు కడిగారా" అని త్రిగుణ్ అన్నాడు. "కడగం. మీరు ఎంగిలి చేస్తే కడగాలా" అని రోహిత్ వాదించాడు. "ఎంగిలి చేస్తే కడగాలా అనడం కరెక్ట్ కాదు" అని టెంపర్ వంశీ మధ్యలోకి వచ్చాడు.
"మీరు ఎంగిలి కడగరు మేము కడగాలి 15, 16 కప్పులు" అని త్రిగుణ్ అన్నాడు. "కడగడం ఎందుకు, ఎవరు కడగమన్నారు" అని రోహిత్ అన్నాడు. దాంతో త్రిగుణ్ షాక్ అయి చూశాడు. అలా నేటి బిగ్ బాస్ తెలుగు 10 ఎపిసోడ్ ప్రోమో ముగిసింది.