Bigg Boss Telugu 10 Magical Powers To 10 Contestants: బిగ్ బాస్ 10 తెలుగు మొదటి రోజే రసవత్తరంగా సాగింది. తొలిరోజునే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్లుగా పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 7 ఎపిసోడ్‌లో మ్యాజికల్ పవర్స్ ఇచ్చే కీస్ గురించి చర్చ మొదలైంది.
10 మందికి మ్యాజికల్ పవర్స్

బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్ లాంచ్ రోజున టాస్కుల్లో గెలిచి 8 మంది ఆ మ్యాజికల్ పవర్ కీస్ గెలుచుకున్నారు. మిగతా ఇద్దరికి రెండు కీస్ నిర్ణయించి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడి. చాలా సేపు వాగ్వాదం, గొడవ తర్వాత టెంపర్ వంశీ, నటుడు కృష్ణుడికి ఆ తాళం చెవులు ఇవ్వాలని నిర్ణయించి ఇచ్చారు.
ఇతరులకు చెప్పొద్దు
ఆ తర్వాత పదిమంది కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి పేరును బిగ్ బాస్ చెప్పడంతో వారు వెళ్లి ఆ పవర్ ఏంటో తెలుసుకున్నారు. కానీ, ఆ పవర్ ఏంటనేది మరే ఇతర కంటెస్టెంట్‌కు చెప్పినా, తెలిసిన దాన్ని కోల్పోతారని బిగ్ బాస్ మెలిక కూడా పెట్టాడు.
- త్రిగుణ్ మ్యాజికల్ పవర్
మొదట త్రిగుణ్ పేరు చెప్పడంతో వెళ్లి తనకు వచ్చిన మ్యాజికల్ పవర్ లాక్ ఓపెన్ చేసి చూశాడు. స్టీల్ ద అదర్ పవర్ శక్తి త్రిగుణ్‌కు వచ్చింది. అంటే ఇతరులకు వచ్చిన శక్తిని తీసుకుని తనకు నచ్చినట్లుగా వాడుకునే పవర్‌ను పొందాడు హీరో త్రిగుణ్.
2. సింగర్, కామనర్ ఝాన్సీకి వచ్చిన శక్తి
సింగర్ ఝాన్సీకి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే శక్తి లభించింది. అయితే, అది కేవలం ప్రారంభంలో అంటే మొదటి వారంలో కేవలం తను ఎలిమినేట్ అవుతానని భయం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని కండిషన్ ఉంది.
3. ముఖేష్ గౌడ మ్యాజికల్ పవర్
{{/usCountry}}సింగర్ ఝాన్సీకి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే శక్తి లభించింది. అయితే, అది కేవలం ప్రారంభంలో అంటే మొదటి వారంలో కేవలం తను ఎలిమినేట్ అవుతానని భయం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని కండిషన్ ఉంది.
3. ముఖేష్ గౌడ మ్యాజికల్ పవర్
{{/usCountry}}గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడకు రివైవ్ ది యూజ్‌డ్ పవర్ అని వచ్చింది. అంటే, ఇతరులు వాడిని పవర్‌ను మళ్లీ బతికించి అది మొదటగా వచ్చిన ఒరిజినల్ ఓనర్ కంటెస్టెంట్ ఉన్నారో వారికి ఇవ్వొచ్చు. మొదట ఆ పవర్‌కి ఎలాంటి రూల్స్ ఉన్నాయో అలాగే ఉంటాయి.
4. వర్షిణి పవర్
యాంకర్ వర్షిణి సౌందరరాజన్‌కి గ్రాబ్ ఎనీ విన్ అనే మ్యాజికల్ పవర్ వచ్చింది. అంటే, ఏదైనా టాస్కుల్లో ఇతరులు గెలిస్తే ఆ విజయాన్ని తన విజయంగా తీసుకునే శక్తి అది.
5. కృష్ణుడికి వచ్చిన శక్తి
యాక్టర్ కృష్ణుడుకి కంటెస్టెంట్ల స్థానాలను స్వాప్ అంటే మార్చుకునే పవర్ లభించింది. ఏదైనా సమయంలో ఒకరి స్థానంలోకి తను వెళ్లాలనుకున్నా, తనకు ఇష్టమైన వాళ్లను పంపించాలనుకున్న ఈ శక్తిని ఉపయోగించవచ్చు.
6. శాలిని మ్యాజికల్ పవర్
కామనర్ శాలిని పటేల్‌కు పవర్ టు అసైన్ ఎనీ హౌజ్ డ్యూటీ అనే శక్తి వచ్చింది. అంటే, హౌజ్‌లో ఒక కంటెస్టెంట్ ఉన్నంతకాలం వారు ఏ పని చేయాలో శాలిని ఆర్డర్ వేయొచ్చు. ఒక్కసారి శాలిని చెప్పిన ఆ పనిని ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేంతవరకు చేయాల్సిందే.
7. సృష్టి వ్యాకరణం పవర్
మరో కామనర్ శివ సృష్టి వ్యాకరణంకు ఏ ఇతర కంటెస్టెంట్‌ను అయినా ఎప్పుడైనా డైరెక్ట్ నామినేట్ చేసే శక్తి లభించింది. అంటే, సృష్టి ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయొచ్చు. దాంతో వారు నెక్ట్స్ వచ్చే నామినేషన్స్‌లో ఎలాంటి ఓట్ పడకున్నా ఉంటారు.
8. రామ్ ప్రసాద్ పవర్
జబర్దస్త్ రామ్ ప్రసాద్‌కి సేఫ్ షీల్డ్ మ్యాజికల్ పవర్ వచ్చింది. దీని ద్వారా నామినేషన్స్ నుంచి ఏ ఒక్కరినైనా లేదా తనను అయినా సేవ్ చేసుకోవచ్చు. దీంతో ఎలిమినేషన్ నుంచి ఒక వారం బయటపడేందుకు అవకాశం ఉంటుంది.
9. టెంపర్ వంశీకి వచ్చిన శక్తి
టెంపర్ వంశీకి పవర్ టు బ్లాక్ కెప్టెన్సీ అనే శక్తి వచ్చింది. దీన్ని ఉపయోగించి ఏ ఒక్క కంటెస్టెంట్‌ను అయినా కెప్టెన్సీ రేసు నుంచి బ్లాక్ చేసి అడ్డుకోవచ్చు. అయితే, ఇలా కేవలం 2 వారాలు మాత్రమే కెప్టెన్సీని టెంపర్ వంశీ అడ్డుకోవచ్చు.
10. జబర్దస్త్ నరేష్ పవర్
జబర్దస్త్ నరేష్‌కి 2x వోట్స్ పవర్ దక్కింది. దీని ద్వారా నామినేషన్స్‌లో ఓట్లు పడిన కంటెస్టెంట్‌కు రెట్టింపు ఓట్లు పెరిగేలా చేయొచ్చు. అంటే, ఒకరికి 2 నామినేషన్ ఓట్లు పడినప్పుడు ఈ పవర్ ఉపయోగిస్తే నాలుగు ఓట్లుగా పరిగణిస్తారు.
నరేష్‌కు అర్థం కానీ శక్తి
అయితే, మిగతా తొమ్మిది మంది కంటెస్టెంట్స్‌కు తమ పవర్ అర్థమైంది. కానీ, ఒక్క జబర్దస్త్ నరేష్‌కు మాత్రం అర్థం కాలేదు. ఆ డబుల్ వోట్స్ అనేది తనకు వ్యతిరేకంగా పడినప్పుడు ఉపయోగించాలా లేదా ఇతరులకు వ్యతిరేకంగా పడినప్పుడు వాడాలా అనేది తెలియట్లేదని నరేష్ టెన్షన్ పడ్డాడు.
ఎప్పుడు ఉపయోగించాలనేది
దాంట్లో బిగ్ బాస్‌ను క్లారిటీ ఇవ్వమంటే సెలెంట్‌గా ఉన్నాడు. ఈ పవర్ గురించి ఎవరి వద్ద డిస్కస్ చేయొద్దు కాబట్టి నరేష్ ఏం మాట్లాడలేదు. అందరూ పవర్స్ తెలుసుకున్నాకా.. ఈ పవర్స్‌ను ఎప్పుడు ఉపయోగించాలనుకుంటున్నారో తనకు చెప్పాలని బిగ్ బాస్ తెలిపాడు.
గేమ్ మార్చేసే మ్యాజికల్ పవర్స్
అప్పుడు దానికి సంబంధించిన కీస్ ఇస్తామని, అప్పటివరకు వాటిని ట్రేలో పెట్టాలని బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ మ్యాజికల్ పవర్స్ ద్వారా బిగ్ బాస్ గేమ్ మొత్తం మారనుందని తెలుస్తోంది.