Bigg Boss 10 Telugu Nominations Second Week: టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ చేస్తున్న తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్. ఈసారి సీజన్ 10తో బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 6 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రసవత్తరంగా సాగుతోంది.
రెండు రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్

వారం కాకముందే ఇద్దరు కంటెస్టెంట్స్ చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్ రెండు రోజుల గ్యాప్‌తో ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దాంతో బిగ్ బాస్ హౌజ్‌లో 14 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. అయితే, గత వారం 16 మంది డైరెక్ట్ నామినేషన్స్‌లోకి వచ్చారు.
గత వారం దశావతారం పేరుతో ఒక్కో టాస్క్‌లు ఇచ్చారు. ఆ టాస్క్‌లు ఆడి కంటెస్టెంట్స్ హౌజ్‌మేట్స్‌గా మారే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. హౌజ్‌మేట్స్ కానీ వారు నాన్ రిస్క్, హై రిస్క్‌లలో ఉన్నారు. ఇక వీకెండ్స్ వచ్చేసరికి అంటే బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్ పూర్తయ్యేసరికి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌మేట్స్‌గా మారారు.
ఈవారమే నామినేట్ చేసుకునేలా
గతవారం వారు హౌజ్‌మేట్స్ కాకపోవడంతో నామినేట్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు బిగ్ బాస్. కానీ, ఈసారి వారంతా హౌజ్‌మేట్స్ కావడంతో ఈ వారం ఒకరినొకరు నామినేట్ చేసుకోవచ్చని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. తమకు నచ్చని కంటెస్టెంట్‌ను నామినేట్ చేసేందుకు టాస్క్ కూడా ఆడించాడు బిగ్ బాస్.
అదే రోప్ టాస్క్. గార్డెన్ ఏరియాలో ఉన్న పోల్స్‌కు తాళ్లు చుట్టి ఉంటాయి. సరైన దారిలో వెళ్లి ఆ పోల్స్‌కు ఉన్న రోప్స్ త్వరగా తీసిన వారికి ఇతర కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే పవర్ వస్తుంది. ఈ పోటీలో ఇద్దరు కంటెస్టెంట్స్ పోటీ పడుతుంటారు.
ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 10 మంది
{{/usCountry}}అదే రోప్ టాస్క్. గార్డెన్ ఏరియాలో ఉన్న పోల్స్‌కు తాళ్లు చుట్టి ఉంటాయి. సరైన దారిలో వెళ్లి ఆ పోల్స్‌కు ఉన్న రోప్స్ త్వరగా తీసిన వారికి ఇతర కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే పవర్ వస్తుంది. ఈ పోటీలో ఇద్దరు కంటెస్టెంట్స్ పోటీ పడుతుంటారు.
ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 10 మంది
{{/usCountry}}ఈ నామినేషన్ టాస్క్ పోటీలో యాంకర్ సుధీర్-సింగర్ ఝాన్సీ, వర్షిణి సౌందరరాజన్-రోహిత్ నాయుడు, సృష్టి వ్యాకరణం-జబర్దస్త్ నరేష్, కృష్ణుడు-దేబ్జానీ మోదక్ తదితర జంటలు పాల్గొన్నాయి. అలా అందరు బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారం నామినేషన్స్‌లో పాల్గొన్నారు.
ఇక టాస్క్ పూర్తయ్యేసరికి బిగ్ బాస్ తెలుగు 10 ఈ వారం నామినేషన్స్‌లో మొత్తంగా 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూట్ పూర్తయిపోయింది. ఇప్పటికే బిగ్ బాస్ 10 రెండో వారం నామినేషన్స్ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల కూడా చేశారు మేకర్స్.
ఆ నలుగురు మాత్రం సేఫ్
ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ తెలుగు 10 నామినేషన్స్‌లో హీరో త్రిగుణ్, రోహిత్ నాయుడు, సీరియల్ హీరో ముఖేష్ గౌడ, నటుడు కృష్ణుడు, సింగర్ ఝాన్సీ, సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్, కామనర్ శాలిని పటేల్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, సృష్టి వ్యాకరణం, యాంకర్ వర్షిణి సౌందరరాజన్ పది మంది ఉన్నారు.
అయితే, ఈ వారం నామినేషన్స్ నుంచి నలుగురు మాత్రం తప్పించుకుని సేఫ్‌గా ఉన్నారు. కామనర్ అమన్ మసూద్, జబర్దస్త్ నరేష్, టెంపర్ వంశీ, యాంకర్ సుధీర్ రెడ్డి నలుగురు బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారం నామినేషన్స్ నుంచి సేఫ్‌గా ఉన్నారు.
ఎవరెవరి మధ్య మాటల యుద్ధం
కాగా, ఈ నామినేషన్స్‌లో రోహిత్ వర్సెస్ త్రిగుణ్, సుధీర్ వర్సెస్ త్రిగుణ్, ఝాన్సీ వర్సెస్ రోహిత్, ముఖేష్ వర్సెస్ త్రిగుణ్ మాటల యుద్ధం గట్టిగా జరిగిందని బిగ్ బాస్ వర్గాల సమాచారం.