Worms In Bipasha Basu Protein Powder Raise Food Safety: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ఆహార కల్తీపై సంచలన ఆరోపణలు చేశారు. తాను కొత్తగా కొనుగోలు చేసిన ఐసోప్యూర్ (Isopure) ప్రోటీన్ పౌడర్ డబ్బా తెరిచి చూడగా అందులో చిన్న చిన్న పురుగులు సంచరిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు.
'రియల్ లైఫ్ సింగం'గా గుర్తింపు

ఈ తీవ్రమైన వ్యవహారంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కమిషనర్, 'రియల్ లైఫ్ సింగం'గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండేను బిపాషా బసు ట్యాగ్ చేసి తన ఆవేదన పంచుకున్నారు. ఈ వీడియోలో తన వేలిపై పురుగును చూపిస్తూ బిపాషా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
"మీరే మాకు ఏకైక ఆశ!"
"ఈ కొత్త డబ్బా నిండా చిన్న చిన్న పురుగులు పడుతున్నాయి. మనం కొనుగోలు చేసే ప్రతీ వస్తువులో కల్తీ లేకుండా శుభ్రమైన ఉత్పత్తులు అందాలంటే మీరే మాకు ఏకైక ఆశ" అని ఐఏఎస్ అధికారి తుకారాం ముండేను ఉద్దేశించి బిపాషా బసు ఆవేదన వ్యక్తంచేశారు.
ఖరీదైన అంతర్జాతీయ బ్రాండ్లలోనూ పురుగులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫిట్నెస్ సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో, సినీ ప్రముఖులతో పాటు అనేక మంది యువకులు ప్రోటీన్ సప్లిమెంట్లను క్రమం తప్పకుండా వాడుతున్నారు. అయితే ఇంతటి ఖరీదైన అంతర్జాతీయ బ్రాండ్లలోనూ పురుగులు రావడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐఏఎస్ తుకారాం ముండేకు పెరుగుతున్న మద్దతు
{{/usCountry}}ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫిట్నెస్ సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో, సినీ ప్రముఖులతో పాటు అనేక మంది యువకులు ప్రోటీన్ సప్లిమెంట్లను క్రమం తప్పకుండా వాడుతున్నారు. అయితే ఇంతటి ఖరీదైన అంతర్జాతీయ బ్రాండ్లలోనూ పురుగులు రావడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐఏఎస్ తుకారాం ముండేకు పెరుగుతున్న మద్దతు
{{/usCountry}}మహారాష్ట్రలో ఆహార, ఔషధ కల్తీ రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్న కమిషనర్ తుకారాం ముండే వద్దకు ఈ తరహా ఫిర్యాదులు రావడం మొదటిసారి కాదు. గతంలో బుల్లితెర నటి శ్వేతా తివారీ కూడా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన డ్రింక్ క్యాన్‌తో పాటు బొద్దింక వచ్చిందంటూ వీడియో పోస్ట్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
టీమ్ తుకారం ముండే టీ షర్ట్ ధరించి
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ, ఒకప్పటి తెలుగు హీరోయిన్ ప్రీతి జింటా ఏకంగా 'టీమ్ తుకారాం ముండే' అని రాసి ఉన్న టీ-షర్టు ధరించి ఆయనకు మద్దతు తెలపగా, ట్వింకిల్ ఖన్నా, డైసీ షా వంటి నటీమణులు కూడా తుకారాం ముండే కఠిన చర్యలను ప్రశంసించారు.
కుటుంబ జీవితంపై బిపాషా దృష్టి
మరోవైపు బిపాసా బసు ఇటీవల ఎల్లే (Elle) డిజిటల్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసి సందడి చేశారు. మాతృత్వం, తన కెరీర్ ఎంపికల గురించి ఆమె ఆ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.
2015లో చివరిసారిగా నటించిన బిపాషా బసు
2015లో వచ్చిన 'ఎలోన్' సినిమాలో చివరిసారిగా నటించిన బిపాషా బసు 2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకున్నారు. 2022లో ఈ దంపతులకు దేవి అనే కుమార్తె జన్మించింది. ప్రస్తుతం ఆమె కొత్త సినిమాలేవీ ప్రకటించకపోయినప్పటికీ, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిరంతరం అందుబాటులో ఉంటారు.