బాలీవుడ్ వెర్సటైల్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తన కెరీర్ ఆరంభం నుంచి బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తొలి సినిమా 'దమ్ లగా కే హయిషా' కోసం భారీగా బరువు పెరిగిన భూమి ఆ తర్వాత స్లిమ్ లుక్‌లోకి మారి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అయితే, ఇటీవల భూమి పెడ్నేకర్ మరింతగా బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ' (IFFD) 2026 వేడుకల్లో పాల్గొన్న భూమి పెడ్నేకర్ తన ఫిట్‌నెస్ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆరోగ్యానికే నా తొలి ప్రాధాన్యత!
బరువు తగ్గడం గురించి అడిగిన ప్రశ్నకు భూమి పెడ్నేకర్ ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. "చాలా ఏళ్లుగా సినిమాల కోసం బరువు పెరగడం, తగ్గడం చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు నా శరీరంపై నాకు శ్రద్ధ పెరిగింది. మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ, మన శరీరం ఈ బరువు హెచ్చుతగ్గులను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. అందుకే ఇప్పుడు పాత్రల కంటే నా ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ప్రతి మహిళ ఒక వయసు వచ్చాక తన శరీరం గురించి ఇలా ఆలోచించాల్సిందే" అని భూమి పెడ్నేకర్ స్పష్టం చేశారు.
క్రేజ్ ముఖ్యం కాదు.. కళ ముఖ్యం!
యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో కాస్టింగ్ అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తన ప్రయాణాన్ని భూమి గుర్తు చేసుకున్నారు. "ప్రస్తుత కాలంలో 'రెలవెంట్' (పాపులారిటీలో)గా ఉండటం కంటే మన పని పట్ల మనం నిజాయితీగా ఉండటం ముఖ్యం. క్రేజ్ అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడటం అలసటను కలిగిస్తుంది. మనలోని అసలైన కళాకారుడిని గుర్తించి, నిరంతరం సాధన (రియాజ్) చేస్తూ ఉండటమే అసలైన విజయం" అని భూమి పెడ్నేకర్ వివరించారు.
ఢిల్లీకి ఇది గర్వకారణం..
మార్చి 25న ప్రారంభమైన ఐఎఫ్‌ఎఫ్‌డి (IFFD) వేడుకల గురించి భూమి ప్రశంసలు కురిపించారు. "ఢిల్లీ లాంటి నగరానికి ఇలాంటి ఒక అంతర్జాతీయ స్థాయి చలనచిత్ర వేడుక ఎంతో అవసరం. ఇక్కడ జరుగుతున్న చర్చలు, సెమినార్లు, ప్రదర్శిస్తున్న సినిమాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మొదటి ఏడాదే ఈ స్థాయిలో ఈ వేడుకలు జరగడం విశేషం" అని ఆమె పేర్కొన్నారు.
కెరీర్ అప్డేట్స్..
{{/usCountry}}మార్చి 25న ప్రారంభమైన ఐఎఫ్‌ఎఫ్‌డి (IFFD) వేడుకల గురించి భూమి ప్రశంసలు కురిపించారు. "ఢిల్లీ లాంటి నగరానికి ఇలాంటి ఒక అంతర్జాతీయ స్థాయి చలనచిత్ర వేడుక ఎంతో అవసరం. ఇక్కడ జరుగుతున్న చర్చలు, సెమినార్లు, ప్రదర్శిస్తున్న సినిమాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మొదటి ఏడాదే ఈ స్థాయిలో ఈ వేడుకలు జరగడం విశేషం" అని ఆమె పేర్కొన్నారు.
కెరీర్ అప్డేట్స్..
{{/usCountry}}గతేడాది 'మేరే హస్బెండ్ కీ బీవీ' సినిమాతో అలరించిన భూమి పెడ్నేకర్, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ది రాయల్స్'తో ఓటీటీలో రికార్డు వ్యూయర్ షిప్ సాధించారు. ఇక 2026 ఏడాదిని భూమి పెడ్నేకర్ పవర్‌ఫుల్ నోట్‌తో మొదలుపెట్టారు. అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ దల్‌దల్‌లో ముంబై పోలీస్ ఆఫీసర్‌గా భూమి చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి.