...
...
Next Story

Bhagyashri Borse: ఆ వార్తల్లో నిజం లేదు.. టాలీవుడ్ క్రష్ భాగ్యశ్రీ బోర్సే రూమర్లకు చెక్ పెట్టేసిన బాలీవుడ్ మేకర్స్!

T Series Clarity On Bhagyashri Borse Movie: టాలీవుడ్‌లో న్యూ క్రష్‌గా ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. సౌత్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భాగ్యశ్రీ బోర్సేపై ఇటీవల సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ వచ్చాయి. వాటిపై తాజాగా బాలీవుడ్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Published on: Aug 21, 2026, 11:10:22 IST
Advertisement

T Series Clarity On Bhagyashri Borse Movie: టాలీవుడ్ న్యూ క్రష్ భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్‌లో ఓ పెద్ద ప్రాజెక్ట్ దక్కించుకుందంటూ గత కొద్దిరోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు మిలాప్ జవేరీ దర్శకత్వంలో రానున్న ఒక హై-వోల్టేజ్ 'యాక్షన్ అండ్ వయలెంట్ లవ్ స్టోరీ'లో భాగ్యశ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేశారంటూ ఫిలింఫేర్ సహా పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ఖండించిన బాలీవుడ్ మేకర్స్

ఆ వార్తల్లో నిజం లేదు.. టాలీవుడ్ క్రష్ భాగ్యశ్రీ బోర్సే రూమర్లకు చెక్ పెట్టేసిన బాలీవుడ్ మేకర్స్!
ఆ వార్తల్లో నిజం లేదు.. టాలీవుడ్ క్రష్ భాగ్యశ్రీ బోర్సే రూమర్లకు చెక్ పెట్టేసిన బాలీవుడ్ మేకర్స్!

అయితే ఈ ప్రచారంపై బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధికారికంగా స్పందిస్తూ పుకార్లకు చెక్ పెట్టింది. భాగ్యశ్రీ బోర్సేని హీరోయిన్‌గా తీసుకున్నట్లు వస్తున్న ఊహాగానాలను టీ-సిరీస్ ప్రతినిధి ఖండించారు.

త్వరలోనే హీరోయిన్ అధికారిక ప్రకటన

"ఆదిత్య రాయ్ కపూర్, మిలాప్ జవేరీ కాంబినేషన్‌లో మేము నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోందంటూ వస్తున్న వార్తలు ఎంతమాత్రం నిజం కాదు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం" అని టీ-సిరీస్ స్పష్టం చేసింది.

సీక్రెట్‌గా సినిమా వివరాలు

చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చాలా గోప్యంగా ఉంచుతోంది. లవ్, యాక్షన్, భావోద్వేగాలు పుష్కలంగా ఉండే కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు మిలాప్ జవేరీ గతంలోనే వెల్లడించారు.

ప్రేమ కథలను తెరకెక్కించడంలో

'మర్జావాన్', 'ఏక్ దివానే కీ దివానియత్‌' వంటి చిత్రాలతో ప్రేమకథలను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన మిలాప్, ఈసారి ఆదిత్యతో అంతకుమించిన లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నారు.

మొదట బాలీవుడ్‌లో చిన్న పాత్రలతో

ఇక 'యారియాన్ 2', 'చందు ఛాంపియన్' సినిమాల్లో చిన్న పాత్రల ద్వారా బాలీవుడ్‌లో మెరిసిన భాగ్యశ్రీ బోర్సేకు, ఈ ప్రాజెక్ట్ ఒకవేళ ఓకే అయ్యుంటే హిందీలో హీరోయిన్‌గా మొదటి పెద్ద అవకాశమయ్యేది. అయితేనేం, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఆమె క్రేజ్ మామూలుగా లేదు.

రవితేజతో తొలి తెలుగు సినిమా

ఆ తర్వాత విజయవంతమైన ప్రాజెక్టులతో సౌత్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది భాగ్యశ్రీ బోర్సే. దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా, సముద్రఖనిలతో కలసి చేసిన తమిళ చిత్రం 'కాంత'లో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

శివ కార్తికేయన్ మూవీలో

అక్కినేని అఖిల్ రీ-ఎంట్రీ మూవీ 'లెనిన్'లోనూ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ సరసన కమల్ హాసన్ నిర్మాణంలో రానున్న 'సేయోన్' చిత్రంలో భాగ్యశ్రీ నటిస్తోంది. బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ కాస్త ఆలస్యమైనా, సౌత్‌లో మాత్రం ఈ ముంబై భామ వరుస ఆఫర్లతో బిజీగా దూసుకుపోతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe