మెగాస్టార్ చిరంజీవి నటించి సూపర్ హిట్ కొట్టిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్‌లో అలరించిన ఈ సినిమాకు హిట్ మేషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
రూ. 350 కోట్లకుపైగా కలెక్షన్స్

ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలోకి జనవరి 12న థియేటర్లలో విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఏంగా రూ. 350 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఈ సినిమా.
అలాంటి మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ అయి కూడా దూసుకుపోతోంది. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో తెలుగులో మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఓటీటీలోనూ ఈ మూవీ ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో ఉంటోంది.
కామెడీతో అట్రాక్ట్
అయితే, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కనిపించిన ప్రతి పాత్రకు ఆడియెన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అందులోనూ మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో సీరియల్ హీరోయిన్‌గా సౌమ్య చేసిన పాత్ర అందరిని కామెడీతో బాగా అట్రాక్ట్ చేసింది. ఈ సీరియల్ సినిమాలో చివరి వరకు నడుస్తుంది.
మన శంకర వర ప్రసాద్ గారు కారెక్టర్లో చిరంజీవి ఆ సీరియల్ గురించి, ఆ సీరియల్లోని పాత్రల గురించి చెబుతూ ఉండటం.. అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇలా ఆ ట్రాక్ ఎంత ఫన్నీగా వర్కౌట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్‌లో కనిపించిన నటికి కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో సదరు నటి కోసం అందరూ వెదుకులాట ప్రారంభించేశారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ
{{/usCountry}}మన శంకర వర ప్రసాద్ గారు కారెక్టర్లో చిరంజీవి ఆ సీరియల్ గురించి, ఆ సీరియల్లోని పాత్రల గురించి చెబుతూ ఉండటం.. అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇలా ఆ ట్రాక్ ఎంత ఫన్నీగా వర్కౌట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్‌లో కనిపించిన నటికి కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో సదరు నటి కోసం అందరూ వెదుకులాట ప్రారంభించేశారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ
{{/usCountry}}మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని సీరియల్‌లో సౌమ్య పాత్రలో నటించిన నటి పేరు సాయి ప్రియా రెడ్డి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చింది సాయి ప్రియ రెడ్డి. క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ ఇలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్ని చేసింది.
ఆ తరువాత యూట్యూబ్‌లో సిరీస్‌లు కూడా చేసి మంచి పేరుని సంపాదించుకుంది సాయి ప్రియా రెడ్డి. రీసెంట్‌గా వచ్చిన విశ్వక్ సేన్ లైలా చిత్రంలోనూ ఈ అమ్మాయి నటించింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మెరిసింది సాయి ప్రియా రెడ్డి.
ఓటీటీ రిలీజ్ తర్వాత
మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ తర్వాత సాయి ప్రియా రెడ్డికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె గురించి సోషల్ మీడియాలో ఆరాలు తీస్తున్ననెటిజన్స్‌కు సాయి ప్రియా రెడ్డి ఇదివరకు చేసిన సినిమాలు చూసి 'ఇన్ని మూవీస్‌లో నటించిందా?' అని ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక ముందు ఈ బ్యూటీ సాయి ప్రియా రెడ్డికి టాలీవుడ్‌లో అవకాశాలు పెరిగేలా కనిపిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులో భాగస్వామి అయినట్టుగా సమాచారం.