మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ యాక్షన్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా రిలీజ్

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా చేసింది. శ్రీమతి అర్చన ఈ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది.
హీరోల సినిమాలపై చిరంజీవి కామెంట్స్
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్‌లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ఈ నేపథ్యంలోనే మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సినిమాలపై చిరంజీవి కామెంట్స్ చేశారు.
తెలుగు పరిశ్రమది కావాలి
ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి కేవలం శంకర వరప్రసాద్ దే కాదు.. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
సుభిక్షంగా తెలుగు చిత్ర పరిశ్రమ
"ప్రభాస్ ది రాజా సాబ్, నా తమ్ముడు రవితేజ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి, మా ఇంట్లో చిన్నప్పటి నుంచి సరదాగా తిరుగుతూ పెరిగిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడుగా ఉన్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ.. అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తెలుగు చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నాను" అని చిరంజీవి కోరారు.
పర్‌ఫెక్ట్ సంక్రాంతి సినిమా
{{/usCountry}}"ప్రభాస్ ది రాజా సాబ్, నా తమ్ముడు రవితేజ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి, మా ఇంట్లో చిన్నప్పటి నుంచి సరదాగా తిరుగుతూ పెరిగిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడుగా ఉన్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ.. అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తెలుగు చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నాను" అని చిరంజీవి కోరారు.
పర్‌ఫెక్ట్ సంక్రాంతి సినిమా
{{/usCountry}}"అలాంటి విజయాలు ప్రేక్షకులు ఇచ్చి తీరుతారనే ప్రగాఢ నమ్మకం నాకు ఉంది. 2026 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోకూడదు. ప్రతి సినిమా పర్‌ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమా, నచ్చే సినిమా. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడేలా చేసే బాధ్యత మీది, అన్ని సినిమాల్ని థియేటర్స్‌కి వెళ్లి చూడండి. థియేటర్స్‌లోనే ఆస్వాదించండి, ఆశీర్వదించండి" అని మెగాస్టార్ చిరు తెలిపారు.
ఘరానా మొగుడు వంటి విజయం
"రాఘవేంద్ర రావు గారు, అనిల్‌తో నేను సినిమా చేస్తే అది అదిరిపోతుందని చాలా సంవత్సరాల క్రితం అన్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఘరానా మొగుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలని ఆయన నాతో ఎన్నోసార్లు చెప్పారు" అని చిరంజీవి పేర్కొన్నారు.