OTT Series Dhandha Review In Telugu And Rating: ఓటీటీ ప్రపంచంలో కంటెంట్ వందల గంటల నిడివితో వస్తున్న ఈ రోజుల్లో, కేవలం నిమిషం వ్యవధి ఉండే ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న 'వర్టికల్ ఓటీటీ సిరీస్' సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఇదే ఫార్మాట్‌లో పూర్తి స్థాయి సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఓటీటీ సిరీస్ 'దందా' (Dhandha).
కేవలం రెండున్నర నిమిషాల రన్‌టైమ్

ప్రముఖ వర్టికల్ ప్లాట్‌ఫామ్ చాయ్ షాట్స్‌లో దందా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 26 ఎపిసోడ్లు, ఒక్కోటి రెండున్నర నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందిన ఈ 64 నిమిషాల ఓటీటీ క్రైమ్ డ్రామా, మొదటి క్షణం నుంచే ప్రేక్షకుడిని కథలోకి లాక్కెళ్తుంది.
దందా ఓటీటీ రివ్యూ
ఒక ఎపిసోడ్ ముగియగానే తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తిస్తూ 'బింజ్ వాచ్' చేయించడంలో ఈ సిరీస్ పూర్తి విజయం సాధించింది. యూట్యూబర్ దొర సాయి తేజ హీరోగా చేసిన ఈ సిరీస్ ఎలా ఉందో నేటి దందా ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
బీటెక్ స్టూడెంట్ అయిన అరవింద్ (దొర సాయి తేజ)కు డబ్బు, పవర్‌పై కోరిక చాలా బలంగా ఉంటుంది. క్లాస్‌లో కంటే హైదరాబాద్ డార్క్ సైబర్ క్రైమ్ ప్రపంచంలోనే ఎక్కువ సేపు గడుపుతుంటాడు అరవింద్. తన తెలివితేటలకు అక్కడే సరైన గుర్తింపు దక్కుతుందని భావిస్తుంటాడు.
చిన్న చిన్న ఆన్‌లైన్ మోసాలతో స్టార్ట్ చేసి ఫిషింగ్ స్కామ్స్, ఫేక్ కాల్ సెంటర్స్, బ్లాక్ మెయిల్స్, గ్యాంగ్‌స్టర్ పాలిటిక్స్ వంటి పెద్ద నేరాలకు పాల్పడతాడు అరవింద్. మరి ఈ క్రమంలో అరవింద్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ? అరవింద్ సైబర్ క్రైమ్స్ ఎలా చేయగలిగాడు? డిజిటల్ నేరాల నెట్‌వర్క్‌లో అరవింద్ ఎలాంటి స్థాయికి ఎదిగాడు? అనేదే దందా కథ.
విశ్లేషణ:
ఇది ఒక సైబర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అదిరిపోయే తెలివితేటలు, అంతే ప్రమాదకరమైన ఆలోచనలు ఉన్న అరవింద్ అనే 22 ఏళ్ల బీటెక్ కుర్రాడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్టాక్ మార్కెట్ కుంభకోణంతో ప్రారంభమయ్యే అతని ప్రయాణం, క్రమంగా హైదరాబాద్ నగరంలో విస్తరించిన సైబర్ నేరాల సామ్రాజ్యంలోకి తీసుకెళ్తుంది.
{{/usCountry}}ఇది ఒక సైబర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అదిరిపోయే తెలివితేటలు, అంతే ప్రమాదకరమైన ఆలోచనలు ఉన్న అరవింద్ అనే 22 ఏళ్ల బీటెక్ కుర్రాడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్టాక్ మార్కెట్ కుంభకోణంతో ప్రారంభమయ్యే అతని ప్రయాణం, క్రమంగా హైదరాబాద్ నగరంలో విస్తరించిన సైబర్ నేరాల సామ్రాజ్యంలోకి తీసుకెళ్తుంది.
{{/usCountry}}ఫిషింగ్ స్కామ్‌లు, నకిలీ కాల్ సెంటర్లు, గ్యాంగ్‌స్టర్ రాజకీయాలు ఎలా నడుస్తాయో దర్శకుడు కథనంలో చాలా సహజంగా చూపించారు. మన చుట్టూ రోజూ పత్రికల్లో చూసే సైబర్ నేరాల వెనుక ఉన్న ముఠాల నెట్‌వర్క్‌ను, వారి నెగెటివ్ మైండ్‌సెట్‌ను ఎక్కడా క్లాస్ పీకకుండా ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో చూపించిన ప్రతీ స్కామ్ ఎంతో రీసెర్చ్ చేసి రాసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
అదిరిపోయే టెక్నికల్ వాల్యూస్
తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఆదిత్య దేవులపల్లి నెరేషన్, సీన్ కాంపోజిషన్ ఎంతో నైపుణ్యంతో సాగాయి. మొబైల్ స్క్రీన్‌ల కోసం తీసినప్పటికీ, అశ్విన్ లెనిన్ అందించిన సినిమాటోగ్రఫీ మంచి అనుభూతిని ఇస్తుంది. రిషి ఎం అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతీ సీన్‌లో టెన్షన్‌ను పెంచుతూ కథకు తగిన మూడ్ ఎలివేట్ చేస్తుంది.
విజయ్ కుమార్, ఆదిత్య కలిసి రాసుకున్న స్క్రీన్ ప్లే, ఫోర్త్-వాల్ నరేషన్ (ప్రేక్షకుడితో నేరుగా మాట్లాడటం), డార్క్ హ్యూమర్ ఈ సిరీస్‌ను మామూలు గ్యాంగ్‌స్టర్ సినిమాలకు భిన్నంగా నిలబెట్టాయి. క్లైమాక్స్ బాగుంది.
ఆకట్టుకునేల సాయి తేజ నటన
ఇక యూట్యూబ్‌లో తనదైన శైలి నటనతో విశేష ఆదరణ పొందిన దొర సాయి తేజ యాక్టింగ్ సిరీస్‌కు బాగా కలిసి వచ్చిన అంశం. కేవలం యాంటీ హీరో పాత్రను పోషించడమే కాకుండా, ఆ పాత్రలోని నెగెటివ్ షేడ్స్ బాగా పండించాడు. అమయాకంగా కనిపిస్తూ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న అరవింద్ పాత్రలోని హావాభావాలు, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
అలాగే, విలన్‌గా ప్రకాష్ ఠాకూర్, పోలీస్ ఆఫీసర్ ఆదిత్య సింగ్ పాత్రలో నితిన్ ప్రసన్న పోటీపడి నటించారు. చివరి ఎపిసోడ్ ముగిసిన తీరు రెండవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే అతి తక్కువ నిడివితో, అదిరిపోయే సస్పెన్స్‌తో సాగే సైబర్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారికి 'దందా' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.