బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గూఢచారి విన్యాసం 'ధరంధర్ 2: ది రివెంజ్' థియేటర్లలో చరిత్ర సృష్టిస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాను వెండితెరపై చూసిన ప్రేక్షకులు, ఇప్పుడు డిజిటల్ వేదికపై ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొదటి భాగం ధురంధర్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కాగా.. సీక్వెల్ మాత్రం రూటు మార్చింది. అంటే, నెట్‌ఫ్లిక్స్‌లో కాకుండా మరో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఎవరంటే?
బాలీవుడ్ హంగామా, పింక్‌విల్లా కథనాల ప్రకారం, ధురంధర్ 2 ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) కైవసం చేసుకుంది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, సుమారు ఎనిమిది వారాల గ్యాప్ తర్వాత అంటే.. మే నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
మైండ్ బ్లోయింగ్ డీల్.. రూ. 150 కోట్లు!
ఓటీటీ మార్కెట్‌లో ప్రస్తుతం ధురంధర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ధర హాట్ టాపిక్ అయింది. జియో హాట్‌స్టార్ ఓటీటీ ధురంధర్ 2 డిజిటల్ హక్కుల కోసం ఏకంగా రూ. 150 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మొదటి భాగమైన ధురంధర్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ. 85 కోట్లకు కొనుగోలు చేయగా, రెండో భాగం అంతకు రెట్టింపు ధర పలకడం విశేషం.
"మొదటి భాగం విడుదలకు ముందే రెండు సినిమాలను కలిపి రూ. 175 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ అడిగింది. కానీ, తమ కంటెంట్‌పై నమ్మకంతో జియో స్టూడియోస్ వేచి చూసింది. మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో, ఇప్పుడు కేవలం రెండో భాగానికే రూ. 150 కోట్లు రాబట్టగలిగింది. ఇటీవలి కాలంలో ఓటీటీ రంగంలో జరిగిన అతిపెద్ద డీల్స్‌లో ఇది ఒకటి" అని సినీ వర్గాలు వెల్లడించాయి.
సినీ ప్రముఖుల ప్రశంసలు
{{/usCountry}}"మొదటి భాగం విడుదలకు ముందే రెండు సినిమాలను కలిపి రూ. 175 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ అడిగింది. కానీ, తమ కంటెంట్‌పై నమ్మకంతో జియో స్టూడియోస్ వేచి చూసింది. మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో, ఇప్పుడు కేవలం రెండో భాగానికే రూ. 150 కోట్లు రాబట్టగలిగింది. ఇటీవలి కాలంలో ఓటీటీ రంగంలో జరిగిన అతిపెద్ద డీల్స్‌లో ఇది ఒకటి" అని సినీ వర్గాలు వెల్లడించాయి.
సినీ ప్రముఖుల ప్రశంసలు
{{/usCountry}}ఇకపోతే ధురంధర్ 2 సినిమాను ఎస్ఎస్ రాజమౌళి, అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అనుపమ్ ఖేర్, కరణ్ జోహార్ వంటి దిగ్గజాలు ఇప్పటికే ప్రశంసలతో ముంచెత్తారు. అయితే, బాలీవుడ్‌లోని కొందరు సెలబ్రిటీలు ఈ సినిమా సక్సెస్‌పై మౌనంగా ఉండటంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
వర్మ సంచలన వ్యాఖ్యలు!
"దర్శకుడు ఆదిత్య ధర్ ఇండస్ట్రీ కింద ఒక అణుబాంబు పేల్చారు. కానీ, మిగిలిన పరిశ్రమ మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. బహుశా ఆ బాంబు ధాటికి వారంతా అంతరిక్షంలోకి విసిరివేయబడి ఉంటారు.. అందుకే వారి చప్పట్లు మనకు వినిపించడం లేదు" అని రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు.
పక్షవాతం అంటూ సెటైర్లు
"లేదా ఇది కేవలం ప్రచార చిత్రం అని భ్రమలో బతుకుతూ మళ్లీ పాత రోత సినిమాలే తీయాలని ప్లాన్ చేస్తున్నారా? లేదంటే ఈ సినిమా అద్భుత ప్రతిభను చూసి నోటమాట రాక పక్షవాతం వచ్చినట్టు ఉండిపోయారా?" అంటూ ఆర్జీవీ తన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సెటైర్లు వేశారు.
ధురంధర్ 2 నటీనటులు
కాగా, ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తోపాటు అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలు పోషించారు. ప్రతి ఒక్కరి పాత్ర, వారి నటన ధురంధర్ 2 సక్సెస్‌కు కారణమని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.