...
...
Next Story

OTT Malayalam: 3 మలయాళ సినిమాలపై డైరెక్టర్ ప్రశంసలు- బాలీవుడ్‌పై సెటైర్లు- ఓటీటీలో తెలుగులో ఆ 3 స్ట్రీమింగ్- ఎక్కడంటే?

OTT Malayalam Movies In Telugu: మలయాళ చిత్ర పరిశ్రమలోని సృజనాత్మకత, సాహసోపేతమైన కథనాలపై బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించారు. 2025లో విడుదలైన రేఖాచిత్రం, తుడరుమ్, ఎకో .సినిమాలను ఉదహరిస్తూ అక్కడి సినీ సంస్కృతిని కొనియాడారు. రేఖా చిత్రం, తుడరుమ్, ఎకో ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.

Published on: Feb 17, 2026, 08:05:53 IST
Advertisement

భారతీయ చలనచిత్ర రంగంలో మలయాళ సినిమాలు ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. చిన్న బడ్జెట్‌తో వచ్చి అద్భుతమైన కథాంశాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కేరళ సినిమాలపై బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు.

3 మలయాళ సినిమాలపై డైరెక్టర్ ప్రశంసలు- బాలీవుడ్‌పై సెటైర్లు- ఓటీటీలో తెలుగులో ఆ 3 స్ట్రీమింగ్- ఎక్కడంటే?
3 మలయాళ సినిమాలపై డైరెక్టర్ ప్రశంసలు- బాలీవుడ్‌పై సెటైర్లు- ఓటీటీలో తెలుగులో ఆ 3 స్ట్రీమింగ్- ఎక్కడంటే?

త్వరలో విడుదల కానున్న ‘కెన్నెడీ’ సినిమా ప్రచారంలో భాగంగా అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ 2025లో వచ్చిన మలయాళ హిట్ చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌పై సెటైర్లు వేశారు.

“అక్కడ ఉన్న మద్దతు ఇక్కడ ఉండదు”

మలయాళ చిత్రాల విజయం వెనుక ఉన్న రహస్యాన్ని అనురాగ్ కశ్యప్ వివరిస్తూ.. “కేరళ అత్యంత విద్యావంతులు, సినిమాను ప్రేమించే ప్రేక్షకులు ఉన్న రాష్ట్రం. అక్కడ ఫిలిం క్లబ్స్ ఉన్నాయి, సినిమా సంస్కృతి ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఒక దర్శకుడికి మరో దర్శకుడు మద్దతుగా నిలుస్తారు” అని పేర్కొన్నారు.

రీసెంట్ హిట్ ‘రేఖాచిత్రం’ గురించి మాట్లాడుతూ.. “ఆ సినిమాలో మమ్ముట్టి వాయిస్‌ను వాడుకోవడానికి వారు వెనుకాడలేదు. కానీ, ఇక్కడ (బాలీవుడ్‌లో) నేను ఒకరి పేరును కానీ, ఒక సినిమా నేపథ్యాన్ని కానీ ఊరికే వాడలేను. వెంటనే కేసులు వేస్తారు. ఒక సినిమా చుట్టూ మరో సినిమాను నిర్మించే స్వేచ్ఛ ఇక్కడ లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు అనురాగ్ కశ్యప్.

మోహన్ లాల్ సింప్లిసిటీ..

మరికొన్ని చిత్రాల గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. “నిన్ననే ‘తుడరుమ్’ సినిమా చూశాను. ఎంత సహజంగా ఉందో! అందులో మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ ఒక సాదాసీదా టాక్సీ డ్రైవర్‌గా లుంగీ కట్టుకుని కనిపిస్తారు. ఇక్కడ హీరోను టాక్సీ డ్రైవర్ అంటే ఎవరూ ఒప్పుకోరు. అందరికీ డిజైనర్ దుస్తులు కావాలి” అని కొనియాడారు.

ఎకో అద్భుత క్లైమాక్స్

రేఖాచిత్రం ఓటీటీ: 1985లో ఒక సినిమా షూటింగ్ సమయంలో అదృశ్యమైన నటి ‘రేఖ’ (అనస్వర రాజన్) చుట్టూ తిరిగే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో మమ్ముట్టి వాయిస్‌ను కథలో కీలకంగా వాడారు. 7.8 రేటింగ్ ఉన్న రేఖా చిత్రం సోనీ లివ్‌లలో తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

తుడరుమ్ ఓటీటీ: తరుణ్ మూర్తి దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, శోభన నటించిన ఈ చిత్రం 2025లో అతిపెద్ద హిట్‌గా నిలిచి రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 7.5 రేటింగ్‌తో అదరగొట్టిన ఫ్యామిలీ క్రైమ్ సస్పెన్స్ డ్రామా తుడరుమ్ జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

ఎకో ఓటీటీ: ‘కిష్కింధా కాండం’ టీమ్ రూపొందించిన ఎకో చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదలై సూపర్ హిట్ అయింది. మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఎకో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. 7.8 రేటింగ్ ఉన్న ఎకో ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

బెస్ట్ ఛాయిస్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, నటుడు అయిన అనురాగ్ కశ్యప్ మెచ్చిన ఈ మూడు మలయాళ సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. నాలుగు డిఫరెంట్ ఓటీటీల్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలు థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి బెస్ట్ ఛాయిస్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks