మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇద్దరు బ్యూటిపుల్ హీరోయిన్స్ డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ నటించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వ వహించారు.
తమిళ సినిమాతో పరిచయం

2011లో పిళ్లైయార్ తెరు కడైసి వీడు అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన కిషోర్ తిరుమల తెలుగులో 2013 సంవత్సరంలో సెకండ్ హ్యాండ్ మూవీతో డైరెక్టర్‌గా అరంగేట్రం చేశారు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత రామ్ పోతినేనితో నేను శైలజ మూవీ తీసి సూపర్ హిట్ అందుకున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో
అనంతరం ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, రెడ్, ఆడవాళ్లకు మీ జోహార్లు వంటి సినిమాలను తెరకెక్కించారు కిషోర్ తిరుమల. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు డైరెక్టర్ కిషోర్ తిరుమల.
ఇంట్రెస్టింగ్ విషయాలు
జనవరి 13న థియేటర్లలో విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కిషోర్ తిరుమల ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. టాప్ హీరోయిన్‌కు కావాలనే కథ సరిగా చెప్పలేదని, ఒక కొత్త అమ్మాయి కోసమే అలా చేశానని దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పడం వైరల్‌గా మారింది.
క్యారెక్టర్‌కు పర్‌ఫెక్ట్ అనిపించి
"నా ఫేవరేట్ సినిమాల్లో నేను శైలజ ఒకటి" అని యాంకర్ చెప్పారు. దానికి "అందులో హీరోయిన్ కీర్తిని చూసినప్పుడు క్యారెక్టర్‌కి చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. కానీ, కీర్తికి అప్పుడే ఫస్ట్ ఫిల్మ్ కదా. సో కమర్షియల్‌గా అప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్‌కు కథ చెప్పమన్నారు" అని కిషోర్ తిరుమల తెలిపారు.
కావాలనే సరిగా చెప్పలేదు
{{/usCountry}}"నా ఫేవరేట్ సినిమాల్లో నేను శైలజ ఒకటి" అని యాంకర్ చెప్పారు. దానికి "అందులో హీరోయిన్ కీర్తిని చూసినప్పుడు క్యారెక్టర్‌కి చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. కానీ, కీర్తికి అప్పుడే ఫస్ట్ ఫిల్మ్ కదా. సో కమర్షియల్‌గా అప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్‌కు కథ చెప్పమన్నారు" అని కిషోర్ తిరుమల తెలిపారు.
కావాలనే సరిగా చెప్పలేదు
{{/usCountry}}"హీరోకు టాప్ హీరోయిన్ అయితే బాగుంటదని వాళ్ల పెయిర్ అని అన్నారు. అప్పు టాప్‌లో ఉన్న హీరోయిన్‌కు నేను కావాలనే కథ సరిగా చెప్పలేదు. నాకు నచ్చలేదండి కథ అంటే.. సరే థ్యాంక్స్ అని చెప్పేసి వచ్చాను. ఎందుకంటే నాకు కొత్త అమ్మాయి కీర్తినే పెట్టుకోవాలి అనిపించింది" అని కిషోర్ తిరుమల చెప్పారు.
అది బ్రేక్ చేయడం కష్టం
దానికి యాంకర్ చాలా ఆశ్చర్యపోయారు. "అంటే, క్యారెక్టర్ ఒక ఇంట్రోవర్ట్ అని రాసుకున్నప్పుడు ఆల్రెడీ వేరే ఇమేజ్‌తో ఉన్నోళ్లను తీసుకుంటే అది బ్రేక్ చేయడం కష్టం. కొత్త అమ్మాయి అయితే నిజంగానే ఈ అమ్మాయి శైలు అనే ఫీలింగ్‌లో ఉంటారు అని అనిపించి అలా చేశాను ఆ సినిమా కోసం" అని డైరెక్టర్ కిషోర్ తిరుమల వివరించారు.
కీర్తి సురేష్ కోసమే
అలా నేను శైలజ సినిమాలో కీర్తి సురేష్ కోసమే టాప్ హీరోయిన్‌కు సరిగా కథ చెప్పలేదని కిషోర్ తిరుమల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఆ టాప్ హీరోయిన్ ఎవరనేది మాత్రం రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి డైరెక్టర్ కిషోర్ తిరుమల రివీల్ చేయలేదు.