Vishal Bharadwaj On Siddharth Aditi Rao Intimate Scenes: సినిమాల్లో లేదా ఓటీటీ సిరీస్‌లలో శృంగారభరిత లేదా ఇంటిమేట్ సన్నివేశాలను తెరకెక్కించడం దర్శకులకు, నటీనటులకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. హద్దులు దాటకుండా, రసభంగం కలగకుండా ఆ సీన్లు తీయాల్సి ఉంటుంది.
ఓటీటీలోకి బోల్డ్ సిరీస్

అయితే, ఇటీవలే ఓటీటీలోకి బోల్డ్ అండ్ రొమాంటిక్ అంథాలజీ సిరీస్ ఒకటి స్ట్రీమింగ్‌కు వచ్చింది. అదే 'లస్ట్ స్టోరీస్ 3'. ఇందులో రియల్ లైఫ్ కపుల్ అయిన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి రీల్ లైఫ్ భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు.
లస్ట్ స్టోరీస్ 3లోని ఒక ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఇటీవల ఈ ఇంటిమేట్ సీన్స్ తీయడంపై స్పందించారు. లస్ట్ స్టోరీస్ 3లో సిద్ధార్థ్, అదితి రావు హైదరికి సంబంధించిన ఇంటిమేట్ సీన్స్, షూటింగ్ విశేషాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
హీరోయిన్ అడిగిన ఆ విచిత్రమైన ప్రశ్న
గతంలో సెట్‌లో ఇంటిమసీ డైరెక్టర్లు (Intimacy Directors) లేని సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యేవో విశాల్ భరద్వాజ్ గుర్తు చేసుకున్నారు. "గతంలో కొందరు నటీమణులు నా దగ్గరకు వచ్చి.. 'సార్, ఈ ముద్దు సీన్‌లో మేము టంగ్ (నాలుక) ఉపయోగిస్తామా? ఒకసారి ఆ హీరోను అడిగి చెప్పండి' అని అడిగేవారు" అని విశాల్ భరద్వాజ్ చెప్పారు. ఒక దర్శకుడిగా హీరో దగ్గరకు వెళ్లి ఆ మాట అడగడం తనకు చాలా విచిత్రంగా, ఇబ్బందికరంగా అనిపించేదని ఆయన వివరించారు.
బాడీ డూప్‌ను వద్దనుకున్న అదితి-సిద్ధార్థ్
'లస్ట్ స్టోరీస్ 3' షూటింగ్ సమయంలో మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా సాగిందని విశాల్ తెలిపారు. నిజ జీవితంలో భార్యాభర్తలైన అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ ఈ ప్రాజెక్ట్‌లో జంటగా నటించడంతో 50 శాతం ఇబ్బంది తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఒక సన్నివేశంలో వీరిద్దరి కోసం బాడీ డూప్‌లను సిద్ధం చేసినా, ఆ అవసరం రాలేదని చెప్పారు.
{{/usCountry}}'లస్ట్ స్టోరీస్ 3' షూటింగ్ సమయంలో మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా సాగిందని విశాల్ తెలిపారు. నిజ జీవితంలో భార్యాభర్తలైన అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ ఈ ప్రాజెక్ట్‌లో జంటగా నటించడంతో 50 శాతం ఇబ్బంది తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఒక సన్నివేశంలో వీరిద్దరి కోసం బాడీ డూప్‌లను సిద్ధం చేసినా, ఆ అవసరం రాలేదని చెప్పారు.
{{/usCountry}}"ఒక క్లోజప్ షాట్‌లో కేవలం అదితి కాళ్లు మాత్రమే కనిపిస్తాయి. సిద్ధార్థ్ ఆ కాళ్ల దగ్గర పాకే సీన్ అది. దానికోసం డూప్‌ను పెడితే.. అదితి ఆ విజువల్ చూసి, 'నా కాళ్లు అంత లావుగా ఉండవు' అని నవ్వింది" అని దర్శకుడు తెలిపారు. దాంతో ఆ సీన్‌ను డూప్ లేకుండా అదితి, సిద్ధార్థ్ స్వయంగా పూర్తి చేశారని చెప్పారు.
ఇంటిమసీ డైరెక్టర్ల అవసరం పెరిగింది
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇటీవల ఇంటిమసీ కోఆర్డినేటర్ల సంస్కృతి వేగంగా పెరుగుతోంది. సెట్‌లో వారి ఉనికి దర్శకులకు పెద్ద ఊరటనిస్తుందని విశాల్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. నటీనటులకు ఎలాంటి భయం, అసౌకర్యం లేకుండా స్వేచ్ఛగా నటించే వాతావరణాన్ని వారు కల్పిస్తారు. నటీనటుల సమ్మతి (Consent), భద్రత ప్రాధాన్యంగా సాగే ఈ కొత్త విధానం వల్ల నటులు ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ పాత్రల్లో జీవించగలుగుతున్నారు.
నాలుగు కథల సమాహారం 'లస్ట్ స్టోరీస్ 3'
సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీ రిలీజ్ అయింది. హిందీతోపాటు తెలుగు, తమిళ ఇతర భాషల్లో లస్ట్ స్టోరీస్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విశాల్ భరద్వాజ్‌తో పాటు విక్రమాదిత్య మోట్వానే, కిరణ్ రావ్, శకున్ బాత్రా వేర్వేరు ఎపిసోడ్స్‌కి దర్శకత్వం వహించారు.
ప్రేమ, ఆకర్షణ, మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను విశ్లేషిస్తూ ఈ కథలు సాగుతాయి. రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, విజయ్ వర్మ, ఆలీ ఫజల్, రాధికా మదన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సిరీస్‌లో విభిన్న పాత్రల్లో కనిపించారు.