Sunil Fight Maha OTT Release: థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘ఫైట్ మహా’ ఇప్పుడు డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్, వర్సటైల్ నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించిన ఫైట్ మాహా ఓటీటీ రిలీజ్ అయింది.
రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్

రామ్ గోపాల్ వర్మ నిర్మించిన సంచలన చిత్రం 'మర్డర్'తో దర్శకుడిగా ఆకట్టుకున్న ఆనంద్ చంద్ర ఈ ఫైట్ మహా చిత్రాన్ని తెరకెక్కించారు. న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ఏవీఎస్ రాజు, ఆర్. కుమార్ రాజు, ఆనంద్ చంద్ర సంయుక్తంగా నిర్మించారు.
"కలలు నిజమైతే.. అది ఎవరి నిజం?" అనే డిఫరెంట్ ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదలైంది. ఇటీవలి కాలంలో తెలుగు ఓటీటీల్లో కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలకు, సైకలాజికల్ థ్రిల్లర్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఓటీటీలో ఫైట్ మహా సందడి చేస్తోంది.
స్కెచ్ ఆర్టిస్ట్ చిక్కుకున్న మర్డర్ మిస్టరీ!
విశాఖపట్నానికి చెందిన మహా (అఖిల్) గొప్ప ఆర్టిస్ట్ కావాలని ఆశిస్తాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని ఇంట్లో చెప్పి, తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి నగరానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి పోలీస్ శాఖలో క్రైమ్ స్కెచ్ ఆర్టిస్ట్‌గా పనిచేసే అవకాశం దక్కుతుంది. తన ప్రతిభతో ఎన్నో సంక్లిష్టమైన కేసుల్లో నిందితుల రూపురేఖలను గీసి పోలీసులకు ఎంతగానో సహాయపడతాడు.
మహా జీవితాన్ని ‘స్లీపింగ్ డిజార్డర్’ అనే తీవ్రమైన మానసిక సమస్య నిరంతరం వేధిస్తుంటుంది. నిద్రలో భయంకరమైన కలలు రావడం, తనకే తెలియకుండా నిద్రలోనే నడవడం అతనికి నరకప్రాయంగా మారుతుంది. బాల్యంలో చనిపోయిన తండ్రి (సునీల్) జ్ఞాపకాలు, విచిత్రమైన కలలు అతడిని మానసికంగా కుంగదీస్తాయి.
హత్య వెనుక అసలు నిజమేంటి?
ఈ మానసిక సమస్య నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ గుప్తా (శ్రీకాంత్ అయ్యంగార్)ను సంప్రదిస్తాడు మహా. ఈ క్రమంలోనే అతని జీవితంలోకి యోగా టీచర్ అమీనా అడుగుపెడుతుంది. అంతా ప్రశాంతంగా సాగుతోందనుకున్న సమయంలో మహా ఓ ఊహించని హత్య కేసులో నిందితుడిగా ఇరుక్కుంటాడు. నిద్రలో నడిచే అలవాటు వల్ల తనకే తెలియకుండా ఈ నేరంలోకి నెట్టబడతాడు.
{{/usCountry}}ఈ మానసిక సమస్య నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ గుప్తా (శ్రీకాంత్ అయ్యంగార్)ను సంప్రదిస్తాడు మహా. ఈ క్రమంలోనే అతని జీవితంలోకి యోగా టీచర్ అమీనా అడుగుపెడుతుంది. అంతా ప్రశాంతంగా సాగుతోందనుకున్న సమయంలో మహా ఓ ఊహించని హత్య కేసులో నిందితుడిగా ఇరుక్కుంటాడు. నిద్రలో నడిచే అలవాటు వల్ల తనకే తెలియకుండా ఈ నేరంలోకి నెట్టబడతాడు.
{{/usCountry}}అసలు ఆ హత్య చేసింది ఎవరు? చనిపోయిన మహిళకు, మహాకు ఉన్న సంబంధమేంటి? తండ్రి చిన్ననాటి జ్ఞాపకాలు మహాను ఎందుకు వెంటాడుతున్నాయి? అనే ఉత్కంఠభరిత ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఫైట్ మహా ఓటీటీ స్ట్రీమింగ్
ఫైట్ మహా చిత్రంలో డాక్టర్ శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, దీపక్ కేశవ్, కృష్ణరాజు (జోగి బ్రదర్స్), జబర్దస్త్ శాంతి కుమార్, ఆయేషా, హరీష్, పూర్ణ శ్రీ, మాస్టర్ రోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
విభిన్నమైన కథాంశంతో సాగే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ఛాయిస్‌గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్ సాధించుకున్న మహా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అయింది. అక్టోబర్ 22 నుంచే ఈటీవీ విన్‌లో ఫైట్ మహా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.