...
...
Next Story

Friday Top OTT Release: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన టాప్ 7 సౌత్ సినిమాలు- అన్నీ తెలుగులోనే- ఒక్కోటి ఒక్కోరకం- ఎందుకు చూడాలంటే?

Friday OTT Release Movies Today: శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ లవర్స్ చూపు ఓటీటీ వేదికల వైపే ఉంటుంది. నవంబర్ 20న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, సోనీ లివ్‌లలో 7 కొత్త సౌత్ సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, క్రైమ్ థ్రిల్లర్ల నుంచి ఫ్యామిలీ కామెడీ వరకు సందడి చేస్తున్నాయి.

Published on: Nov 20, 2026, 22:42:20 IST
Advertisement

Friday Top OTT Releases Today: వీకెండ్ మొదలైందంటే సినీ అభిమానులు ఇంటిల్లిపాదీ కలిసి చూసేందుకు ఓటీటీల్లో కొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో ఇవాళ శుక్రవారం (నవంబర్ 20, 2026) ఓటీటీ ప్రియులకు అసలైన వినోదాల విందు దొరికింది. నేరుగా తెలుగులో రూపొందిన చిత్రాలతో పాటు తమిళం నుంచి డబ్ అయిన ఇంట్రెస్టింగ్ టాప్ 7 సౌత్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో హారర్, రొమాన్స్ హంగామా

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన టాప్ 7 సౌత్ సినిమాలు- అన్నీ తెలుగులోనే- ఒక్కోటి ఒక్కోరకం- ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన టాప్ 7 సౌత్ సినిమాలు- అన్నీ తెలుగులోనే- ఒక్కోటి ఒక్కోరకం- ఎందుకు చూడాలంటే?

418 ఓటీటీ: ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ తెరకెక్కించిన తెలుగు సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ '418' నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామస్తుల ఎంత చెప్పిన కాదని 15 ఏళ్ల తర్వాత తిరిగి తెరిచిన పాత విమ్స్ (VIMS) మెడికల్ కాలేజీ భవనం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. క్యాంపస్‌లో అంతుచిక్కని ఘటనలు మొదలవ్వడంతో 18 ఏళ్ల విద్యార్థి వివేక్, దేవిక అనే మహిళ సీల్ వేసి ఉన్న హాస్టల్ స్టోర్ రూమ్ నంబర్ 418 వైపు ఆకర్షితులవుతారు. ఆ గదిలో దాగిన భయానక రహస్యం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతుంది. చైత్ర జె. ఆచార్, రమేష్ ఇందిర, సూర్య రాజ్ వీరభతిని, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ఇందులో కీలక పాత్రలు పోషించారు.

హైకూ ఓటీటీ

మరోవైపు యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో వచ్చిన తమిళ రొమాంటిక్ డ్రామా 'హైకూ' సైతం తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికపైకి అందుబాటులోకి వచ్చింది. ఏగన్, శ్రీదేవి అపల్ల, ఫెమినా జార్జ్, అదిర్చి అరుణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తన అభద్రతాభావం, అతి జాగ్రత్త కారణంగా మొదటి ప్రేయసికి దూరమైన మనో.. కొన్నేళ్ల తర్వాత నివేత అనే యువతికి దగ్గరవుతాడు. గత చేదు జ్ఞాపకాల నుంచి కోలుకుంటున్న నివేత జీవితంలోకి మనో పాత కథ మళ్లీ ఎలాంటి చిక్కులు తెచ్చిందన్నది ఈ చిత్రం చూపిస్తుంది.

అమెజాన్ ప్రైమ్‌లో థ్రిల్లర్, ఫాంటసీ వినోదం

తమిళ ఫాంటసీ హారర్ కామెడీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'డ్రోన్స్' కూడా తెలుగు డబ్బింగ్‌తో ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయింది. అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆర్. రాఘవ్ మిర్దాత్ రచన, దర్శకత్వం వహించారు. సస్పెండ్ అయిన ఆస్ట్రోఫిజిక్స్ విద్యార్థి కిష్ తన స్నేహితులతో కలిసి ఓ శాస్త్రవేత్త ఇంట్లో తలదాచుకుంటాడు. డ్రోన్ సాయంతో ప్రకృతి అనే మినీయేచర్ ఆర్టిస్ట్‌ను గమనించే క్రమంలో వీరంతా నిద్రలో నడిచే విద్యార్థి, బొమ్మలుగా మార్చే మంత్రగత్తె, ఆత్మలను బంధించే డాల్ హౌస్ వంటి విచిత్ర ప్రపంచంలో చిక్కుకుంటారు. సిద్ధి ఇద్నాని, ద్రవిడ్ సెల్వం, అంజలి నాయర్, దేవదర్శిని ఇందులో నటించారు.

ఆహా, సన్ నెక్ట్స్‌లో పక్కా తెలుగు వినోదం

క్రేజీ కళ్యాణం ఓటీటీ: యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నటుడు వీకే నరేష్, దర్శకనటుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెడ్డింగ్ డ్రామా కామెడీ 'క్రేజీ కళ్యాణం' ఆహా ఓటీటీలో విడుదలైంది. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ గందరగోళ పెళ్లి వేడుక చుట్టూ నడిచే కుటుంబ భావోద్వేగాలు, సందడిని వినోదాత్మకంగా ఆవిష్కరిస్తుంది.

అనుమాన పక్షి ఓటీటీ రిలీజ్

'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా నటించిన కామెడీ థ్రిల్లర్ 'అనుమాన పక్షి' సన్ నెక్ట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించే సన్నీ అనే కంటెంట్ క్రియేటర్ తన స్నేహితుడికి సాయం చేసేందుకు కశ్మీర్ వెళ్తాడు. అక్కడ స్నేహితుడు అనుమానాస్పదంగా మరణించడం, కన్యాకుమారి అనే యువతి పరిచయం కావడంతో సన్నీ చిక్కుల్లో పడతాడు. ఓ విలక్షణమైన దర్యాప్తు అధికారితో కలిసి తన ప్రశ్నించే తత్వంతో ఆ మిస్టరీని సన్నీ ఎలా ఛేదించాడన్నది ఆసక్తికరంగా సాగుతుంది. మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, సీనియర్ హీరోయిన్ రాశి ఇందులో కీలక పాత్రల్లో మెరిశారు.

సోనీ లివ్‌లో ఆకట్టుకునే సర్వైవల్ థ్రిల్లర్

అన్బిల్ అవన్ ఓటీటీ: అశోక్ సెల్వన్, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ 'అన్బిల్ అవన్' తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్. కార్తికేయన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రేవతి, సాబుమోన్ అబ్దుసమద్ ముఖ్య పాత్రలు పోషించారు. నగర జీవనాన్ని వదిలి ఓ హిల్ స్టేషన్‌లో పాతకాలపు హోమ్ స్టే నడిపేందుకు సూర్య, ఇయల్ అనే దంపతులు వెళ్తారు. ఆ వారసత్వ బంగ్లాను ఖాళీ చేయించేందుకు స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి వారిని బెదిరించడంతో, తన భార్యను, కొత్త జీవితాన్ని కాపాడుకునేందుకు సూర్య చేసే పోరాటమే ఈ కథ.

సౌత్ టాప్ 7 ఓటీటీ సినిమాలు

థియేటర్లలో మిస్ అయిన సినిమాలతో పాటు సరికొత్త కథనాలు ఓటీటీలోకి రావడంతో ఈ వీకెండ్ సినీ ప్రేక్షకులకు మంచి కాలక్షేపం దొరికినట్లయింది. కాబట్టి, ఈ సౌత్ టాప్ 7 సినిమాలను తెలుగులో ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks