...
...
Next Story

OTT Horror: ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ సిరీస్ సీజన్ 4- విశ్వక్ సేన్‌ను భయపెట్టిన హారర్ థ్రిల్లర్- ఆ ఊరి మిస్టరీ వీడేనా?

From Season 4 OTT Release: హారర్ లవర్స్‌ను ఊపిరి బిగబట్టేలా చేసిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఫ్రమ్ నాలుగో సీజన్‌ ఓటీటీలోకి వచ్చేసింది. విశ్వక్ సేన్‌ను సైతం భయపెట్టిన ఈ హారర్ సిరీస్‌ లో చీకటి పడితే వేటాడే భయంకరమైన జీవులు వణికించనున్నాయి. మరి ఫ్రమ్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Apr 21, 2026, 13:32:28 IST
Advertisement

Vishwak Sen Liked From 4 OTT Streaming: మనుషులు వెళ్లగలరు కానీ తిరిగి రాలేని ఒక మాయా నగరం.. అక్కడ రాత్రిపూట తిరిగే రాక్షస రూపాలు.. చీకటి పడితే అంతే సంగతి. ఈ నేపథ్యంలో సాగే 'ఫ్రమ్' సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. తాజాగా విడుదలైన నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.

ఎల్లో డ్రెస్ వ్యక్తి ఎవరు

ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ సిరీస్ సీజన్ 4- విశ్వక్ సేన్‌ను భయపెట్టిన హారర్ థ్రిల్లర్- ఆ ఊరి మిస్టరీ వీడేనా?
ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ సిరీస్ సీజన్ 4- విశ్వక్ సేన్‌ను భయపెట్టిన హారర్ థ్రిల్లర్- ఆ ఊరి మిస్టరీ వీడేనా?

గత సీజన్ ముగింపులో మిగిలిపోయిన అనేక ప్రశ్నలకు ఈసారి సమాధానాలు దొరుకుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ 'ఎల్లో డ్రెస్ వ్యక్తి' (Man in Yellow) అసలు కథ ఏంటనేది ఫ్రమ్ సీజన్ 4లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరి ఈ సీజన్‌లో అయినా ఆ ఊరు మిస్టరీ వీడుతుందేమో చూడాలి.

విశ్వక్ సేన్‌ను కలలో వెంటాడిన సిరీస్

వింతైన ఊరు, రాత్రి తిరిగే వింత జీవులు, అవి చేసే భయానక సంఘటనలతో తెరకెక్కిన ఫ్రమ్ వెబ్ సిరీస్‌కు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఒకరు. విశ్వక్ సేన్‌ను సైతం భయపెట్టిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. రాత్రి కలలో కూడా ఈ సిరీస్ వెంటాడినట్లుగా ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ చెప్పాడు.

రేటింగ్ అండ్ ఫ్రెష్ కంటెంట్

ఫ్రమ్ ఓటీటీ సిరీస్ ఇప్పటికీ మూడు సీజన్స్‌ పూర్తి చేసుకుని 30 ఎపిసోడ్స్‌తో హారర్ థ్రిల్లర్ లవర్స్‌కు మంచి థ్రిల్ పంచింది. ఈ ఫ్రమ్ సిరీస్‌కు ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 7.8 రేటింగ్ ఉంది. అంతేకాకుండా ఎంతవరకు తాజా కంటెంట్ అని చెప్పే సంస్థ రొట్టెన్ టోమాటోస్ వెబ్ సైట్‌లో ఫ్రమ్ సిరీస్‌కు ఏకంగా 97 శాతం ఫ్రెష్ కంటెంట్ అని రాసి ఉంది.

ఫ్రమ్ సీజన్ 4 ఓటీటీ రిలీజ్

అయితే, ఏప్రిల్ 20 నుంచి ఇండియన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫ్రమ్ సీజన్ 4 అందుబాటులో ఉంది. అమెరికా వంటి మిగతా దేశాల్లో ఏప్రిల్ 19 నుంచే ఫ్రమ్ 4 డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. మొత్తం 10 ఎపిసోడ్స్‌తో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫ్రమ్ సీజన్ 4 అలరించనుంది. ఈ నాలుగో సీజన్ నుంచి ప్రతి సోమవారం ఒక్కో ఎపిసోడ్ చొప్పున ఓటీటీ రిలీజ్ చేయనున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అలా ఏప్రిల్ 20న మొదటి ఎపిసోడ్ ఓటీటీ ప్రీమియర్ కాగా.. రెండో ఎపిసోడ్ ఏప్రిల్ 27న మూడో ఎపిసోడ్ మే 4 వరుసగా ఆఖరి 10వ ఎపిసోడ్ జూన్ 22న ఓటీటీ స్ట్రీమింగ్ అవున్నాయి. ప్రతివారం ఒక్కో ఎపిసోడ్ కాకుండా ఒకేసారి అన్ని ఎపిసోడ్స్ చూడాలనుకునేవారు మాత్రం జూన్ 22 వరకు ఆగాల్సిందే. లేదా ప్రతి వారం థ్రిల్ కావాలంటే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫ్రమ్ సీజన్ 4ను ఇప్పటి నుంచే చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe