బాలీవుడ్ తెరపై ‘క్రిష్’, ‘అగ్నీపథ్’ వంటి చిత్రాలతో వెలిగిన సూపర్ హిట్ జోడీ హృతిక్ రోషన్ - ప్రియాంక చోప్రా. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, వృత్తిపరమైన గౌరవం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ (The Bluff) ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
వైరల్ అవుతున్న ‘పైరేట్’ లుక్

ఈ తరుణంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు తన మద్దతును తెలుపుతూ సోషల్ మీడియాలో స్పందించారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో తన ఓటీటీ సినిమా ది బ్లఫ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. శనివారం (ఫిబ్రవరి 21) ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఇందులో ఒక ఫోటోలో బ్రౌన్ కలర్ అవుట్‌ఫిట్, బ్లాక్ హెడ్‌గేర్‌తో ప్రియాంక చోప్రా స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. మరో ఫోటోలో బ్లూ శాటిన్ టాప్, గ్రీన్ స్కర్ట్, సముద్రపు దొంగలను (పైరేట్) పోలిన విలక్షణమైన హెడ్‌గేర్‌తో ఆకట్టుకున్నారు. ఈ ఫోటోలతో పాటు ‘ప్రెస్ టూర్ రెండో రోజు.. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ప్రియాంక చోప్రా రాసుకొచ్చారు.
హృతిక్ రోషన్ ఏమన్నారంటే?
ఈ పోస్ట్‌పై హృతిక్ రోషన్ స్పందిస్తూ.. "బ్యూటిఫుల్.. ఈ సినిమా చూడటానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను" అని రెడ్ హార్ట్ ఎమోజీతో కామెంట్ చేశారు. పైరెట్ లుక్‌లో ప్రియాంక చోప్రా అందానికి ఫిదా అయిన బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఓటీటీ రిలీజ్ మూవీ ది బ్లఫ్ చూసేందుకు చాలా ఆసక్తిగా, ఆగలేకుండా ఉన్నట్లు తెలిపారు.
కాగా, గతంలో హృతిక్ రోషన్ అమెరికా వెళ్లినప్పుడు కూడా తన గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్‌తో కలిసి ప్రియాంక, నిక్ జోనస్ దంపతులను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన పాత సహనటి సినిమాపై హృతిక్ ఆసక్తి కనబరచడం అభిమానులను ఖుషీ చేస్తోంది.
మహిళ చేసే పోరాటమే
{{/usCountry}}కాగా, గతంలో హృతిక్ రోషన్ అమెరికా వెళ్లినప్పుడు కూడా తన గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్‌తో కలిసి ప్రియాంక, నిక్ జోనస్ దంపతులను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన పాత సహనటి సినిమాపై హృతిక్ ఆసక్తి కనబరచడం అభిమానులను ఖుషీ చేస్తోంది.
మహిళ చేసే పోరాటమే
{{/usCountry}}ఇకపోతే ‘ది బ్లఫ్’ సినిమాకు ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియాంక చోప్రా ఒక మాజీ సముద్రపు దొంగ పాత్రలో నటించింద. తన హింసాత్మక గతాన్ని వదిలేసి, కుటుంబాన్ని కాపాడుకోవాలనుకునే ఒక మహిళ చేసే యాక్షన్ పోరాటమే ఈ సినిమా కథ.
ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్
ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ది బ్లప్ చిత్రాన్ని నిర్మించారు. వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ది బ్లఫ్ ఓటీటీలోకి ఫిబ్రవరి 25న రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 25 నుంచి ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా ది బ్లఫ్ ఓటీటీ రిలీజ్ అవనుంది.
హృతిక్ రీసెంట్ చిత్రం ‘వార్ 2’
ఇక హృతిక్ రోషన్ విషయానికొస్తే, ఆయన చివరిగా ‘వార్ 2’ (War 2) చిత్రంలో కనిపించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించిన సంగతి తెలిసిందే. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మోస్తరుగా ఆడింది.