ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ- ఏకంగా 9.7 రేటింగ్- లవర్ తండ్రితో 30 రోజుల ఛాలెంజ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ సినిమా ఇట్లు మీ ఎదవ. త్రినాధ్ కఠారి హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాహితీ అవాంఛ హీరోయిన్‌గా చేసింది. ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 9.7 రేటింగ్ సాధించిన ఇట్లు మీ ఎదవ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త వారం రాగానే ఓటీటీలోకి సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇవాళ (జనవరి 15) తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే ఇట్లు మీ ఎదవ. వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిళ్లు అనేది సినిమా క్యాప్షన్.

హీరో, డైరెక్టర్ ఒక్కరే
డిఫరెంట్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో త్రినాధ్ కఠారి హీరోగా చేయడంతోపాటు స్వీయ దర్శకత్వం వహించారు. అంటే హీరో, డైరెక్టర్ రెండు త్రినాధ్ కఠారి ఒక్కరే నిర్వర్తించారు. ఈ సినిమాలో త్రినాధ్‌కు జోడీగా సాహితీ అవాంచ హీరోయిన్‌గా చేసింది.
అలాగే, ఇట్లు మీ ఎదవ సినిమాలో గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, తనికెళ్ల భరణి, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి కీలక పాత్రలు పోషించారు. వీరితోపాటు తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ తదితరులు ఇతర పాత్రలు చేశారు.
ఐఎమ్‌డీబీలో 9.7 రేటింగ్
ఆర్‌పీ పట్నాయక్ సంగీతం అందించిన ఇట్లు మీ ఎదవ సినిమా గతేడాది నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ టెంప్లెట్‌లో సినిమా సాగిన కామెడీ ట్రాక్ బాగుందని, హీరోను ఎదవగా చూపించే సీన్స్ ఆకట్టుకున్నాయని పాజిటివిటీ వచ్చింది.
కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం పదికి ఏకంగా 9.7 రేటింగ్ సాధించుకుని ఇట్లు మీ ఎదవ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా చాలా బాగుందని చెబుతూ 9.7 రేటింగ్‌ను ఐఎమ్‌డీబీలో సుమారుగా 2, 201 మంది ఓట్ వేశారు. అందుకే ఇట్లు మీ ఎదవ చిత్రానికి ఏకంగా 9.7 రేటింగ్ దక్కింది.
2 నెలల తర్వాత ఓటీటీలోకి
ఇంతటి రేటింగ్ సాధించిన ఇట్లు మీ ఎదవ ఓటీటీలోకి ఇవాళ (జనవరి 15) వచ్చేసింది. సుమారు 2 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసింది ఈ సినిమా. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఈటీవీ విన్‌లో ఇట్లు మీ ఎదవ ఓటీటీ రిలీజ్ అయింది.
ఇట్లు మీ ఎదవ కథ విషయానికొస్తే.. ఆవారాగా తిరిగే శ్రీను (త్రినాధ్ కఠారి) ఆరేళ్లుగా పీజీ చేస్తూనే ఉంటాడు. తన కాలేజీలో జాయిన్ అయిన మనస్విని (సాహితీ అవాంచ)ను చూసి లవ్‌లో పడతాడు. చివరికి మనస్వినిని కూడా ప్రేమలే పడేస్తాడు శ్రీను.
ఎదవ అని తెలిసి
కొడుకు మార్పు చూసిన శ్రీను తండ్రి (గోపరాజు రమణ) ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకు మనస్విని తండ్రి (దేవి ప్రసాద్)తో సంబంధం మాట్లాడేందుకు శ్రీను తండ్రి వెళ్తాడు. అక్కడ శ్రీను ఎదవ ప్రవర్తన తెలిసి తిరస్కరిస్తాడు మనస్విని తండ్రి.
ఆ తర్వాత ఏమైంది కూతురును ఇచ్చి పెళ్లి చేసేందుకు శ్రీను లవర్ తండ్రి చేసిన 30 రోజుల ఛాలెంజ్ ఏంటీ? ఆ ఛాలెంజ్‌కు శ్రీను ఒప్పుకున్నాడా? మనస్విని శ్రీను పెళ్లాడాడ? వంటి అంశాలతో ఇట్లు మీ ఎదవ సాగుతుంది.
ఈటీవీ విన్ ఓటీటీలో
సేమ్ బొమ్మరిల్లు టైపులో ఇట్లు మీ ఎదవ ఉంటుందని కామెంట్స్ వినిపించాయి. ఇకపోతే థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఇట్లు మీ ఎదవను ఎంచక్కా చూసేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


