ఓటీటీలోకి ఏకంగా 36 సినిమాలు- 23 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- హారర్ టు రొమాంటిక్ అన్ని జోనర్స్‌లలో!

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 36 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 23 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. హారర్, కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్ వంటి జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Jan 15, 2026 5:33 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 36 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సినిమాల జోనర్స్, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌వి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఏకంగా 36 సినిమాలు- 23 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- హారర్ టు రొమాంటిక్ అన్ని జోనర్స్‌లలో!
ఓటీటీలోకి ఏకంగా 36 సినిమాలు- 23 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- హారర్ టు రొమాంటిక్ అన్ని జోనర్స్‌లలో!

దండోరా ఓటీటీ: బిగ్ బాస్ శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ తదితరులు నటించిన సోషల్ డ్రామా సినిమా దండోరా అమెజాన్ ప్రైమ్‌లో నిన్నటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

కిల్లర్ ఆర్టిస్ట్ ఓటీటీ: బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్ర పోషించిన తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా కిల్లర్ ఆర్టిస్ట్. ఓ ఆర్టిస్ట్ చుట్టూ సాగే ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 13న ఓటీటీ రిలీజ్ అయింది.

మస్తీ 4 ఓటీటీ: హిందీలో అడల్ట్ కామెడీ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీనే మస్తీ 4. వివేక్ ఒబేరాయ్, రుహి సింగ్, రితేష్ దేశ్‌ముఖ్, తుషార్ కపూర్, ఆఫ్తాబ్ శివ్‌దాసని నటించిన మస్తీ 4 జీ5 ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

గుర్రం పాపిరెడ్డి ఓటీటీ: శవాలు దొంగతనం చేసి డబ్బు సంపాదించే కాన్సెప్ట్‌తో వచ్చిన తెలుగు డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. ఫరియా అబ్దుల్లా, నరేష్ అగస్త్య నటించిన గుర్రం పాపిరెడ్డి జీ5లో జనవర 16 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ వారం ఓటీటీ రిలీజెస్ సమగ్ర జాబితా:

క్రమ సంఖ్యచిత్రం / సిరీస్ పేరుఓటీటీ ప్లాట్‌ఫామ్జోనర్ (Genre)ఓటీటీ రిలీజ్ డేట్
1బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మిఅమెజాన్ ప్రైమ్యాక్షన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ (కన్నడ/తెలుగు)జనవరి 12
2కిల్లర్ ఆర్టిస్ట్అమెజాన్ ప్రైమ్రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాజనవరి 13
3డస్ట్ బన్నీఅమెజాన్ ప్రైమ్హారర్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్జనవరి 13
4రీబిల్డింగ్అమెజాన్ ప్రైమ్అమెరికన్ నియో వెస్టర్న్ డ్రామాజనవరి 13
5రెంటల్ ఫ్యామిలీఅమెజాన్ ప్రైమ్జపాన్ కామెడీ డ్రామాజనవరి 13
6సంగ్ సంగ్ బ్లూఅమెజాన్ ప్రైమ్బయోగ్రఫికల్ మ్యూజికల్ డ్రామాజనవరి 13
7దండోరాఅమెజాన్ ప్రైమ్రూరల్ సోషల్ డ్రామాజనవరి 14
8120 బహదూర్అమెజాన్ ప్రైమ్హిస్టారికల్ యాక్షన్ వార్ డ్రామాజనవరి 16
9వన్ లాస్ట్ అడ్వెంచర్: ST5నెట్‌ఫ్లిక్స్హారర్ ఫాంటసీ డాక్యుమెంటరీజనవరి 12
10తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్నెట్‌ఫ్లిక్స్క్రైమ్ థ్రిల్లర్ (వెబ్ సిరీస్)జనవరి 14
11అగాథ క్రిస్టీస్ సెవెన్ డయల్స్నెట్‌ఫ్లిక్స్క్రైమ్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్జనవరి 15
12బోన్ లేక్నెట్‌ఫ్లిక్స్హారర్ మిస్టరీ థ్రిల్లర్జనవరి 15
13టు లవ్ టు లూజ్నెట్‌ఫ్లిక్స్రొమాంటిక్ డ్రామా (వెబ్ సిరీస్)జనవరి 15
14ది రిప్: ట్రస్ట్ హ్యాజ్ ఏ ప్రైస్నెట్‌ఫ్లిక్స్క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్జనవరి 16
15కిల్లర్ వేల్నెట్‌ఫ్లిక్స్సర్వైవల్ హారర్ థ్రిల్లర్జనవరి 16
16బ్లాక్ ఫోన్ 2నెట్‌ఫ్లిక్స్సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్జనవరి 16
17కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్నెట్‌ఫ్లిక్స్కొరియన్ రొమాంటిక్ కామెడీ (వెబ్ సిరీస్)జనవరి 16
18ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీనెట్‌ఫ్లిక్స్ఫాంటసీ రొమాంటిక్ డ్రామాజనవరి 17
19నికిత రాయ్జియో హాట్‌స్టార్హారర్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్జనవరి 12
20ఇండస్ట్రీ (సీజన్ 4)జియో హాట్‌స్టార్ఫినాన్షియల్ డార్క్ కామెడీ డ్రామాజనవరి 12
21డౌన్ టౌన్ అబ్బే: గ్రాండ్ ఫినాలేజియో హాట్‌స్టార్రొమాంటిక్ వెబ్ సిరీస్జనవరి 12
22అనంతజియో హాట్‌స్టార్తెలుగు ఆధ్యాత్మిక (డివోషనల్) డ్రామాజనవరి 13
23టెల్‌ మీ లైస్ (సీజన్ 3)జియో హాట్‌స్టార్రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాజనవరి 13
24పోల్ టు పోల్ విత్ విల్ స్మిత్జియో హాట్‌స్టార్నేచర్ డాక్యుమెంటరీ సిరీస్జనవరి 14
25పొనీస్: పర్సన్ ఆఫ్ నో ఇంట్రెస్ట్జియో హాట్‌స్టార్అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్జనవరి 16
26గుర్రం పాపిరెడ్డిజీ5 (ZEE5)తెలుగు క్రైమ్ కామెడీ డ్రామాజనవరి 16
27భా భా భాజీ5 (ZEE5)మలయాళం యాక్షన్ కామెడీజనవరి 16
28మస్తీ 4జీ5 (ZEE5)హిందీ అడల్ట్ కామెడీజనవరి 16
29బందూక్లయన్స్ గేట్ ప్లేకన్నడ క్రైమ్ థ్రిల్లర్జనవరి 16
30షెల్లయన్స్ గేట్ ప్లేబ్లాక్ కామెడీ బాడీ హారర్ థ్రిల్లర్జనవరి 16
31మహసెన్హఆహా తమిళ్మైథలాజికల్ జంగిల్ థ్రిల్లర్జనవరి 13
32హైజాక్ (సీజన్ 2)ఆపిల్ ప్లస్ టీవీక్రైమ్ థ్రిల్లర్ (వెబ్ సిరీస్)జనవరి 14
33ఇట్లు మీ ఎదవఈటీవీ విన్రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామాజనవరి 15
34కిరిక్కన్సన్ నెక్ట్స్మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్జనవరి 15
35ట్విన్‌లెస్హులు (Hulu)ఇంగ్లీష్ డార్క్ కామెడీ డ్రామాజనవరి 16
36కాలంకావల్సోనీ లివ్మలయాళ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్జనవరి 16

ఓటీటీలోకి 36 సినిమాలు

ఇలా ఈ వారం (జనవరి 12 నుంచి 18 వరకు) ఏకంగా 36 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో దండోరా, కాలంకావల్, గుర్రం పాపిరెడ్డి, షెల్, బందూక్, కిరిక్కన్, మస్తీ 4, నికిత రాయ్, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష‍్మి, కిల్లర్ ఆర్టిస్ట్, డస్ట్ బన్నీ, 120 బహదూర్, తస్కరీ, సెవెన్ డయల్స్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ 22, తెలుగులో 10

వీటితోపాటు బోన్ లేక్, ది రిప్, కిల్లర్ వేల్, బ్లాక్ ఫోన్ 2, కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్, అనంత, పోనీస్, ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ, ఇట్లు మీ ఎదవతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 23 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.