Prabhas Motivates Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు జగపతి బాబు రెండో ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరుగులేని వేగంతో దూసుకుపోతున్నారు. ఇటీవల సలార్, గుంటూరు కారం, పుష్ప 2 వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించిన జగపతి బాబు త్వరలో రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రభాస్ గుణగణాల గురించి

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జగ్గుభాయ్.. రెబల్ స్టార్ ప్రభాస్ గుణగణాల గురించి, ఆయనకున్న సహృదయత గురించి ఎమోషనల్ విషయాలను బయటపెట్టారు. తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన సమయంలో ప్రభాస్ తనకు ఎలా అండగా నిలిచారో గుర్తుచేసుకున్నారు జగపతి బాబు.
టాలీవుడ్‌లో ప్రభాస్ లార్జర్ దాన్ లైఫ్ పాత్రలు పోషిస్తూ అంతర్జాతీయంగా క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ, ఆయన వ్యక్తిగత జీవితంలో ఎంతో సాధారణంగా ఉంటారని పరిశ్రమలో టాక్ ఉంది. ఈ విషయాన్ని జగపతి బాబు మాటలు మరోసారి నిజం చేశాయి. ఒకానొక దశలో తాను తీవ్రమైన డిప్రెషన్‌తో (మానసిక వేదన) బాధపడ్డానని జగపతిబాబు వెల్లడించారు. ఆ సమయంలో మనసు విప్పి మాట్లాడటానికి ప్రభాస్‌కు ఫోన్ చేసినట్లు చెప్పారు.
'డార్లింగ్ నేనున్నా.. నీకేం కాదు'
"నేను తీవ్ర డిప్రెషన్‌లో ఉండి కంగారుపడుతున్న సమయంలో ప్రభాస్ జార్జియాలో షూటింగ్‌లో ఉన్నాడు. ఫోన్ చేయగానే.. 'డార్లింగ్, నేనున్నా కదా. నీ సమస్యేంటో చెప్పు, నేను చూసుకుంటా' అని కొండంత ధైర్యం చెప్పాడు. ఆయన మాటలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి" అని జగపతి బాబు వివరించారు.
ప్రభాస్ తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ చాలా పెద్ద మనసున్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు జగపతి బాబు. అంతటితో ఆగకుండా, జార్జియా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ రాగానే ప్రభాస్ స్వయంగా జగపతి బాబు ఇంటికి వచ్చి పరామర్శించారని, ఆయనను నవ్విస్తూ మోటివేట్ చేశారని గుర్తుచేసుకున్నారు.
రాజమౌళికి అహంకారం లేదు.. నచ్చితేనే ఛాన్స్!
టాలీవుడ్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రికార్డుల దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి కూడా జగపతి బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించినప్పటికీ రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ఒదిగి ఉంటారని ప్రశంసించారు.
{{/usCountry}}టాలీవుడ్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రికార్డుల దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి కూడా జగపతి బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించినప్పటికీ రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ఒదిగి ఉంటారని ప్రశంసించారు.
{{/usCountry}}"ఎన్ని ఘనతలు సాధించినా రాజమౌళిలో అహంకారం అస్సలు కనిపించదు. ఆయన కుటుంబం మొత్తం అందరినీ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. ఇక సినిమాల్లో పాత్రల ఎంపిక విషయానికి వస్తే రాజమౌళి చాలా కచ్చితంగా ఉంటారు. కేవలం పరిచయాలు, సాన్నిహిత్యం ఉన్నాయి కదా అని ఎవరికీ అవకాశాలు ఇవ్వరు. సదరు పాత్రకు ఏ నటుడు సరిపోతాడో.. వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటారు" అని జగ్గుభాయ్ స్పష్టం చేశారు.
ప్రభాస్ చేతిలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులు
ప్రస్తుతం ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ' సాధించిన సంచలన విజయం తర్వాత, ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'కల్కి పార్ట్ 2'లో ప్రభాస్ భైరవ పాత్రలో అలరించనున్నారు.
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తుండగా, అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్) లాంటి దిగ్గజాలు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. దీనితో పాటు 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న 'స్పిరిట్' (Spirit) సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
మార్చి 5న స్పిరిట్
తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను టి-సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. స్పిరిట్ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5, 2027 న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా ప్రభాస్, జగపతి బాబు ఇద్దరు సలార్‌లో నటించిన విషయం తెలిసిందే.