...
...
Next Story

OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ డ్రామా- పెళ్లి కాకముందే బిడ్డకు తల్లిగా-ఆమని, అమర్‌దీప్ భార్య తేజస్విని మూవీ!

OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం జ్యోతి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సీనియర్ హీరోయిన్ ఆమని, నటుడు శివాజీ రాజాతోపాటు బిగ్ బాస్ అమర్‌దీప్ భార్య తేజస్విని గౌడ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. మరి ఈ జ్యోతి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Feb 1, 2026, 07:24:46 IST
Advertisement

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి ప్రతి వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. డిఫరెంట్ జోనర్స్, వివిధ భాషల్లో ఈ సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం అచ్చమైన తెలుగు సినిమా కూడా ఓటీటీ రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే.

ఓటీటీలోకి తెలుగు మూవీ

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ డ్రామా- పెళ్లి కాకముందే బిడ్డకు తల్లిగా-ఆమని, అమర్‌దీప్ భార్య తేజస్విని మూవీ!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ డ్రామా- పెళ్లి కాకముందే బిడ్డకు తల్లిగా-ఆమని, అమర్‌దీప్ భార్య తేజస్విని మూవీ!

స్వచ్ఛమైన తెలుగు కథతో ప్రతి ఆదివారం డిఫరెంట్ జోనర్లలో ఓ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తుంటుంది. ఈ విధంగానే ఇవాళ (ఫిబ్రవరి 1) ఓ తెలుగు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే జ్యోతి. తెలుగులో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రంగా జ్యోతి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

జ్యోతి సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని, ప్రముఖ నటుడు శివాజీ రాజాతోపాటు బిగ్ బాస్ అమర్‌దీప్ చౌదరి భార్య, సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ముగ్గురితోపాటు బ్రహ్మముడి సీరియల్ నటి ఇందు ఆనంద్, సంధ్య, ఫని, అశోక్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

యండమూరి వీరేంద్రనాథ్ కథ

అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతి సినిమాను రూపొందించారు. టి గణపతి రెడ్డి నిర్మాతగా ఉన్న జ్యోతి సినిమాకు మీర్ దర్శకత్వం వహించారు. అలాగే, ఎడిటింగ్ బాధ్యతలను కూడా డైరెక్టర్ మీర్ తీసుకున్నారు. అంతేకాకుండా జ్యోతి సినిమాకు ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించడం విశేషం.

పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారే మహిళ కథగా జ్యోతి తెరకెక్కింది. ఆ పాత్ర సరోజగా ఆమని నటించారు. పెళ్లి కాకుండా తల్లి అయితే సమాజం ఎలా చూస్తుంది, సూటిపోటి మాటల మధ్య బిడ్డను ఆ తల్లి ఎలా పెంచింది, ఏం చేసింది, పెరిగి పెద్దయిన కూతురు తల్లి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంది వంటి భావోద్వేగపు సన్నివేశాలతో జ్యోతి మూవీని తీర్చిదిద్దారు.

జ్యోతి సినిమాలో కాస్తా నెగెటివ్ రోల్‌లో శివాజీ రాజా కనిపించినట్లు తెలుస్తోంది. ఇక ఆమనికి కూతురుగా తేజస్విని గౌడ యాక్ట్ చేసింది. పురుషోత్తం (శివాజీ రాజా), సరోజ (ఆమని) ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ, అది జరగదు.

జ్యోతి ఓటీటీ స్ట్రీమింగ్

సరోజ తన కూతురును పెంచి ఐఏఎస్ ఆఫీసర్‌ను చేస్తుంది. తల్లిని ప్రాణంగా ప్రేమించే కూతురు తండ్రిని దగ్గరికి చేర్చేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడే తండ్రి అసలు గుణం ఏంటో తెలుస్తుంది. ఈ క్రమంలో గతంలోని తాలుకూ జ్ఞాపకాలు, సంఘటనలు సమస్యలు తెచ్చిపెడతాయి. అవి ఏంటనేది తెలియాలంటే ఈ జ్యోతిని చూడాల్సిందే.

ఇకపోతే ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో నేటి నుంచి జ్యోతి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అతి తక్కువ రన్‌టైమ్‌తో జ్యోతి ఓటీటీ రిలీజ్ అయింది. ప్రతి ఆదివారం ఈటీవీ విన్ అందించే ఓటీటీ వీక్లి సిరీస్ కథా సుధలో భాగంగానే జ్యోతి డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks