Kajol Juhi Chawla On Aamir Khan Taste In Women: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కెరీర్‌లోనే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం 'లగాన్'. ఆశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన ఈ అద్భుత చిత్రం విడుదలై పాతికేళ్లు (25 ఏళ్లు) పూర్తి చేసుకుంది.
లగాన్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్

ఈ సందర్భంగా ముంబైలో లగాన్ చిత్ర యూనిట్ ఒక భారీ వేడుకను ఏర్పాటు చేసింది. లగాన్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్, స్టార్ హీరోయిన్లు కాజోల్, జూహీ చావ్లా వంటి ఎందరో ప్రముఖులు హాజరై సందడి చేశారు.
అయితే, వేదికపై అమీర్ ఖాన్‌ను కాజోల్, జూహీ చావ్లా కలిసి ఆటపట్టించిన తీరు ఈ వేడుకలోనే హైలైట్‌గా నిలిచింది. ఇది చూసిన అభిమానులంతా అప్పట్లో వారు కలిసి నటించిన 'ఇష్క్' సినిమా రోజులను గుర్తు చేసుకుంటున్నారు.
అమీర్‌కు మంచి టేస్ట్ ఉందన్న కాజోల్
లగాన్ ఈవెంట్‌లో కాజోల్, జూహీ చావ్లా వేదికపైకి వచ్చి అమీర్ ఖాన్ గురించి మాట్లాడారు. ఆ సమయాన్ని కాజోల్ పూర్తిగా అమీర్‌పై జోకులు వేయడానికి ఉపయోగించుకుంది. అమ్మాయిలను ఎంచుకోవడంలోనూ అమీర్ ఖాన్‌కు మంచి టేస్ట్ ఉందని అతని మాజీ భార్య కిరణ్ రావు ముందే కాజోల్ సెటైర్లు వేశారు.
"అమీర్ ఖాన్ గురించి నేను ఒక మాట చెప్పగలను. అతని ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే సినిమాల ఎంపికలో అతనికి ఎంత మంచి టేస్ట్ ఉందో అర్థమవుతుంది. 'లగాన్' సినిమాతో మొదలైన అతని ప్రయాణం ఇప్పటికీ అద్భుతంగా సాగుతోంది. సినిమాల్లోనే కాదు.. మహిళల ఎంపికలో కూడా అమీర్‌కు చాలా మంచి టేస్ట్ ఉంది" అని కాజోల్ నవ్వుతూ వ్యాఖ్యానించింది.
కాజోల్ తరహాలోనే జూహీ చావ్లా
ఈ మాట వినగానే అమీర్ ఖాన్ సిగ్గుపడుతూ గట్టిగా నవ్వేశారు. దానికి మరో హీరోయిన్ జూహీ చావ్లా కూడా తనదైన శైలిలో స్పందిస్తూ.. "అమీర్ గురించి చెప్పడానికి నా దగ్గర ఒక్క మాట కాదు, చాలానే ఉన్నాయి. అమీర్ గురించి నేను మాట్లాడటం మొదలుపెడితే ఈ సాయంత్రం కూడా సరిపోదు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పెట్టకముందు నుంచి నాకు తెలుసు. నా పక్కన నటించిన వాళ్లంతా ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయారు, చూశారా!" అంటూ సరదాగా వ్యాఖ్యానించింది.
{{/usCountry}}ఈ మాట వినగానే అమీర్ ఖాన్ సిగ్గుపడుతూ గట్టిగా నవ్వేశారు. దానికి మరో హీరోయిన్ జూహీ చావ్లా కూడా తనదైన శైలిలో స్పందిస్తూ.. "అమీర్ గురించి చెప్పడానికి నా దగ్గర ఒక్క మాట కాదు, చాలానే ఉన్నాయి. అమీర్ గురించి నేను మాట్లాడటం మొదలుపెడితే ఈ సాయంత్రం కూడా సరిపోదు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పెట్టకముందు నుంచి నాకు తెలుసు. నా పక్కన నటించిన వాళ్లంతా ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయారు, చూశారా!" అంటూ సరదాగా వ్యాఖ్యానించింది.
{{/usCountry}}ఈ ఇద్దరు భామల కౌంటర్లకు అక్కడ ఉన్న వారంతా తెగ నవ్వేశారు. అయితే, ఇద్దరు హీరోయిన్స్ అమీర్ ఖాన్‌పై సెటైర్లు వేసే సమయంలో హీరో మాజీ భార్య కిరణ్ రావు పక్కనే ఉండటం ఈ పంచ్‌లు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారి వైరల్ అవుతున్నాయి.
అమీర్ ఖాన్ పెళ్లిళ్లు, పిల్లలు
ఇదిలా ఉంటే, అమీర్ ఖాన్ మొదట రీనా దత్తాను వివాహం చేసుకోగా, వారికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే పిల్లలు ఉన్నారు. ఆమెతో విడిపోయిన తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్ రావును పెళ్లాడారు. వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో కిరణ్ రావుతో కూడా విడిపోతున్నట్లు అమీర్ ఖాన్ ప్రకటించారు.
అయితే, వీరిద్దరూ కలిసి కొడుకు బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, అమీర్ ఖాన్ త్వరలోనే తన భాగస్వామి గౌరీ స్ప్రట్‌ను జూలై 5న ఒక ప్రైవేట్ వేడుకలో మూడో వివాహం చేసుకోనున్నారనే వార్తలు బాలీవుడ్‌లో బలంగా వినిపిస్తున్నాయి.
బాక్సాఫీస్ హిట్
గతంలో అమీర్ ఖాన్, కాజోల్, జూహీ చావ్లా, అజయ్ దేవగన్ కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఇష్క్' (1997) అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు వీరంతా ఒకే వేదికపై కనిపించడంతో ఆనాటి 'ఇష్క్' వైబ్స్ మళ్లీ వచ్చాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
థియేటర్లలోకి మళ్లీ 'లగాన్'
25 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని 'లగాన్' చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సరికొత్త లగాన్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. 2001లో విడుదలైన ఈ చిత్రం బ్రిటీష్ కాలం నాటి పన్నుల విధింపు, దాని చుట్టూ సాగే క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో సాగుతుంది.
ఆస్కార్ నామినేషన్
ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్‌లో 'బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్' కేటగిరీలో నామినేషన్ దక్కించుకోవడమే కాకుండా, భారత జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ పాపులర్ చిత్రంగా పురస్కారం సొంతం చేసుకుంది.