Saif Ali Khan On Work Balance Life Over Kartavya OTT Release: బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఇవాళ (మే 15) ఓటీటీ రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ కర్తవ్య సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పర్సనల్ లైఫ్ కోసం కెరీర్‌ను పణంగా పెట్టారా?

ముఖ్యంగా తన చిన్న కుమారులు తైమూర్, జెహంగీర్ పుట్టిన తర్వాత తన ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని సైఫ్ స్పష్టం చేశారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన 'కర్తవ్య' ప్రమోషన్లలో పాల్గొన్న సైఫ్, సినీ రంగంలో ఉండే ఒత్తిళ్ల గురించి మనసు విప్పారు.
గతేడాది కాలంగా ఆయన ఏడాదికి ఒకే ప్రాజెక్టు పట్టాలెక్కిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ.. వృత్తిపరంగా ఎదిగే క్రమంలో చాలాసార్లు వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని సైఫ్ అలీ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక ఉదాహరణ చెబుతూ.. "మన ఇల్లు ఒక బేస్ క్యాంప్ లాంటిది. పర్వతాలు ఎక్కే సాహసికులకు తిరిగి వచ్చి సేద తీరడానికి ఆ క్యాంప్ ఎంత ముఖ్యమో, మనకు ఇల్లు కూడా అంతే ముఖ్యం. కానీ, మనం నిరంతరం కొండలు ఎక్కుతూనే (పని చేస్తూనే) ఉంటే, ఏదో ఒక రోజు ఆ బేస్ క్యాంప్ కనుమరుగైపోతుంది" అని సైఫ్ పేర్కొన్నారు. అంటే వృత్తిలో ఎంత ఎదిగినా, ఆ సంతోషాన్ని పంచుకోవడానికి కుటుంబం లేకపోతే ఆ విజయానికి అర్థం లేదని ఆయన ఆంతర్యం.
పిల్లల రాకతో మారిన ప్రాధాన్యతలు
బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత తైమూర్, జెహంగీర్ (జెహ్) పుట్టాక తనలో బాధ్యత పెరిగిందని సైఫ్ చెప్పారు. "ముఖ్యంగా వయసు పెరిగిన తర్వాత తండ్రిని కావడంతో సమయం విలువ తెలిసొచ్చింది. సాయంత్రం ఒక నిర్ణీత సమయానికి ఇంటికి వెళ్లాలని బలంగా అనిపిస్తోంది" అని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు.
{{/usCountry}}బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత తైమూర్, జెహంగీర్ (జెహ్) పుట్టాక తనలో బాధ్యత పెరిగిందని సైఫ్ చెప్పారు. "ముఖ్యంగా వయసు పెరిగిన తర్వాత తండ్రిని కావడంతో సమయం విలువ తెలిసొచ్చింది. సాయంత్రం ఒక నిర్ణీత సమయానికి ఇంటికి వెళ్లాలని బలంగా అనిపిస్తోంది" అని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు.
{{/usCountry}}"ఈ ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఉండే షిఫ్టులు నన్ను చాలా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే షూటింగ్ ఎప్పుడూ 9 గంటలకు మొదలవ్వదు, 9 గంటలకు ముగియదు. ప్యాకప్ అయ్యేసరికి రాత్రి 11 అవుతుంది. రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకోవడం అనేది అసలు జీవితమే కాదు" అని సైఫ్ అలీ ఖాన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తమ షూటింగ్‌ల మధ్య విదేశీ పర్యటనలకు వెళ్తూ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. తన పెద్ద పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీంలు ఎదుగుతున్న సమయంలో పని ఒత్తిడి వల్ల వారికి తగినంత సమయం కేటాయించలేకపోయానని ఆయన గతంలోనూ పలుమార్లు వాపోయారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
అందుకే ఇప్పుడు చిన్న కుమారుల విషయంలో ఆ తప్పు జరగకూడదని సైఫ్ అలీ ఖాన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం కర్తవ్య ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో కర్తవ్య ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం హిందీ భాషలోనే కర్తవ్య ఓటీటీ రిలీజ్ అయింది.
ఈ కర్తవ్య చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఒక నేరాన్ని ఛేదించే క్రమంలో తన కుటుంబం ప్రమాదంలో పడితే, ఒక అధికారిగా తన బాధ్యత నెరవేర్చాలా లేక తండ్రిగా కుటుంబాన్ని కాపాడుకోవాలా? అనే సంఘర్షణ చుట్టూ ఈ సినిమా సాగుతుంది.
ఓటీటీ ఆడియెన్స్‌కు బెస్ట్ ఛాయిస్
నిజ జీవితంలో కూడా సైఫ్ ఇప్పుడు కుటుంబానికే అగ్రతాంబూలం ఇస్తుండటం విశేషం. ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా, రసిక దుగ్గల్ కీలక పాత్రల్లో నటించారు. కాగా, ఫ్యామిలీ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఓటీటీ ఆడియెన్స్ నెట్‌ఫ్లిక్స్‌లోని కర్తవ్య బెస్ట్ ఛాయిస్.