...
...
Next Story

Koffee With Karan 9 OTT: ఓటీటీలోకి కాఫీ విత్ కరణ్ సీజన్ 9- ఆ పండుగకు ముహూర్తం ఫిక్స్ చేసిన దర్శకనిర్మాత- ఎప్పుడు, ఎక్కడ?

Karan Johar Confirmed Koffee With Karan Season 9 OTT Release: పాపులర్ ఓటీటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ నుంచి తొమ్మిదో సీజన్ వచ్చేస్తోంది. కాఫీ విత్ కరణ్ సీజన్ 9 ఓటీటీ రిలీజ్‌పై తాజాగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Published on: Apr 25, 2026, 17:51:27 IST
Advertisement

Koffee With Karan Season 9 OTT Release Confirmed: బాలీవుడ్ పాపులర్ ఓటీటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' కొత్త సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. వివాదాలకు, సెన్సేషనల్ కామెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ షో సీజన్ 9 ఎప్పుడు ప్రారంభం కానుందో కరణ్ జోహార్ స్వయంగా వెల్లడించారు.

ఓటీటీలోకి కాఫీ విత్ కరణ్ సీజన్ 9- ఆ పండుగకు ముహూర్తం ఫిక్స్ చేసిన దర్శకనిర్మాత- ఎప్పుడు, ఎక్కడ?
ఓటీటీలోకి కాఫీ విత్ కరణ్ సీజన్ 9- ఆ పండుగకు ముహూర్తం ఫిక్స్ చేసిన దర్శకనిర్మాత- ఎప్పుడు, ఎక్కడ?

గత ఏడాది (2024) సీజన్ 8 ముగిసిన తర్వాత, మళ్లీ ఈ షో ఎప్పుడు మొదలవుతుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడిచాయి. ఇటీవల 'ది వీక్' నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కరణ్ జోహార్‌ను ఒక అభిమాని ఇదే ప్రశ్న అడిగారు. దీనికి కరణ్ చిరునవ్వుతో సమాధానమిస్తూ.. "ఈ ఏడాది దీపావళికి సీజన్ 9 ప్రారంభం కానుంది" అని ప్రకటించారు.

వివాదాల సీజన్ 8.. గుర్తుందిగా?

దీంతో ఈ పండగ సీజన్‌లో బాలీవుడ్ స్టార్ల లోగుట్టులు మరోసారి రచ్చకెక్కడం ఖాయమని అర్థమవుతోంది. గత సీజన్ (సీజన్ 8) ఎన్నో సంచలనాలకు వేదికైంది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొణె జంట తమ రిలేషన్‌షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట విపరీతమైన ట్రోలింగ్‌కు దారితీశాయి.

వీరితో పాటు షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, ఆలియా భట్ వంటి అగ్ర తారలు హాజరై సందడి చేశారు. అలాగే జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, రాణి ముఖర్జీ, కాజోల్, అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి, వరుణ్ ధావన్ వంటి వారు కూడా తమ మనసులోని మాటలను పంచుకున్నారు. ఈ షో ద్వారానే సన్నీ డియోల్, బాబీ డియోల్ తమ సెకండ్ ఇన్నింగ్స్ జోష్‌ను ప్రదర్శించారు.

రెండు దశాబ్దాల ప్రస్థానం.. మారని క్రేజ్

క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన డేటింగ్ లైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు కెరీర్‌నే ఇబ్బందుల్లో పడేయగా, ఒక చిన్న రాపిడ్ ఫైర్ ప్రశ్న వల్ల ఆలియా భట్ ఏళ్ల తరబడి సోషల్ మీడియాలో సెటైర్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.

కరణ్ వర్సెస్ కంగనా: 'నెపోటిజం' మచ్చ పోతుందా?

ఈ ఓటీటీ షో చరిత్రలోనే అతిపెద్ద వివాదం కంగనా రనౌత్ ఎపిసోడ్ అని చెప్పాలి. 2017లో కరణ్ జోహార్ ముఖం మీదే ఆయన్ను 'మూవీ మాఫియా' అని, 'వారసత్వ రాజకీయాలకు (నెపోటిజం) బ్రాండ్ అంబాసిడర్' అని కంగనా విమర్శించారు. అప్పటి నుంచి బాలీవుడ్‌లో అవుట్ సైడర్స్ వర్సెస్ ఇన్‌సైడర్స్ యుద్ధం మొదలైంది.

ఆ మచ్చ కరణ్ జోహార్‌ను నేటికీ వెంటాడుతూనే ఉంది. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ తన వైఖరిని కాస్త మార్చుకున్నారు. "కరణ్ జోహార్ చెడ్డ వ్యక్తి ఏమీ కాదు. ఆయనకు హ్యూమర్ సెన్స్ ఎక్కువ. కాకపోతే ఆయనకు షో ఆఫ్ అంటే ఇష్టం. వ్యక్తిగతంగా నాకు ఆయనతో సమస్య లేదు" అని వ్యాఖ్యానించడం విశేషం.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

ఇక ఎప్పటిలాగే జియో హాట్‌స్టార్‌లో కాఫీ విత్ కరణ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ దివాళీకి హాట్‌స్టార్‌లో కాఫీ విత్ కరణ్ ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe