...
...
Next Story

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌కి క్షమాపణలు చెప్పిన యంగ్ హీరో విష్ణు విశాల్- ఓదార్చిన ఓటీటీ సంస్థ- అసలు ఏం జరిగిందంటే?

Vishnu Vishal Sorry To Netflix OTT: కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు క్షమాపణలు చెప్పినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సారీ చెప్పినందుకు మీరెందుకు బాధపడుతున్నారని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ప్రతినిధులు విశాల్‌ను ఓదార్చినట్లు కూడా చెప్పుకొచ్చారు.

Published on: Jun 28, 2026, 05:01:51 IST
Advertisement

Vishnu Vishal Sorry To Netflix OTT: కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో, సూపర్‌స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో నటించిన భారీ చిత్రం ‘లాల్ సలామ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

నెట్‌ఫ్లిక్స్‌కి ఓటీటీ రైట్స్

నెట్‌ఫ్లిక్స్‌కి క్షమాపణలు చెప్పిన యంగ్ హీరో విష్ణు విశాల్- ఓదార్చిన ఓటీటీ సంస్థ- అసలు ఏం జరిగిందంటే?
నెట్‌ఫ్లిక్స్‌కి క్షమాపణలు చెప్పిన యంగ్ హీరో విష్ణు విశాల్- ఓదార్చిన ఓటీటీ సంస్థ- అసలు ఏం జరిగిందంటే?

కేవలం బాక్సాఫీస్ పరాజయంతోనే ఆగకుండా, లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల విషయంలోనూ అనేక వివాదాలు తలెత్తాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను దక్కించుకున్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అందులో విడుదల కాలేదు.

చివరకు ఎలాంటి హడావుడి లేకుండా సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో లాల్ సలామ్ స్ట్రీమింగ్ అయింది. ఈ నేపథ్యంలో ‘లాల్ సలామ్’ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థకు తాను స్వయంగా క్షమాపణలు చెప్పినట్లు హీరో విష్ణు విశాల్ తాజాగా వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణు విశాల్, లాల్ సలామ్ సినిమా పరాజయం తనను ఎంతగానో బాధించిందని చెప్పుకొచ్చారు.

తప్పు నాదే.. బాధ్యత తీసుకుంటా: విష్ణు విశాల్

"లాల్ సలామ్ సినిమా థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ వర్కవుట్ కాలేదు. అందుకే నేను నెట్‌ఫ్లిక్స్ సంస్థకు క్షమాపణలు చెప్పాను. దాంతో వాళ్లు 'మీరెందుకు అంతగా బాధపడుతున్నారు?' అని నన్ను అడిగారు. ఒక హీరోగా ఈ సినిమా పరాజయానికి నేనే పూర్తి బాధ్యత వహించాలని, త్వరలోనే ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తానని వారికి చెప్పాను" అని విష్ణు విశాల్ వివరించారు.

విష్ణు విశాల్‌ను ఓదారుస్తూ

అయినప్పటికీ విష్ణు విశాల్ మాత్రం.. ఇది తన సినిమానేనని, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఒక హీరో తన సినిమా పరాజయాన్ని ఒప్పుకుని, ఓటీటీ సంస్థకు క్షమాపణలు చెప్పడం సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.

భారీ నష్టాలు.. మిస్సయిన హార్డ్ డిస్క్ కథ

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన లాల్ సలామ్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాను సుమారు 80 నుంచి 90 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. కానీ, థియేటర్లలో ఈ చిత్రం కేవలం 17.74 కోట్ల ఇండియా గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా సుమారు 31.25 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది. ఈ సినిమా తెచ్చిన నష్టాలు లైకా ప్రొడక్షన్స్ సంస్థను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి.

సన్ నెక్ట్స్‌లో ఓటీటీ రిలీజ్

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఎందుకు విడుదల కాలేదనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది. సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ పోయిందని, అందువల్లే ఓటీటీ కోసం ప్లాన్ చేసిన ప్రత్యేక 'డైరెక్టర్స్ కట్' వెర్షన్ ఎడిటింగ్ ఆలస్యమైందని ఐశ్వర్య రజనీకాంత్ గతంలో ప్రకటించారు. ఈ గందరగోళం వల్లే నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం రద్దయి, చివరకు సినిమా సన్ నెక్ట్స్‌లో ఓటీటీ రిలీజ్ కావాల్సి వచ్చింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe