...
...
Next Story

Lenin OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ- 5 భాషల్లో- స్ట్రీమింగ్ ఎక్కడ, ఏ రోజున అంటే?

Akhil Akkineni Lenin OTT Release Details: అక్కినేని అఖిల్ సరికొత్త రొమాంటిక్ యాక్షన్ డ్రామా లెనిన్ ఓటీటీలోకి వచ్చేయనుంది. జూలై 10న థియేటర్లలో రిలీజైన లెనిన్‌కు పాజిటివ్ టాక్‌తో రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఈ క్రమంలో లెనిన్ ఓటీటీ రైట్స్, శాటిలైట్ హక్కులపై లుక్కేద్దాం.

Published on: Jul 11, 2026, 06:01:42 IST
Advertisement

Akhil Akkineni Lenin OTT Streaming: అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్‌లో ఎట్టకేలకు ఒక సాలిడ్ సక్సెస్ పడిందని రివ్యూస్ వస్తున్నాయి. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' భారీ అంచనాల మధ్య జూలై 10న అంటే నిన్న థియేటర్లలోకి వచ్చింది. గత 11 ఏళ్లుగా ఒక సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా పెద్ద ఊరటనిచ్చిందని చెప్పాలి.

లెనిన్‌కు పాజిటివ్ రెస్పాన్స్

ఓటీటీలోకి నిన్న రిలీజైన అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ- 5 భాషల్లో- స్ట్రీమింగ్ ఎక్కడ, ఏ రోజున అంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ- 5 భాషల్లో- స్ట్రీమింగ్ ఎక్కడ, ఏ రోజున అంటే?

ఉదయం ఆట నుంచే లెనిన్ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు, సమీక్షకులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మెచ్చుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 5 గంటలకే షోలు ప్రారంభం కావడం, టికెట్ రేట్లు పెంచకుండా సామాన్యులకు అందుబాటులో ఉంచడం సినిమాకు కలిసిసొచ్చే అంశంగా మారింది.

లెనిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న రన్ ఒకెత్తయితే, దీని నాన్-థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలను ఆకర్షిస్తున్నాయి. సుమారు 40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైనమెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

రూ. 34 కోట్ల బిజినెస్

నిర్మాత నాగవంశీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను సొంతంగా పంపిణీ చేశారు. థియేటర్లలో విడుదల కావడానికి ముందే ఈ సినిమా సేఫ్ జోన్‌కు వచ్చేసింది. డబ్బింగ్, ఆడియో, శాటిలైట్, ఓటీటీ హక్కుల రూపంలో లెనిన్ చిత్రానికి ఏకంగా 34 కోట్ల రూపాయల భారీ బిజినెస్ జరిగింది.

లెనిన్ డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య గట్టి పోటీ నడిచింది. చివరికి లెనిన్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ (Zee Network) సంస్థ సొంతం చేసుకుంది. అంటే, జీ5 (Zee5)లో లెనిన్ ఓటీటీ రిలీజ్ కానుంది. అలాగే, లెనిన్ శాటిలైట్ (టీవీ టెలికాస్ట్) హక్కులను కూడా భారీ ఫ్యాన్సీ రేటు చెల్లించి దక్కించుకుంది జీ నెట్‌వర్క్.

జీ తెలుగులో లెనిన్ టీవీ ప్రీమియర్

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నిబంధనల ప్రకారం.. థియేటర్లలో విడుదలైన ప్రతి పెద్ద సినిమా కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల రన్ పూర్తయిన తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి రావాలి. 'లెనిన్' చిత్ర బృందం కూడా ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తోంది. థియేటర్లలో తొలిరోజే హిట్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ సాధించేలా కనిపిస్తోంది.

లెనిన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

వసూళ్లు గట్టిగా ఉంటే ఓటీటీ విడుదల కొద్దిగా ఆలస్యం కావచ్చు. అంతా అనుకున్నట్లు సాగితే ఆగస్టు రెండో వారంలోనే డిజిటల్ స్క్రీన్‌లపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆగస్ట్ 14న జీ5 ఓటీటీలో లెనిన్ రిలీజ్ కానుందని ప్రస్తుతం నడుస్తున్న టాక్. అంతేకాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో ఓటీటీలోకి లెనిన్ రానుందని సమాచారం.

ఒకవేళ థియేట్రికల్ రన్ పొడిగిస్తే, ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో జీ5 వేదికగా అఖిల్ లెనిన్ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటీటీ రిలీజ్ వరకు ఎదురుచూసే బదులు అఖిల్ మాస్ యాక్షన్‌ను థియేటర్లలోనే ఆస్వాదించడం ఉత్తమని రివ్యూవర్స్ చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks