...
...
Next Story

Lenin OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన అక్కినేని అఖిల్ లెనిన్- పగ, ప్రతికారం, ట్విస్టులు, ఎమోషనల్ సీన్స్‌తో- ఇక్కడ చూసేయండి!

Lenin OTT Streaming Today: అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన రూరల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా లెనిన్ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. మహాభారతం, రామాయణం ఛాయలతో తెరకెక్కిన లెనిన్ జూలై 10న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి లెనిన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 7, 2026, 06:05:04 IST
Advertisement

Lenin OTT Release Today: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కొంత గ్యాప్ తర్వాత నటించిన సినిమా లెనిన్ (Lenin). రూరల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన లెనిన్ సినిమాలో అఖిల్ అక్కినేనికి జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించింది.

రాజకీయం, పగ, ప్రతీకారాలతో

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన అక్కినేని అఖిల్ లెనిన్- పగ, ప్రతికారం, ట్విస్టులు, ఎమోషనల్ సీన్స్‌తో- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన అక్కినేని అఖిల్ లెనిన్- పగ, ప్రతికారం, ట్విస్టులు, ఎమోషనల్ సీన్స్‌తో- ఇక్కడ చూసేయండి!

జూలై 10న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ఈ లెనిన్ చిత్రం, గ్రామీణ నేపథ్యం, రాజకీయం, ప్రేమ, పగ, ప్రతీకారాల అంశాలతో రూపుదిద్దుకుంది. థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న లెనిన్ ఓటీటీలోకి ఇవాళ (ఆగస్ట్ 7) వచ్చేసింది.

చిత్తూరు నేపథ్యం..

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' కథ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామీణ వాతావరణంలో సాగుతుంది. 1976 కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఈ సినిమాను మలిచారు. ఊరి పెద్ద జయమ్మ సంరక్షణలో పెరిగిన ఒక అనాథ కుర్రాడు, పెరిగి పెద్దయ్యాక భారతి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.

'మహాభారతం' ఛాయలు

ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఊరి రాజకీయాలు అతని ప్రేమను, ఉనికిని ఎలా ప్రభావితం చేశాయి? అనేదే ప్రధాన కథాంశం. ఈ కథనంలో రామాయణం, మహాభారతం లాంటి భారతీయ ఇతిహాసాల ఛాయలు, పాత్రల రూపాంతరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఊరమాస్ లుక్‌లో అఖిల్.. పాత్రల్లో ఒదిగిపోయిన నటులు

ఇప్పటివరకు ఎక్కువగా అర్బన్, చాక్లెట్ బాయ్, లేదా స్టైలిష్ యాక్షన్ పాత్రల్లో కనిపించిన అఖిల్ అక్కినేని, ఈ సినిమాలో పూర్తి భిన్నమైన పల్లెటూరి మాస్ లుక్‌లో అలరించారు. మూడేళ్ల విరామం తర్వాత వచ్చిన అఖిల్, క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌లో జీవించారని ప్రశంసలు అందుకున్నారు.

తొలి భాగంలో కథ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, ద్వితీయార్థంలో వచ్చే ట్విస్టులు, ఎమోషనల్ సీన్లు, ఆకట్టుకునే క్లైమాక్స్ ఓటీటీ వీక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయనడంలో సందేహం లేదు. బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకున్న లెనిన్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 6.7 రేటింగ్ వచ్చింది.

సుమారు 40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైనమెంట్స్ సంయుక్తంగా లెనిన్ చిత్రాన్ని నిర్మించాయి. నిర్మాత నాగవంశీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను పంపిణీ చేశారు. థియేటర్లలో విడుదల కావడానికి ముందే లెనిన్ సినిమా సేఫ్ జోన్‌కు వచ్చింది. డబ్బింగ్, ఆడియో, శాటిలైట్, ఓటీటీ హక్కుల రూపంలో లెనిన్ చిత్రానికి ఏకంగా రూ. 34 కోట్ల భారీ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

లెనిన్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇలాంటి లెనిన్ ఓటీటీలో అడుగుపెట్టి ఎంటర్‌టైన్ చేస్తోంది. లెనిన్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) దక్కించుకుంది. ఆగస్ట్ 7 నుంచి అంటే నేటి నుంచి జీ5లో లెనిన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి జీ5లో కేవలం తెలుగు భాషలో మాత్రమే లెనిన్ ఓటీటీ రిలీజ్ అయింది. థియేటర్లలో మిస్సయిన ఆడియన్స్ జీ5 ఓటీటీలో లెనిన్ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks