Friday Top 7 OTT Release Movies Today: వారాంతం వచ్చిందంటే చాలు సినిమా ప్రియుల చూపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వైపే ఉంటుంది. థియేటర్లలో కొత్త సినిమాలు చూసే అవకాశంతో పాటు ఇంట్లోనే కూర్చుని వైవిధ్యమైన కథలను ఆస్వాదించేందుకు ఓటీటీ సంస్థలు సరికొత్త చిత్రాలను రెడీ చేశాయి.
టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు

ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 25న) ఓటీటీలోకి అస్సలు మిస్ అవ్వకూడని టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు . హారర్, కామెడీ, సస్పెన్స్, రొమాంటిక్ డ్రామా విభాగాల్లో అలరించేందుకు ఈ సినిమాలు సిద్ధమయ్యాయి. నయనతార, అల్లరి నరేష్ సినిమాల నుంచి హారర్ థ్రిల్లర్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ టాప్ 7 సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందు
1. అగధ ఓటీటీ: ప్రముఖ దర్శకుడు ఎమ్.ఎస్. రాజు తెరకెక్కించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. అనుమానాస్పదంగా జరిగిన ఒక మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు అడవిలోని రహస్య గుహ వైపు వెళ్లిన మహాదేవికి ఎదురైన భయంకరమైన అనుభవాలు ఏంటో ఈ కథలో ఉత్కంఠభరితంగా చూపించారు.
2. రంభ ఊర్వశి మేనక ఓటీటీ: అల్లరి నరేష్ తన మార్కు హాస్యంతో అలరించేందుకు వచ్చిన సోషియో ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాలో దేవలోక రంభ, ఊర్వశి, మేనకలతో ఒక సామాన్యుడు చిక్కుల్లో పడటం కథాంశం. దేవలోకంలో జరిగిన ఒక పొరపాటు వల్ల భూలోకంలో తలెత్తిన గందరగోళం, నవ్వులు పూయించే మలుపులతో ఈ సినిమా సాగుతుంది.
యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్లు
3. మ్యాంగో పచ్చ ఓటీటీ: కన్నడ యంగ్ హీరో సంచిత్ సంజీవ్ నటించిన యాక్షన్ డ్రామా ‘మ్యాంగో పచ్చ’. వివేక దర్శకత్వం వహించిన ఈ సినిమా జియో హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మైసూర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో తండ్రి మరణం తర్వాత కుటుంబ రహస్యాలు తెలుసుకునే క్రమంలో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సీడీ షాప్ ఓనర్ ప్రయాణం ఆకట్టుకుంటుంది.
{{/usCountry}}3. మ్యాంగో పచ్చ ఓటీటీ: కన్నడ యంగ్ హీరో సంచిత్ సంజీవ్ నటించిన యాక్షన్ డ్రామా ‘మ్యాంగో పచ్చ’. వివేక దర్శకత్వం వహించిన ఈ సినిమా జియో హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మైసూర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో తండ్రి మరణం తర్వాత కుటుంబ రహస్యాలు తెలుసుకునే క్రమంలో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సీడీ షాప్ ఓనర్ ప్రయాణం ఆకట్టుకుంటుంది.
{{/usCountry}}4. హుంకార్ ది రోర్ ఓటీటీ: సామాజిక అంశంతో తీవ్ర ఉత్కంఠ రేపే ఇన్వెస్టిగేటివ్ డ్రామా ‘హుంకార్: ది రోర్’. జియోహాట్‌స్టార్‌లో తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలో ఒక శక్తివంతమైన బాబాపై లైంగిక ఆరోపణలు చేసిన 17 ఏళ్ల బాలిక కేసును ఛేదించే ఏసీపీ జస్లీన్ సింగ్ సోని పాత్రలో ఫాతిమా సనా షేక్ కనిపించారు. ప్రజా స్పందన, రాజకీయ ఒత్తిళ్ల మధ్య సాగే విచారణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు
5. హాయ్ ఓటీటీ: లేడీ సూపర్ స్టార్ నయనతార, కావిన్ రాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హాయ్!’ చిత్రం జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్న ఇద్ద వ్యక్తుల మధ్య అనుకోకుండా మొదలైన ప్రయాణం, వారి జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను ఈ సినిమాలో మనసుకి హత్తుకునేలా ఆవిష్కరించారు.
6. డోంట్ బి షై ఓటీటీ: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నిర్మాణంలో వచ్చిన యూత్‌ఫుల్ రొమాంటిక్ కాన్సెప్ట్ చిత్రం ‘డోంట్ బి షై’. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం నలుగురు కొత్త నటీనటులతో తెరకెక్కింది. కాలేజీ లవ్ స్టోరీ, ప్రేమలో విఫలమైన తర్వాత తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ఒక అమ్మాయి ప్రయాణాన్ని ఇందులో చూపించారు.
7. హబీబీ ఓటీటీ: దక్షిణ తమిళనాడు సంస్కృతి, తమిళ ముస్లింల జీవన విధానం నేపథ్యంగా రూపుదిద్దుకున్న ఎమోషనల్ డ్రామా చిత్రం ‘హబీబీ’. సోనీ లివ్ (Sony LIV) లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా మానవ సంబంధాలు, స్వచ్ఛమైన ప్రేమకథతో రూపుదిద్దుకుంది. హబీబీ ఓటీటీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.