OTT K Dramas Releasing In October 2026: డిజిటల్ వినోద ప్రపంచంలో కొరియన్ డ్రామాలకు ఉన్న ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. సబ్‌టైటిళ్లు, డబ్బింగ్ సహాయంతో కే-డ్రామాలను ఆస్వాదించే తెలుగు యువత సంఖ్య గణనీయంగా పెరిగింది.
అక్టోబర్ నెలలో

పండుగ వాతావరణం నెలకొన్న అక్టోబర్ నెలలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీగా కే-డ్రామాలను సిద్ధం చేశాయి. రొమాన్స్, మెడికల్ థ్రిల్లర్, చారిత్రక కథాంశాలు, పారానార్మల్ హారర్, కామెడీ విభాగాల్లో అలరించబోయే టాప్ ఓటీటీ కొరియన్ డ్రామాల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
రొమాన్స్, ఎమోషన్ కలబోతగా కొత్త కథలు
బిట్వీన్ స్టెప్స్ ఓటీటీ
అక్టోబర్ 5న డిస్నీ ప్లస్ అంటే జియో హాట్‌స్టార్ వేదికగా ‘బిట్వీన్ స్టెప్స్’ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అనారోగ్యం కారణంగా కాలు కోల్పోయిన ఈతగాడు రోబోటిక్స్ వైపు అడుగులు వేయడం, అక్కడ హీరోయిన్‌తో పరిచయం పెరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించడం చుట్టూ ఈ కథ సాగుతుంది. చూ యంగ్-వూ, కిమ్ సో-హ్యూన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
మేరీ బెర్రీ లవ్ ఓటీటీ
ఇదేకాకుండా కొరియా, జపాన్ దేశాల ఉమ్మడి నిర్మాణంలో రూపుదిద్దుకున్న 'మేరీ బెర్రీ లవ్' అక్టోబర్ 7 నుంచి డిస్నీ ప్లస్‌లో ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. జపాన్‌లోని ఒక ద్వీపంలో స్ట్రాబెర్రీ రైతుకు, వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్న కొరియన్ డిజైనర్‌కు మధ్య చిగురించిన ప్రేమకథగా దీనిని తెరకెక్కించారు. జీ చాంగ్-వుక్, మియో ఇమాడా జంటగా నటించిన ఈ ఓటీటీ సిరీస్ రెండు దేశాల్లోనూ చిత్రీకరణ జరుపుకుంది.
మెడికల్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు
డాక్టర్ X: మాఫియా ఇన్ వైట్
వైద్యరంగంలో రాజకీయాలు, అవినీతి నేపథ్యంగా తెరకెక్కించిన 'డాక్టర్ X: మాఫియా ఇన్ వైట్' అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. ప్రముఖ నటి కిమ్ జి-వోన్ ఆసుపత్రి అక్రమాలను ప్రశ్నించే ధైర్యవంతురాలైన సర్జన్‌గా కనిపించనున్నారు. జపనీస్ ప్రాంచైజీ ఆధారంగా ఈ మెడికల్ నోయిర్ సిరీస్‌ను రూపొందించారు.
టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్
{{/usCountry}}వైద్యరంగంలో రాజకీయాలు, అవినీతి నేపథ్యంగా తెరకెక్కించిన 'డాక్టర్ X: మాఫియా ఇన్ వైట్' అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. ప్రముఖ నటి కిమ్ జి-వోన్ ఆసుపత్రి అక్రమాలను ప్రశ్నించే ధైర్యవంతురాలైన సర్జన్‌గా కనిపించనున్నారు. జపనీస్ ప్రాంచైజీ ఆధారంగా ఈ మెడికల్ నోయిర్ సిరీస్‌ను రూపొందించారు.
టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్
{{/usCountry}}అదే రోజున నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రానున్న మరొక వినూత్న లవ్ స్టోరీ 'టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్'. పిడుగు పడటం వల్ల ఒంట్లో విద్యుత్ శక్తి పొందిన ఒక మహిళ, కృత్రిమ గుండెతో జీవించే వ్యాపారవేత్తను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం ఈ కథలో నవ్వులు పూయిస్తుంది. కిమ్ యంగ్-క్వాంగ్, ఛే సూ-బిన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
చారిత్రక పోరాటాలు, వినూత్న కాన్సెప్ట్‌లు
100 డేస్ ఆఫ్ డిసెప్షన్
1932లో జపనీస్ పాలన నాటి స్వాతంత్య్ర పోరాట నేపథ్యంతో తెరకెక్కిన '100 డేస్ ఆఫ్ డిసెప్షన్' అక్టోబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సీక్రెట్ ఏజెంట్‌గా కిమ్ యూ-జంగ్ నటన ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
మేక్ మీ టింగిల్
ఒక మార్కెటింగ్ నిపుణురాలు, స్టార్టప్ కంపెనీ సీఈఓ మధ్య సాగే రొమాంటిక్ కామెడీ కథ 'మేక్ మీ టింగిల్' అక్టోబర్ 15న వికి వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నామ్ జీ-హ్యూన్, కిమ్ జే-యంగ్ ఈ ఓటీటీ సిరీస్‌లో నటించారు.
ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ బ్లాక్‌బస్టర్లు
లవ్ ఇన్ డిస్గైజ్
మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్‌తో వస్తున్న 'లవ్ ఇన్ డిస్గైజ్' అక్టోబర్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతుంది. సెక్రటరీ హత్య కేసులో అనుమానితుడిగా మారిన పారిశ్రామికవేత్త, అతడి వద్ద అంగరక్షకురాలిగా చేరిన మాజీ సైనిక అధికారిణి మధ్య ఈ డ్రామా నడుస్తుంది. ఇమ్ సి-వాన్, సియోల్ ఇన్-ఆ కీలక పాత్రల్లో నటించారు.
ఫైనల్ టేబుల్- ది పర్‌ఫెక్ట్ లై- డెడ్-ఎండ్ జాబ్
వంటల పోటీ బ్యాక్‌డ్రాప్‌లో అన్ హ్యో-సియోప్ నటించిన 'ఫైనల్ టేబుల్' అక్టోబర్ 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ 'ది పర్‌ఫెక్ట్ లై' అక్టోబర్ 30న డిస్నీ ప్లస్‌లో విడుదల కానుంది. సీయో హ్యూన్-జిన్, యూ యోన్-సోక్ జంటగా నటించిన చిత్రమిది.
అదే రోజున పారానార్మల్ హారర్ కామెడీ ఫాంటసి సిరీస్ 'డెడ్-ఎండ్ జాబ్' నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లీ జే-వూక్, గో మిన్-సి ఇందులో నటిస్తున్నారు. వారాంతాల్లో ఇళ్లలోనే హాయిగా సమయాన్ని గడపాలనుకునే ఓటీటీ ప్రియులకు అక్టోబర్ నెలలో సరికొత్త వినోదం లభించడం ఖాయం.