OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో 13 సినిమాలు- చూసేందుకు అన్నీ చాలా స్పెషల్, 6 మరింత ఇంట్రెస్టింగ్- రెండింట్లో 3, 3!
OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 13 సినిమాలు వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ చాలా స్పెషల్‌గా ఉంటే, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 6 మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్, ఆహాలలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలేంటో చూద్దాం.
OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ విన్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

విభిన్న రకాల జోనర్లు
అలాగే, ఫ్యామిలీ కామెడీ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్, హారర్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, గ్యాంగ్‌స్టర్ డ్రామా, సర్వైవల్ వంటి విభిన్నమైన జోనర్లలో 13 సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
పళ్లబురుసు (తెలుగు విలేజ్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 2
ది రన్నర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 2
జగమే సంగీతం (తెలుగు క్లాసికల్ మ్యూజికల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
గాంధారి (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 3
జీడీ నాయుడు (తెలుగు తమిళ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 4
కొరియన్ కనకరాజు (తెలుగు ఇండో కొరియన్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 4
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ది కోర్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
బిగ్ బాస్ తెలుగు 10 (తెలుగు సెలబ్రిటీ రియాలిటీ షో)- సెప్టెంబర్ 6
మరిన్ని ఓటీటీల్లో
అనంతన్ కాదు (తెలుగు డబ్బింగ్ తమిళ మలయాళ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- సెప్టెంబర్ 2
ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- సెప్టెంబర్ 3
డీసీ (తెలుగు డబ్బింగ్ తమిళ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- సెప్టెంబర్ 4
ది ఎల్లో ఎలిఫెంట్ (తెలుగు డబ్బింగ్ తమిళ సర్వైవల్ డాక్యుమెంటరీ సినిమా)- ఆహా ఓటీటీ- సెప్టెంబర్ 4
జ్ఞాపకాలు (తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- సెప్టెంబర్ 6
ఓటీటీలోకి తెలుగులో 13 సినిమాలు
ఇలా గత వారం (ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు) తెలుగులో 13 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు.
6 సినిమాలు ఇంట్రెస్టింగ్
అయితే, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన పళ్లబురుసు, జగమే సంగీతం, బిగ్ బాస్ 10, జ్ఞాపకాలు, జీడీ నాయుడు, కొరియన్ కనకరాజుతో కలిపి 6 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో 3, 3 సినిమాలు అందుబాటులో ఉన్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


