...
...
Next Story

OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 6 సినిమాలు- ఒక్కరోజే 5, తెలుగులో 5- మృణాల్ ఠాకూర్ క్రైమ్ థ్రిల్లర్ టు హారర్

OTT Release Movies This Week: అక్టోబర్ మొదటి వారంలో సినీ ప్రియులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వినోదాల విందు అందించనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న టాప్ 6 సినిమాలపై లుక్కేద్దాం. వాటిలో మృణాల్ ఠాకూర్ క్రైమ్ థ్రిల్లర్ నుంచి హారర్ మూవీ వరకు ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

Published on: Sep 28, 2026, 14:51:35 IST
Advertisement

Top 6 OTT Release Movies To Watch This Week: అక్టోబర్ ఆరంభంలోనే ఓటీటీ తెరపై వినోదాల పండుగ మొదలవుతోంది. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలు చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులకు ఈసారి ఓటీటీల్లో వరుసగా డిఫరెంట్ జోనర్ సినిమాలు ముందుకు వస్తున్నాయి.

టాప్ 6 ఓటీటీ సినిమాలు

ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 6 సినిమాలు- ఒక్కరోజే 5, తెలుగులో 5- మృణాల్ ఠాకూర్ క్రైమ్ థ్రిల్లర్ టు హారర్
ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 6 సినిమాలు- ఒక్కరోజే 5, తెలుగులో 5- మృణాల్ ఠాకూర్ క్రైమ్ థ్రిల్లర్ టు హారర్

అయితే, వీటిలో ఈ వారం ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. రొమాంటిక్ కామెడీలు, మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్లు, భయపెట్టే హారర్ కథల వరకు ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా విభిన్నమైన ఈ టాప్ 6 ఓటీటీ సినిమాలపై లుక్కేద్దాం.

నవ్వులు పూయించే రొమాంటిక్ కామెడీలు

రోమాంచకం (నెట్‌ఫ్లిక్స్ - అక్టోబర్ 1):

'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం 'రోమాంచకం'. హైదరాబాద్‌లో స్టార్టప్ ప్రారంభించాలనుకునే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అన్వేష్, చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్‌కుమార్)తో డేటింగ్ యాప్‌లో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత వారిద్దరూ కలుసుకునే క్రమంలో స్నేహితుల వల్ల ఎదురయ్యే గందరగోళాలు, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి.

#లవ్ (నెట్‌ఫ్లిక్స్ - అక్టోబర్ 2):

ఓజీ విలన్ అర్జున్ దాస్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ఓటీటీ సిరీస్ #లవ్ (#Love). డేటింగ్ యాప్‌ల పోటీ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు తమ సిద్ధాంతాలను నిరూపించుకోవడానికి 60 రోజుల ఛాలెంజ్ స్వీకరిస్తారు. ఆ తర్వాత ఏమైందనేదే మిగతా కథ. తెలుగు సహా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ 5 భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో #లవ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

కుటుంబ కథనాలు, హృదయానికి హత్తుకునే డ్రామాలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ (జియో హాట్‌స్టార్ - అక్టోబర్ 2):

టేలర్ పెర్రీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇంగ్లీష్ చిత్రం ఒక ఒంటరి తల్లి జీవిత పోరాటాన్ని ఆవిష్కరిస్తుంది. జైలులో ఉన్న ఒక ఖైదీతో లేఖల ద్వారా ఏర్పడిన పరిచయం ఆమె జీవితాన్ని ఎలా మార్చింది, నమ్మకం, ఆశల చుట్టూ కథ ఎలా సాగిందనేది ఇందులో ప్రధానంగా చూపించారు. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌తో కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ 2న అందుబాటులోకి రానుంది.

థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా, గూస్‌బంప్స్ తెప్పించే హారర్

పూజ మేరీ జాన్ (జీ5 - అక్టోబర్ 2):

తెలుగు హీరోయిన్ మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా పూజా మేరీ జాన్. ప్రేమను తిరస్కరించిన కారణంగా ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, ఆ నేరం అతని లవర్ పూజపై పడటంతో కథ తీవ్రమైన మలుపు తిరుగుతుంది. నైతిక విలువలు, చట్టపరమైన పోరాటం చుట్టూ సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకోనుంది.

ఈవిల్ డెడ్ బర్న్ (జీ5 - అక్టోబర్ 2):

హారర్ సినిమాలను ఇష్టపడేవారి కోసం 'ఈవిల్ డెడ్' ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సరికొత్త చిత్రం 'ఈవిల్ డెడ్ బర్న్'. సెబాస్టియన్ వానెక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దురదృష్టవశాత్తూ విముక్తి పొందిన దెయ్యాలు ఒక కుటుంబంలో ఎలాంటి భయాందోళనలు సృష్టించాయో చూపించారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో జీ5లో ఈవిల్ డెడ్ బర్న్ ఓటీటీ రిలీజ్ కానుంది.

ఒక్కరోజే 5, తెలుగులో 5

ఇలా ఈ వారం చూడాల్సిన టాప్ 6 సినిమాలుగా ఉన్నాయి. వీటిలో ఒక్క పూజా మేరీ జాన్ తప్పా మిగతా ఐదు సినిమాలు తెలుగులో ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ఒక్క అక్టోబర్ 2 నుంచి 5 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks