ఓటీటీ చరిత్రలో ఒక దశాబ్ద కాలంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న ఒక రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. ‘బ్రేకింగ్ బాడ్’ ఐదో సీజన్‌లోని ‘ఓజిమాండియాస్’ (Ozymandias) ఎపిసోడ్‌కు ఉన్న 10/10 ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్ ఇప్పుడు 9.9కి పడిపోయింది. అయితే, ఈ మార్పు ఎపిసోడ్ కంటెంట్ వల్ల కాకుండా, రెండు షోల అభిమానుల మధ్య మొదలైన ‘డిజిటల్ యుద్ధం’ కారణంగా జరగడం గమనార్హం.
వివాదానికి కారణం ఏంటి?

ఇటీవల సూపర్ హిట్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ప్రీక్వెల్ సిరీస్ ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఫిబ్రవరి 15న విడుదలైన ఈ ఓటీటీ సిరీస్ ఐదో ఎపిసోడ్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ ది మదర్’ (In the Name of the Mother) అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. ఓటీటీ స్ట్రీమింగ్ అయిన వెంటనే దీనికి కూడా ‘ఓజిమాండియాస్’ తరహాలోనే 10/10 రేటింగ్ లభించింది.
కానీ, కొద్దిరోజుల్లోనే ఈ రేటింగ్ 9.8కి, ఆపై 9.7కి పడిపోయింది. ‘బ్రేకింగ్ బాడ్’ అభిమానులే కావాలని తమ షో రికార్డును కాపాడుకోవడానికి ఈ కొత్త ఎపిసోడ్‌పై ప్రతికూల రివ్యూలతో దాడి (Review Bombing) చేశారని ‘ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్’ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
ప్రతీకారంగా ‘రివ్యూ బాంబింగ్’
తమ షో రేటింగ్ తగ్గించడాన్ని తట్టుకోలేకపోయిన ‘ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్’ అభిమానులు ప్రతీకారానికి దిగారు. సోషల్ మీడియా వేదికగా ఒక్కటై ‘ఓజిమాండియాస్’ ఎపిసోడ్‌కు తక్కువ రేటింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు.దాంతో గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం (ఫిబ్రవరి 20) ఈ ఎపిసోడ్ రేటింగ్ 9.9కి పడిపోయింది.
మొత్తం 3.35 లక్షల రేటింగ్స్‌లో కేవలం గత 24 గంటల్లోనే దాదాపు 50 వేల మంది '1 అవుట్ ఆఫ్ 10' రేటింగ్ ఇవ్వడం ఈ దాడి తీవ్రతను సూచిస్తోంది.
క్లాసిక్ వర్సెస్ న్యూ సెన్సేషన్
{{/usCountry}}మొత్తం 3.35 లక్షల రేటింగ్స్‌లో కేవలం గత 24 గంటల్లోనే దాదాపు 50 వేల మంది '1 అవుట్ ఆఫ్ 10' రేటింగ్ ఇవ్వడం ఈ దాడి తీవ్రతను సూచిస్తోంది.
క్లాసిక్ వర్సెస్ న్యూ సెన్సేషన్
{{/usCountry}}రాయన్ జాన్సన్ దర్శకత్వంలో 2013లో వచ్చిన బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్‌లోని ‘ఓజిమాండియాస్’ ఎపిసోడ్ ఒక మాస్టర్‌పీస్‌గా గుర్తింపు పొందింది. బ్రయాన్ క్రాన్‌స్టన్ నటన, ఆ ఎపిసోడ్‌లో జరిగే కీలక పాత్ర మరణం ప్రేక్షకులను ఇప్పటికీ ఉర్రూతలూగిస్తాయి. దీన్ని ‘ఓటీటీ చరిత్రలోనే అత్యుత్తమ హవర్’గా చాలామంది వర్ణిస్తారు.
మరోవైపు, ఐరా పార్కర్ సృష్టించిన ‘ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్’ ఓటీటీ సిరీస్ డ్రాగన్లు, భారీ యుద్ధాలు లేకపోయినా కేవలం భావోద్వేగపూరితమైన కథనంతో విజయం సాధించింది. పీటర్ క్లాఫీ, డెక్స్‌టర్ సోల్ అన్సెల్ ప్రధాన పాత్రల్లో నటించి ఈ ఓటీటీ సిరీస్ మొదటి సీజన్ ఫినాలే ఈ వారాంతంలో స్ట్రీమింగ్ కానుంది.
ఫ్యాన్ వార్ వల్లే
పదేళ్లుగా ఓటీటీలో 10/10 రేటింగ్‌తో ఆధిపత్యం చెలాయించిన బ్రేకింగ్ బ్యాడ్ ఓజిమాండియస్ ఎపిసోడ్ ఇప్పుడు ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ సిరీస్‌తో 9.9కి పడిపోయింది. రెండు ఓటీటీ షోల ఫ్యాన్స్ వార్ వల్ల ఈ బ్రేకింగ్ బ్యాడ్‌కు ఈ దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ అండ్ జియో హాట్‌స్టార్ ఓటీటీలు
ఇకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో బ్రేకింగ్ బ్యాడ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా.. జియో హాట్‌స్టార్‌లో ఏ నైట్ ఆప్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా ఏ నైట్ ఆప్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.