...
...
Next Story

Peddi TV Premiere: ఓటీటీ రిలీజైన 3 నెలలకు బుల్లితెరపై రామ్ చరణ్ పెద్ది టీవీ ప్రీమియర్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Ram Charan Peddi Worldwide TV Premiere: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బుల్లితెరపైకి వచ్చేస్తోంది. బుచ్చిబాబు సాన మార్క్ డైరెక్షన్, జాన్వీ కపూర్ గ్లామర్‌తో సాగిన పెద్ది ఓటీటీ రిలీజైన 3 నెలలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది.

Published on: Oct 10, 2026, 13:11:18 IST
Advertisement

Ram Charan Peddi Worldwide TV Premiere: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం 'పెద్ది'. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పుడు బుల్లితెరపై అలరించేందుకు సిద్ధమైంది.

తన మార్క్ డైరెక్షన్‌తో

ఓటీటీ రిలీజైన 3 నెలలకు బుల్లితెరపై రామ్ చరణ్ పెద్ది టీవీ ప్రీమియర్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ రిలీజైన 3 నెలలకు బుల్లితెరపై రామ్ చరణ్ పెద్ది టీవీ ప్రీమియర్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

'ఉప్పెన' వంటి సంచలన విజయంతో టాలీవుడ్‌లో తనదైన మార్క్ వేసుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు బుచ్చిబాబు సాన పెద్ది చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందింది.

క్రీడలు, గ్రామీణ నేపథ్యం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు కలబోసిన కథాంశంతో రూపుదిద్దుకున్న 'పెద్ది'.. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఆత్మవిశ్వాసంతో గెలుపు తీరాలకు చేరే ఓ సామాన్య యువకుడి ఆవేశం, ఆరాటాన్ని చూపిస్తుంది.

గేమ్‌ఛేంజింగ్ రోల్‌లో రామ్ చరణ్.. జాన్వీ కపూర్ కెమిస్ట్రీ!

పెద్ది సినిమాలో రామ్ చరణ్ తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథలో 'పెద్ది'గా రామ్ చరణ్ పండించిన ఆవేశం, భావోద్వేగాలు, క్రీడాకారుడిగా పడిన శ్రమ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తాయి. క్లిష్టమైన పరిస్థితుల్లో తన లక్ష్యం కోసం పోరాడే యోధుడిలా రామ్ చరణ్ కనిపిస్తాడు.

ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించి అందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ ఇద్దరి మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తారల తోట.. శివ రాజ్‌కుమార్, జగపతిబాబుల పవర్‌ఫుల్ నటన!

ఇంత మంచి క్రేజ్ తెచ్చుకున్న పెద్ది బుల్లితెరపై సందడి చేయడానికి రెడీగా ఉంది. అక్టోబర్ 11, ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ 'జీ తెలుగు'లో పెద్ది వరల్డ్ టీవీ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. బుల్లితెర వీక్షకులకు దసరా పండుగ తర్వాతి వారంలో మరో భారీ వినోద విందును అందించేందుకు జీ తెలుగు పూర్తి ఏర్పాట్లు చేసింది.

ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో పెద్ది ఓటీటీ రిలీజ్ అయింది. జూలై 9 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి 4 భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తర్వాత జూలై 30న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో పెద్ది హిందీ వెర్షన్ కూడా విడుదలైంది.

ఓటీటీ తర్వాత బుల్లితెరపై

ఓటీటీ రిలీజ్ అయిన 3 నెలలకు పెద్ది టీవీ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన పెద్ది ఇప్పుడు బుల్లితెరపై ఏ స్థాయిలో టీఆర్‌పీ (TRP) రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి. అయితే, వీకెండ్‌లో కుటుంబ సమేతంగా టీవీలో చూడదగ్గ సినిమాగా పెద్ది రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks