సైన్స్ ఫిక్షన్ హారర్ జోనర్ చరిత్రలో అత్యంత భయంకరమైన పాత్రలలో ఒకటి ‘ప్రిడేటర్’. ఈ మూవీ ఫ్రాంచైజీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన ఈ యౌట్జా జీవి అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపై ఇతర గ్రహాల్లో తన వేట సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది.
హారర్, సైన్స్ ఫిక్షన్ ప్రియులను

ప్రపంచవ్యాప్తంగా హారర్, సైన్స్ ఫిక్షన్ ప్రియులను దశాబ్దాలుగా అలరిస్తున్న ఈ సిరీస్ నుంచి వచ్చిన తాజా చిత్రమే ‘ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్’ (Predator: Badlands). గతేడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.
భారీ బడ్జెట్
ఈ ఫ్రాంచైజీలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా ‘బాడ్‌ల్యాండ్స్’ నిలిచింది. సుమారు 105 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 870 కోట్లు) భారీ వ్యయంతో వార్నర్ బ్రదర్స్, 20th సెంచరీ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.
రికార్డు వసూళ్లు
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ సినిమా 185 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ. 1,550 కోట్లు) పైగా వసూళ్లను రాబట్టి, ఈ మూవీ సిరీస్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఫిదా అయిన ధనుష్
ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ విడుదల సమయంలో ఈ సినిమాపై కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన వెంటనే తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. "ప్రిడేటర్ - బాడ్‌ల్యాండ్స్.. వావ్, జస్ట్ వావ్ ఏ మార్వెల్.. ఈ ఫ్రాంచైజీని ఇష్టపడే ఒరిజినల్ ఫ్యాన్స్‌కు ఇదొక ఓజీ లాంటి కానుక" అంటూ ధనుష్ తన ఆనందాన్ని పంచుకున్నారు.
రేటింగ్
ధనుష్ వంటి టాలెంటెడ్ హీరో స్వయంగా ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ సినిమాను మెచ్చుకోవడంతో భారతీయ ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 7.3 రేటింగ్ కూడా ఉంది. అలాగే, 86 శాతం ఫ్రెష్ కంటెంట్ అని కితాబు వచ్చింది.
ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}ధనుష్ వంటి టాలెంటెడ్ హీరో స్వయంగా ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ సినిమాను మెచ్చుకోవడంతో భారతీయ ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 7.3 రేటింగ్ కూడా ఉంది. అలాగే, 86 శాతం ఫ్రెష్ కంటెంట్ అని కితాబు వచ్చింది.
ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}ఇంతటి క్రేజ్ ఉన్న ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ హాలీవుడ్‌లో సైన్స్ ఫిక్షన్ హారర్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కింది. అలాంటి ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 12 నుంచే జియో హాట్‌స్టార్‌లో ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
నాలుగు భాషల్లో
ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో హాట్‌స్టార్‌లో ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ ఓటీటీ రిలీజ్ అయింది. ఎల్లే ఫానింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డాన్ ట్రాచ్‌టెన్‌బర్గ్ దర్శకత్వం వహించారు.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
ఎప్పుడు మనుషులను వేటాడే వింత జీవి ప్రిడేటర్ యౌట్జా, హ్యూమనాయిడ్ రోబో కలిసి చేసే పోరాటం కాన్సెప్ట్‌తో ఈ సినిమా సాగుతుంది. హారర్, యాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ వంటి అంశాలు ఇష్టపడే వారు జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.