...
...
Next Story

అమ్మా మజాకా! క్యాబ్ డ్రైవర్ గొంతు పట్టుకుని మరీ భయపెట్టిన ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా- అలాంటి యాంగిల్ చూడలేదంటూ!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కొత్త ఓటీటీ సినిమా ‘ది బ్లఫ్’ ప్రమోషన్లలో భాగంగా తన తల్లి మధు చోప్రా సాహసం గురించి ఒక షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఒక భయంకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ తన తల్లి తనను ఎలా రక్షించుకుందో ప్రియాంక చోప్రా వివరించారు.

Published on: Feb 20, 2026, 06:55:54 IST
Advertisement

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా త్వరలో ‘ది బ్లఫ్’ (The Bluff) అనే ఓటీటీ సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో ఆమె ఒక మాజీ సముద్రపు దొంగగా (పైరేట్) నటిస్తున్నారు.

తల్లి ధైర్యసాహసాల గురించి

అమ్మా మజాకా! క్యాబ్ డ్రైవర్ గొంతు పట్టుకుని మరీ భయపెట్టిన ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా- అలాంటి యాంగిల్ చూడలేదంటూ!
అమ్మా మజాకా! క్యాబ్ డ్రైవర్ గొంతు పట్టుకుని మరీ భయపెట్టిన ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా- అలాంటి యాంగిల్ చూడలేదంటూ!

ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక తన తల్లి మధు చోప్రాలోని అసలైన ధైర్యసాహసాల గురించి ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రియాంకకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఢిల్లీలో జరిగిన ఒక సంఘటనను ప్రియాంక చోప్రా గుర్తు చేసుకున్నారు.

క్యాబ్ డ్రైవర్ గొంతు పట్టుకున్న అమ్మ!

"మేము ఢిల్లీలోని ఒక హోటల్‌లో ఉంటున్నాము. ఒకసారి క్యాబ్‌లో వెళ్తుండగా, డ్రైవర్ సడెన్‌గా దారి మార్చి తెలియని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అది షార్ట్‌కట్ అని అతను చెప్పినప్పటికీ, అక్కడ ఎవరూ లేకపోవడంతో నా తల్లి ప్రమాదాన్ని పసిగట్టారు. వెనక సీట్లో కూర్చున్న మా అమ్మ, వెంటనే డ్రైవర్ గొంతును గట్టిగా పట్టుకున్నారు. వెంటనే మెయిన్ రోడ్డుకు వెళ్లమని హెచ్చరించారు" అని ప్రియాంక చోప్రా తెలిపారు.

చెంపదెబ్బ కొట్టి మరి

అంతటితో ఆగకుండా మధు చోప్రా ఆ డ్రైవర్‌ను చెంపదెబ్బ కొట్టి మరీ వెనక్కి తీసుకెళ్లారట. "నేను నా కూతురితో ఉన్నాను అని గర్జిస్తూ ఆమె చేసిన ఆ పని చూసి నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత నాలుగు నెలల వరకు ఆమెతో దేనికీ వాదించే సాహసం చేయలేదు" అని ప్రియాంక చోప్రా వెల్లడించారు.

ఒంటరిగా ఉంటే చేసేది కాదేమో

ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది బ్లఫ్’ చిత్రం ఫిబ్రవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 19వ శతాబ్దపు కరీబియన్ నేపథ్యంలో సాగే ఈ కథలో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడే మహిళగా ప్రియాంక కనిపించనున్నారు. ఇందులో కార్ల్ అర్బన్ వంటి హాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషించారు.

రాజమౌళి సినిమాతో రీ-ఎంట్రీ!

ప్రియాంక చోప్రా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్ సినిమా అప్‌డేట్ కూడా వచ్చేసింది. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రానున్న ‘వారణాసి’ (Varanasi) చిత్రంతో ప్రియాంక ఇండియన్ స్క్రీన్ పైకి తిరిగి రానున్నారు.

ఇందులో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పాత్రలో నటిస్తుండగా, మహేశ్ బాబు ‘రుద్ర’గా కనిపించనున్న విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ భారీ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe