మూడు వరుస విజయాల తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి వచ్చిన లేటెస్ట్ విలేజ్ కామెడీ డ్రామా మూవీ అనగనగా ఒక రాజు. ఈ సినిమాలో హీరోకు జోడీగా హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
జనవరి 14న థియేటర్లలో

నూతన దర్శకుడు మారి డైరెక్టర్‌గా పరిచయం అయిన అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచే సినిమా మంచి టాక్ తెచ్చుకుంటోన్నసందర్భంగా అనగనగా ఒక రాజు సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నమ్మకంగా ఉన్నాం
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "అనగనగా ఒక రాజు సినిమాపై ముందు నుంచి నమ్మకంగా ఉన్నాము. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. అన్ని చోట్లా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది" అని అన్నారు.
చివరిలో ఎమోషన్‌కి
"ప్రేక్షకులు సినిమాలో కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో.. అంతకన్నా ఎక్కువ చివరిలో ఎమోషన్‌కి కనెక్ట్ అవుతున్నారు. రానున్న రోజుల్లో థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వసూళ్లు వస్తాయి" అని ప్రొడ్యూసర్ నాగవంశీ జోస్యం చెప్పారు.
కష్టాన్ని మర్చిపోయేలా చేసింది
ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "మా సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ఫలితం మా అందరి కష్టాన్ని మర్చిపోయేలా చేసింది" అని అన్నారు.
ఛాలెంజింగ్ పాత్ర
"నేను పోషించిన చారులత పాత్ర బాగుందని అందరూ ప్రశంసించడం ఆనందంగా ఉంది. నటిగా ఇది ఛాలెంజింగ్ పాత్ర. మొదటిసారి ఇలాంటి క్యూట్ మాస్ కామెడీ చేశాను. సంక్రాంతి పండుగకు నేను నటించిన సినిమా విడుదలై విజయం సాధించడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి తెలిపారు.
ప్రభాస్‌తో మొదలు
{{/usCountry}}"నేను పోషించిన చారులత పాత్ర బాగుందని అందరూ ప్రశంసించడం ఆనందంగా ఉంది. నటిగా ఇది ఛాలెంజింగ్ పాత్ర. మొదటిసారి ఇలాంటి క్యూట్ మాస్ కామెడీ చేశాను. సంక్రాంతి పండుగకు నేను నటించిన సినిమా విడుదలై విజయం సాధించడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి తెలిపారు.
ప్రభాస్‌తో మొదలు
{{/usCountry}}ఇదెలా ఉంటే, ఈ సంక్రాంతి 2026కి బాక్సాఫీస్ బరిలోకి తెలుగు నుంచే ఏకంగా ఐదు సినిమాలు వచ్చాయి. మొదటగా ప్రభాస్ ది రాజా సాబ్‌తో ప్రారంభమైన ఈ పోటీ శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి దాకా కొనసాగింది.
చిరు, రవితేజ సినిమాలు కూడా
మెగాస్టార్ చిరంజీవి నుంచి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ ఫ్యామిలీ డ్రామా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలతో ఈ సంక్రాంతికి థియేటర్లలో కళకళలాడాయి.