Spider Man Brand New Day Indian Box Office Collection: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీల్లో 'స్పైడర్ మ్యాన్' ఒకటి. గత వారం థియేటర్లలోకి వచ్చిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాన్ సృష్టిస్తోంది.

ఉత్తర అమెరికాలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ఓపెనింగ్స్ రికార్డును దాటేసిన స్పైడర్ మ్యాన్ 4 సినిమా భారతదేశంలోనూ ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మన దేశంలో 'పఠాన్', 'యానిమల్' వంటి సంచలన చిత్రాల స్థాయిలోనే ఈ సినిమాకు తొలి వారాంతంలో అదిరిపోయే ఓపెనింగ్స్ లభించాయి.
రూ. 400 కోట్ల దాటిన రాబడిగా హాలీవుడ్ రికార్డు
కేవలం 11 రోజుల వ్యవధిలోనే భారత బాక్సాఫీస్ వద్ద స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా రూ. 400 కోట్ల దాటి భారీ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. టామ్ హాలండ్ సోలో హీరోగా నటించిన ఈ నాలుగో స్పైడర్ మ్యాన్ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే రూ. 60 కోట్ల నెట్ కలెక్షన్‌తో అడుగుపెట్టింది.
తొలి వారాంతానికే ఏకంగా రూ. 254 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అదే జోరును రెండో వారంలోనూ కొనసాగిస్తోంది. రెండో శుక్రవారం రూ. 15 కోట్లు, శనివారం రూ. 31 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ షేక్ చేసింది. 10 రోజుల్లోనే రూ. 380 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిన ఈ మూవీ, ఆదివారం నాటికి ఏకంగా రూ. 420 కోట్ల నెట్ మార్కును దాటేసింది.
అలాగే, 11 రోజుల్లో ఇండియాలో రూ. 455 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది స్పైడర్ మ్యాన్ 4 సినిమా. గతంలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' (గ్రాస్ రూ. 445 కోట్లు), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (రూ. 403 కోట్లు) సాధించిన రికార్డులను సైతం దాటేసి, ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ.
సల్మాన్, ఆమిర్, విజయ్ రికార్డులు గాల్లోకి!
{{/usCountry}}అలాగే, 11 రోజుల్లో ఇండియాలో రూ. 455 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది స్పైడర్ మ్యాన్ 4 సినిమా. గతంలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' (గ్రాస్ రూ. 445 కోట్లు), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (రూ. 403 కోట్లు) సాధించిన రికార్డులను సైతం దాటేసి, ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ.
సల్మాన్, ఆమిర్, విజయ్ రికార్డులు గాల్లోకి!
{{/usCountry}}హాలీవుడ్ సినిమాల రికార్డులను దాటడమే కాకుండా, మన దేశీయ స్టార్ హీరోల రికార్డులకు కూడా స్పైడర్ మ్యాన్ 4 సవాలు విసురుతోంది. సల్మాన్ ఖాన్ ఆల్‌టైమ్ హిట్ 'బజరంగీ భాయిజాన్' (రూ. 320 కోట్లు), దళపతి విజయ్ 'లియో' (రూ. 341 కోట్లు), అమీర్ ఖాన్ 'దంగల్' (రూ. 387 కోట్లు) భారతీయ లైఫ్‌టైమ్ వసూళ్లను ఈ చిత్రం ఇప్పటికే దాటేసింది.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ 'పఠాన్' (రూ. 543 కోట్లు), రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' (రూ. 554 కోట్లు) రికార్డుల వైపు వేగంగా దూసుకెళ్తోంది. లాంగ్ రన్‌లో షారుఖ్ ఆల్‌టైమ్ హిట్ 'జవాన్' (రూ. 640 కోట్లు) రికార్డును దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇండియాలో 4 వేల స్క్రీన్లలో
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,000 స్క్రీన్లలో రోజూ 13,000లకు పైగా షోలతో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నెల 26న కన్నడ రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా విడుదలయ్యే వరకు స్పైడర్ మ్యాన్ 4కి పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడం దీనికి ప్లస్ పాయింట్‌గా మారింది.
పీటర్ పార్కర్ కొత్త ప్రయాణం.. కథేంటంటే?
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో భాగంగా వచ్చిన ఈ 'బ్రాండ్ న్యూ డే' చిత్రంలో టామ్ హాలండ్ పీటర్ పార్కర్‌గా మరోసారి జీవించేశారు. జెండయా (MJ), జేకబ్ బాటలాన్ (నెడ్) కీలక పాత్రల్లో మెరిసారు.
తనను ప్రపంచమంతా మర్చిపోయిన తర్వాత, ఒంటరిగా న్యూయార్క్ నగరంలో జీవిస్తూ నేరాలపై పోరాడే స్పైడర్ మ్యాన్ కథాంశంతో దర్శకుడు డెస్టిన్ డేనియల్ క్రెటన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సడీ సింక్, మార్క్ రుఫాలో, జాన్ బెర్న్‌థాల్ నటించిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా అటు మాస్ యాక్షన్, ఇటు ఎమోషన్స్ కలబోతగా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.