హీరోలుగా మారిన నేషనల్ లెవెల్‌లో స్టార్‌డమ్, క్రేజ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పటికీ స్టార్ కిడ్స్, బిగ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలు మంచి క్రేజ్ కోసం, సూపర్ హిట్ కోసం ఆరాటపడుతున్నారు. అయితే, ఎన్నో ఏళ్లకు రాని విపరీతమైన క్రేజ్ ఒక్క కూతురు పుట్టగానే వచ్చింది ఈ హీరోలకు.

అవును, కో ఇన్సిడెన్స్ లేదా హార్డ్ వర్క్‌తో వచ్చిన అదృష్టమో కానీ ఈ హీరోలకు కూతురు పుట్టాక తలరాత మారిపోయింది. కుమార్తె పుట్టిన తర్వాత చేసిన సినిమాకు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రావడంతోపాటు నేషనల్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం.
యశ్
కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా యశ్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో తెలిసిందే. కన్నడలో హీరోగా అలరించిన యశ్ ఒక్క కేజీఎఫ్ సినిమాతో తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. అలాగే,ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కెట్ చేసిందని సమాచారం.
అయితే, యశ్‌కు కూతురు ఐరా 2018 డిసెంబర్ 2న పుడితే.. కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ అదే ఏడాది డిసెంబర్ 21న విడుదల అయింది. ఈ లెక్కన కూతురు పుట్టాకే యశ్ నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాడని అనుకోవచ్చు.
రణ్‌బీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న రణ్‌బీర్ కపూర్ యానిమల్ మూవీతోనే సౌత్ సినీ ఇండస్ట్రీలో సైతం ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. రణ్‌బీర్, అలియా భట్ దంపతులకు కూతురు రాహా కపూర్ 2022 నవంబర్ 6న జన్మించింది.
కూతురు పుట్టిన సుమారు ఏడాదికి అంటే 2023 డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ అయింది. అప్పటి వరకు ఏ సినిమా చేయిని రణ్‌బీర్ కపూర్ యానిమల్తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా సుమారుగా వెయ్యి కోట్ల మార్కెట్ సాధించింది.
రణ్‌వీర్ సింగ్
{{/usCountry}}కూతురు పుట్టిన సుమారు ఏడాదికి అంటే 2023 డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ అయింది. అప్పటి వరకు ఏ సినిమా చేయిని రణ్‌బీర్ కపూర్ యానిమల్తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా సుమారుగా వెయ్యి కోట్ల మార్కెట్ సాధించింది.
రణ్‌వీర్ సింగ్
{{/usCountry}}ప్రస్తుతం ధురంధర్ ఫీవర్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడిగా బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న రణ్‌వీర్ సింగ్ ధురంధర్ మూవీతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు. రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణె జంటకు కూతురు దువా పదుకొణె సింగ్ 2024 సెప్టెంబర్ 8న పుట్టింది.
కూతురు పుట్టిన ఏడాదికి 2025 డిసెంబర్ 5న ధురంధర్ రిలీజ్ అయి నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతకుముందు రణ్‌వీర్ సింగ్ కూడా ఏ సినిమా చేయలేదు. ఇక ధురంధర్ సినిమాకు ఏకంగా రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చిన విషయం తెలిసిందే.