Sukumar Allu Aravind: అల్లు అరవింద్ కోటి రూపాయల ఛాలెంజ్- లక్ష చెక్కు రాసిచ్చిన సుకుమార్- ఏడ్చేసిన పుష్ప డైరెక్టర్!

Sukumar Loses 1 Crore Challenge Allu Aravind: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఆకాశంలో ఒక తార సినిమాకు సంబంధించి నిర్మాత అల్లు అరవింద్ విసిరిన కోటి రూపాయల ఛాలెంజ్‌లో పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఓడిపోయారు. దాంతో తన ఓటమిని ఒప్పుకుంటూ అల్లు అరవింద్‌కు లక్ష రూపాయల చెక్ రాసిచ్చారు. ఇదంతా ఎందుకో ఇక్కడ చూద్దాం.

Published on: Nov 29, 2026, 10:22:55 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sukumar Loses 1 Crore Challenge Allu Aravind: టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్లకు ఎప్పుడూ కొత్త దారులు వెతికే అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. తాజాగా 'పుష్ప' దర్శకుడు సుకుమార్‌కు విసిరిన ఓ ఆసక్తికర ఛాలెంజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దుల్కర్ సల్మాన్, కొత్త నటి సాత్విక వీరవల్లి జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20న థియేటర్లలో విడుదలైంది.

అల్లు అరవింద్ కోటి రూపాయల ఛాలెంజ్- లక్ష చెక్కు రాసిచ్చిన సుకుమార్- ఏడ్చేసిన  పుష్ప డైరెక్టర్!
అల్లు అరవింద్ కోటి రూపాయల ఛాలెంజ్- లక్ష చెక్కు రాసిచ్చిన సుకుమార్- ఏడ్చేసిన పుష్ప డైరెక్టర్!

ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చకుండా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో వచ్చిన ఈ చిత్రాన్ని చూస్తూ ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చకుండా థియేటర్ నుంచి బయటకు వస్తే రూ.కోటి ఇస్తానని అరవింద్ పందెం కాశారు. కానీ, ఆకాశంలో ఒక తార సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలకు సుకుమార్ కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఈ ఛాలెంజ్‌లో ఓడిపోయారు.

సుకుమార్ పోస్ట్ చేసిన రూ.లక్ష చెక్కు కథేంటి?

తన ఓటమిని అంగీకరిస్తూ సుకుమార్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అల్లు అరవింద్ ఫోటోతో పాటు ఆయన పేరు మీద రాసిన రూ.లక్ష చెక్కును పంచుకున్నారు. "నిన్న నాకు అరవింద్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన నాకో ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరారు.. 'ఏయ్ సుకుమార్, వెళ్లి ఆకాశంలో ఒక తార చూడు! థియేటర్ నుంచి కన్నీళ్లు పెట్టుకోకుండా బయటకు వస్తే నీకు రూ.కోటి ఇస్తాను. లేదంటే నువ్వు నాకు రూ.లక్ష ఇవ్వాలి' అన్నారు. ఎంత ఖరీదైన సిఫార్సు సార్ ఇది" అంటూ సుకుమార్ సరదాగా రాసుకొచ్చారు.

ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది సుకుమార్ లాంటి మాస్ డైరెక్టర్‌నే కదిలించిందంటే ఆకాశంలో ఒక తార సినిమాలో ఏ స్థాయి భావోద్వేగాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

అల్లు అరవింద్ కోటి రూపాయల ఛాలెంజ్‌పై సుకుమార్ పోస్ట్
అల్లు అరవింద్ కోటి రూపాయల ఛాలెంజ్‌పై సుకుమార్ పోస్ట్

'ఆకాశంలో ఒక తార' కథ, బాక్సాఫీస్ లెక్కలు

పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గుణ్ణం గంగరాజు, వసంత్ జుర్రు కథా సహకారం అందించారు. లైట్‌బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు. శ్రుతి హాసన్, రుహానీ శర్మ కీలక పాత్రల్లో మెరిశారు. వ్యోమగామి కావాలని కలలు కనే కల్పన అనే యువతి, అనుకోని పరిస్థితుల్లో ఆమెను పెళ్లి చేసుకున్న ఓ మధ్యతరగతి మెకానిక్ తన భార్య కలను నిజం చేసేందుకు ఎలాంటి పోరాటం చేశాడన్నదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.

నవంబర్ 20న రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల నటించిన భారీ చిత్రం 'ఓం: ఆపరేషన్ మోల్'కు పోటీగా ఆకాశంలో ఒక తార సినిమా విడుదలైంది. ఆరంభంలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మౌత్ టాక్ పెరగడంతో 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన 'ఓం' మిశ్రమ సమీక్షల మధ్యే రూ.118 కోట్ల గ్రాస్ రాబట్టింది. నెమ్మదిగా మొదలైన 'ఆకాశంలో ఒక తార' పాజిటివ్ టాక్ సాయంతో లాంగ్ రన్‌లో ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.

అరవింద్, సుకుమార్ తదుపరి ప్రాజెక్టులు ఇవే

ప్రస్తుతం అల్లు అరవింద్ పలు ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ 'ఎం.ఎస్ - ఏ లెగసీ ఆన్ స్క్రీన్' చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. 2027-28 సంవత్సరాలకు గాను మరిన్ని భారీ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఇటీవల ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.

మరోవైపు అల్లు అర్జున్‌తో 'పుష్ప' చిత్రాలతో దేశవ్యాప్త సంచలనం సృష్టించిన సుకుమార్.. 'రంగస్థలం' తర్వాత మరోసారి రామ్ చరణ్‌తో జతకడుతున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'పుష్ప 3' పై కూడా ఆయన గతంలో హింట్ ఇచ్చినప్పటికీ, దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.