...
...
Next Story

Taapsee Pannu: పెంపకాన్ని బట్టే ఆమె ప్రవర్తన- స్టార్ హీరోయిన్‌పై తాప్సీ కామెంట్స్- రాజకీయాల్లోకి రావడంపై కూడా క్లారిటీ!

Taapsee Pannu About Kangana Ranaut And Political Entry: ఒకప్పటి టాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. పెంపకాన్ని బట్టే ప్రవర్తన ఉంటుందని చెప్పుకొచ్చింది. అలాగే, రాజకీయాల్లోకి ప్రవేశించడంపై కూడా క్లారిటీ ఇచ్చింది తాప్సీ పన్ను. తాప్సీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 22, 2026, 22:23:13 IST
Advertisement

Taapsee Pannu About Kangana Ranaut And Political Entry: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హీరోయిన్లలో కంగనా రనౌత్, తాప్సీ పన్ను ముందు వరుసలో ఉంటారు. 2019, 2020 సమయాల్లో వీరిద్దరి మధ్య నడచిన సోషల్ మీడియా యుద్ధం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.

కంగనాతో విభేదాలపై

పెంపకాన్ని బట్టే ఆమె ప్రవర్తన- స్టార్ హీరోయిన్‌పై తాప్సీ కామెంట్స్- రాజకీయాల్లోకి రావడంపై కూడా క్లారిటీ!
పెంపకాన్ని బట్టే ఆమె ప్రవర్తన- స్టార్ హీరోయిన్‌పై తాప్సీ కామెంట్స్- రాజకీయాల్లోకి రావడంపై కూడా క్లారిటీ!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. కాంట్రవర్సీ క్వీన్ కంగనా, తనకు మధ్య వచ్చిన విభేదాలు గురించి మాట్లాడింది. అలాగే, ఇప్పటివరకు కంగనా రనౌత్‌ను తాను నేరుగా కలవలేదని వెల్లడించింది ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను.

పెంపకాన్ని బట్టే ప్రవర్తన.. తాప్సీ ఘాటు వ్యాఖ్యలు!

కంగనా రనౌత్‌తో ఉన్న గొడవల గురించి మాట్లాడాలని కోరగా తాప్సీ స్పందిస్తూ.. ఇద్దరి వ్యాఖ్యల వెనుక వారి కుటుంబ నేపథ్యం, పెంపకం ఉంటాయని అభిప్రాయపడింది.

నేరుగా చూడలేదు

"నేను ఆమెను ఇప్పటివరకు కలవలేదు. ఈ వివాదాలు రాకముందు కానీ, ఇప్పుడు కానీ ఆమెను నేరుగా చూడలేదు. ఒకరి గురించి మనం మాట్లాడే విధానం మన పెంపకాన్ని, ప్రపంచాన్ని చూసే కోణాన్ని ప్రతిబింబిస్తుంది. ఎవరు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చారో నిర్ణయించుకోవడానికి ఈ విషయాలు చాలు" అని తాప్సీ పేర్కొంది.

బి గ్రేడ్ నటి అంది

గతంలో కంగనా సోదరి రంగోలి చందేల్ సోషల్ మీడియాలో తాప్సీని "సస్తి కాపీ" (చౌకబారు కాపీ) అని విమర్శించగా, ఆ తర్వాత కంగనా కూడా తాప్సీని "బి-గ్రేడ్ నటి" అని సంబోధించింది. అయితే తాను ఏనాడూ కంగనాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఆమె మంచి నటి అని ఒప్పుకోవడానికి తనకు ఎలాంటి అహం లేదని తాప్సీ స్పష్టం చేసింది.

రాజకీయాల్లోకి వస్తున్నారా?

దేశంలో జరిగే రాజకీయ, సామాజిక పరిణామాలపై ఒక చదువుకున్న పౌరురాలిగా స్పందిస్తాను తప్ప, రాజకీయనాయకురాలిగా మారే ఆలోచన లేదని వివరించింది తాప్సీ. ఇక సినిమాల విషయానికొస్తే.. తాప్సీ ఇటీవల 'గాంధారి' అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించింది. తన చిన్నారి కుమార్తెను రక్షించుకోవడానికి ఒక తల్లి చేసే పోరాటం నేపథ్యంలో దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

గాంధారి ఓటీటీ స్ట్రీమింగ్

ఇటీవలే గాంధారి ఓటీటీ రిలీజ్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో గాంధారి ఓటీటీ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తాప్సీ పన్ను గాంధారి ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నట్లు సదరు సంస్థ పేర్కొంది.

తాప్సీ తెలుగు సినిమాలు

ఇదిలా ఉంటే, బ్యూటిఫుల్ తాప్సీ పన్ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత వీర, మిస్టర్ పర్‌ఫెక్ట్, నీవెవరో, వస్తాడు నా రాజు, షాడో, మొగుడు తదితర తెలుగు సినిమాల్లో తాప్సీ పన్ను నటించింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe