తెలుగులో రీసెంట్‌గా వచ్చిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేసిన మెమోరీ కార్డ్ పోతే ఆ ఫొటోగ్రాఫర్ ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడో కామెడీగా చిత్రీకరించిన సినిమా ఇది. ఈ సినిమాలో తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటించారు.
పాజిటివ్ రివ్యూస్

నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8.5 రేటింగ్ కూడా సంపాదించుకుంది. అలాంటి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీలోకి వచ్చేయనుంది.
జీ5 ఓటీటీలో
తాజాగా నిన్న (నవంబర్ 21) ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ ప్రీమియర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పాత్రలోని అమాయకత్వం
హీరో తిరువీర్ మాట్లాడుతూ.. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంలో నేను పోషించిన రమేష్ అనే పాత్ర మనం అందరూ మన టౌన్, గ్రామంలో చూసేలానే ఉంటుంది. అతని పాత్రలోని అమాయకత్వం, తప్పు జరిగినప్పుడు పడే ఆందోళన, తప్పుపు సరిదిద్దుకోవటానికి చేసే ప్రయత్నాలు అన్నీ కామెడీగా ఉంటూనే హృదయానికి హత్తుకునేలా ఉంటాయి" అని అన్నాడు.
భిన్నమైన కోణాలు
"అతని పాత్రలోని భిన్న కోణాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అవే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమా జీ5 ఓటీటీలో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కావటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మందికి సినిమా రీచ్ అవుతుంది. రమేష్ పాత్ర, అతని ప్రపంచం మరింత మందిని మెప్పిస్తుంది" అని హీరో తిరువీర్ చెప్పాడు.
రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం
{{/usCountry}}"అతని పాత్రలోని భిన్న కోణాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అవే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమా జీ5 ఓటీటీలో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కావటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మందికి సినిమా రీచ్ అవుతుంది. రమేష్ పాత్ర, అతని ప్రపంచం మరింత మందిని మెప్పిస్తుంది" అని హీరో తిరువీర్ చెప్పాడు.
రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం
{{/usCountry}}ఇకపోతే ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7పీఎమ్ ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు.
మౌత్ టాక్‌తో కలెక్షన్స్
తొలి ఆట నుంచే ది గ్రేట్ ప్రీ వెడ్డంగ్ షో సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మౌత్ టాక్‌తో అద్భుతమైన స్పందనతో పాటు మంచి మసూళ్లను రాబట్టుకుంది.
బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ కంటెంట్, వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోన్న జీ5లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.