Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు- 5 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 3 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!

Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఐదు సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 3 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ టు రొమాన్స్, నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

Published on: Jan 30, 2026, 12:54:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవి హారర్ కామెడీ, యాక్షన్, మిస్టరీ, రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు రిలీజ్ అయిన ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు- 5 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 3 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు- 5 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 3 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ధురంధర్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 30

మిరాకిల్: ది బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- జనవరి 30

టేక్ దట్ (ఇంగ్లీష్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్)- జనవరి 30

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

దల్ దల్ (హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30

జియో హాట్‌స్టార్ ఓటీటీ

సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ కామెడీ ఫాంటసీ డ్రామా సినిమా)- జనవరి 30

సన్ నెక్ట్స్ ఓటీటీ

పతంగ్ (తెలుగు రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం)- జనవరి 30

ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ

యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ లైవ్ యాక్షన్ పప్పెట్ చిల్డ్రన్ మ్యూజికల్ ఎడ్యుకేషనల్ సిరీస్)- జనవరి 30

జీ5 ఓటీటీ

దేవ్‌కేళ్ (మరాఠీ మైథలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

ఇలా ఇవాళ (జనవరి 30) 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ధురంధర్, సర్వం మాయ, దేవ్‌కేళ్, దల్ దల్, పతంగ్‌తో ఐదు సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 3 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఆ 3 సినిమాల విశేషాలు ఓసారి చూద్దాం.

ధురంధర్ ఓటీటీ

రూ. 1300 కోట్లకుపైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన హిందీ సినిమా ధురంధర్. అన్ని కోట్లు కలెక్ట్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా దురంధర్ నిలిచింది. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా సారా అర్జున్ అడుగు పెట్టింది.

పతంగ్ ఓటీటీ

తెలుగులో తెరకెక్కిన రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమా పతంగ్. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీతో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ప్రీతి పగడాల హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.

సర్వం మాయ ఓటీటీ

మలయాళంలో హారర్ ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన సర్వం మాయ ఓటీటీలోకి తెలుగులో కూడా వచ్చేసింది. నవీన్ పౌలి, ప్రీతి ముకుందన్, రియా శిబు నటించిన ఈ మూవీ తెలుగులో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More