...
...
Next Story

OTT Scams: ఓటీటీలో మైండ్ బ్లాక్ చేసే టాప్ 5 స్కామ్ సిరీస్‌లు- నకిలీ నోట్లు, పేపర్ లీకులతో! అన్నీ రియల్ ఇన్సిడెంట్స్‌వే!

Top 5 OTT Scam Series To Watch: ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన 'స్కామ్ 1992' తరహా మైండ్ గేమ్స్, వ్యవస్థతో ఆటలాడే కథలు మీకు ఇష్టమా? అయితే 7 కంటే ఎక్కువ ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో దూసుకుపోతున్న టాప్ 5 ఓటీటీ స్కామ్ సిరీస్‌లు, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 29, 2026, 14:51:10 IST
Advertisement

Top 5 OTT Scam Series To Watch: వినోద రంగంలో ఒకటైన ఓటీటీలో స్టాక్ మార్కెట్ కుంభకోణంపై వచ్చిన 'స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్టాక్ మార్కెట్ లూప్‌హోల్స్‌ను వాడుకుని ఒక సాధారణ వ్యక్తి భారత ఆర్థిక వ్యవస్థను ఎలా శాసించాడో కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ ఓటీటీ సిరీస్, డిజిటల్ కంటెంట్ రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచింది.

నిజ జీవిత కుంభకోణాల నేపథ్యంలో

ఓటీటీలో మైండ్ బ్లాక్ చేసే టాప్ 5 స్కామ్ సిరీస్‌లు- నకిలీ నోట్లు, పేపర్ లీకులతో! అన్నీ రియల్ ఇన్సిడెంట్స్‌వే!
ఓటీటీలో మైండ్ బ్లాక్ చేసే టాప్ 5 స్కామ్ సిరీస్‌లు- నకిలీ నోట్లు, పేపర్ లీకులతో! అన్నీ రియల్ ఇన్సిడెంట్స్‌వే!

పవర్‌ఫుల్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, మైండ్ గేమ్స్, నిజ జీవిత కుంభకోణాల నేపథ్యంలో సాగే కథలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ తరహా ఓటీటీ సిరీస్‌లు ఎప్పుడూ హాట్ ఫేవరెట్.

టాప్ 5 ఓటీటీ స్కామ్ సిరీస్‌లు

ఇలా రియల్‌గా జరిగిన స్కామ్స్‌పై తెరకెక్కించిన టాప్ 5 ఓటీటీ సిరీస్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ సిరీస్‌లన్నీ దాదాపుగా తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ టాప్ 5 ఓటీటీ స్కామ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.

  1. ఫర్జీ (అమెజాన్ ప్రైమ్ వీడియో) – ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.3

తెలుగు మూలాలున్న టాలెంటెడ్ డైరెక్టర్స్ రాజ్ (సమంత భర్త) అండ్ డీకే ద్వయం తెరకెక్కించిన ఈ సిరీస్‌లో షాహిద్ కపూర్, సౌత్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక మధ్యతరగతి ఆర్టిస్ట్ తన ఆర్ట్ నైపుణ్యాన్ని వాడుకుని, దేశంలోనే ఎవరూ గుర్తుపట్టలేనంత పక్కాగా నకిలీ నోట్లను ఎలా ముద్రించాడనేది ఈ కథ.

2. ది విజిల్ బ్లోయర్ (సోనీ లివ్) – ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.4

ఎలాంటి పెద్ద చదువులు, డిగ్రీలు లేని సాధారణ పల్లెటూరి యువకులు కేవలం మొబైల్ ఫోన్లు వాడుతూ దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్స్ ఎలా చేశారో చూడాలంటే జామ్‌తారా బెస్ట్ ఛాయిస్.

జార్ఖండ్‌లోని ఒక చిన్న గ్రామం కేంద్రంగా సాగే క్రెడిట్ కార్డ్, ఫిషింగ్ స్కామ్‌ల చుట్టూ ఈ కథ నడుస్తుంది. రాజకీయ జోక్యం, పోలీసుల అలసత్వం, డబ్బుపై మనుషులకుండే అత్యాశను ఇందులో చాలా రా (Raw) గా చూపించారు.

4. స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ (సోనీ లివ్) – ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.9

హర్షద్ మెహతా విజయవంతమైన సిరీస్ తర్వాత హన్సల్ మెహతా నిర్మాణంలో వచ్చిన మరో భారీ స్కామ్ ఓటీటీ సిరీస్ ఇది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన అబ్దుల్ కరీమ్ తెల్గీ స్టాంప్ పేపర్ కుంభకోణం నేపథ్యంలో ఇది సాగుతుంది.

ఒక అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి, ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని వేల కోట్ల రూపాయల నకిలీ స్టాంప్ పేపర్లు ఎలా చలామణి చేశాడనేది ప్రధాన కథాంశం. దీనిలోని సస్పెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మీకు మళ్లీ 'స్కామ్ 1992' చూస్తున్న అనుభూతిని ఇస్తాయి.

5. ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్డ్ (2026) (అమెజాన్ ప్రైమ్ వీడియో)– ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.1

దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవినీతిపై అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ 'ఎగ్జామ్' (Exam) ఆకట్టుకుంటోంది. విద్యా వ్యవస్థలో మెరిట్ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని, కోట్లాది రూపాయల చేతులు మారే ఎగ్జామ్ రాకెట్లను ఈ సిరీస్ పచ్చిగా ఎండగట్టింది.

ప్రస్తుత కాలంలో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి వేచి చూసే నిరుద్యోగుల ఆవేదనను, వారి తల్లిదండ్రుల కష్టాలను మేకర్స్ తెరపై సహజంగా ఆవిష్కరించారు. ప్రసిద్ధ మేకర్స్ పుష్కర్-గాయత్రి నిర్మాణంలో వచ్చిన ఈ సిరీస్ నిరుద్యోగులు, విద్యార్థుల కష్టాలను కళ్లకు కడుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe